Telugu Cinema News Live September 17, 2024: Jr NTR: ‘నాతో ఓ సినిమా చేయండి’: ఆ దర్శకుడిని రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్
17 September 2024, 21:56 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- Jr NTR - Devara Promotions: దేవర మూవీ తమిళ ప్రమోషనల్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్‍కు హీరో ఎన్టీఆర్ హాజరయ్యారు. తన మార్క్ స్పీచ్‍తో అదగొట్టారు. అలాగే, తాను దర్శకుడితో డైరెక్ట్ తమిళ చిత్రం చేయాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించారు.
- Sopathulu OTT Movie: సోపతులు సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. తెలంగాణ రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది.
- Million Dollar Listing: India OTT: మిలియన్ డాలర్ లిస్టింగ్ రియాల్టీ సిరీస్ ఇండియాకు కూడా వచ్చేస్తోంది. ఎమ్మీ అవార్డులకు నామినేట్ అయిన ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్ ఖరారైంది. ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- Bigg Boss 8 Telugu New Promo: బిగ్‍బాస్ హౌస్‍లో కొత్త లవ్ ట్రాక్‍లు నడిచేలా కనిపిస్తున్నాయి. నేటి ఎపిసోడ్ రెండో ప్రోమోలో ఇది అర్థమవుతోంది. అలాగే, రేషన్ కోసం నిర్వహించిన గేమ్‍లో మణికంఠపై ప్రేరణ సీరియస్ అయ్యారు.
- Poonam Kaur on Trivikram Srinivas: టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‍పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేశారు. ఆయనను టాలీవుడ్ పెద్దలు విచారించాలంటూ ఓ పోస్ట్ చేశారు. అయితే, దేని గురించో స్పష్టంగా వెల్లడించలేదు.
Choreographer Jani Master Case: రామ్ చరణ్ నటించిన రచ్చ సినిమాతో వెలుగులోకి వచ్చిన జానీ మాస్టర్.. టాలీవుడ్‌లోని టాప్ హీరోలకి కొరియోగ్రఫీ చేశాడు. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న ఈ కొరియోగ్రాఫర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు.
- Jani Master Case Controversy: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైగింక వేధింపుల కేసు నమోదైంది. ఈ అంశం దుమారాన్ని రేపుతోంది. అయితే, ఈ కేసులో బాధితురాలిగా అండగా అల్లు అర్జున్ నిలిచారనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- OTT Malayalam Thriller: ఓటీటీలోకి మలయాళం క్యాంపస్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. సీనియర్ నటి మీనా చాలా రోజుల తర్వాత నటించిన మలయాళం సినిమా ఇది. దీంతో ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
- Stree 2 Box Office Collection: హారర్ కామెడీ మూవీ స్త్రీ2 ఇప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్లలో యానిమల్ మూవీ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ రికార్డుపై కన్నేసింది.
- 35 Chinna Katha Kaadu OTT Release Date: 35- చిన్న కథ కాదు చిత్రం థియేటర్లలో విజయం సాధించింది. మంచి సినిమాగా ప్రశంసలు దక్కించుకుంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఓటీటీ డేట్ కూడా బయటికి వచ్చింది.
- Nandamuri Mokshagna - Prasanth Varma: నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం చేసే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు. అయితే, ఈ సినిమా బడ్జెట్ ఎంత ఉండనుంతో తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఇది ఆశ్చర్యపరిచేలా ఉంది.
- OTT Crime Thriller: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత ఓ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. 2022లో నేరుగా టీవీలోనే రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా.. ఈ వారమే ఆ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
Prabhakar About Trolling In Ramnagar Bunny Teaser Launch: కొడుకు చంద్రహాస్‌పై వచ్చిన ట్రోలింగ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్. చంద్రహాస్ నటించిన రామ్ నగర్ బన్నీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
- Kangana Office: ఓ హీరోయిన్ అప్పుల పాలై ఉన్న ఆఫీస్ అమ్ముకుంటే.. అదే ఏరియాలో ఓ లగ్జరీ ఇల్లు కొన్నాడు మరో హీరో. ఇప్పుడీ రెండు వార్తలూ వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ కంగన కాగా.. ఆ హీరో మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.
Bigg Boss Telugu 8 Manikanta Hugs Yashmi Gowda: బిగ్ బాస్ తెలుగు 8లో లేడి కంటెస్టెంట్ యష్మీ గౌడను వెనుక నుంచి వాటేసుకున్నాడు నాగ మణికంఠ. అది తనకు కంఫర్ట్‌గా లేదని, తనవల్ల కావట్లేదని, మెంటల్ టార్చర్ అని వెక్కి వెక్కి ఏడ్చింది యష్మీ గౌడ. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్ ప్రోమో చూస్తే..
- OTT Bold Movie: ఓటీటీలోకి ఇప్పుడు మరో బోల్డ్ మూవీ నేరుగా వచ్చేస్తోంది. థియేటర్లలో కాకుండా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. గే లవ్ స్టోరీ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా.. స్ట్రీమింగ్ తేదీని తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 17) రివీల్ చేశారు.
OTT Movies Releases This Week: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వారం మొత్తంగా 16 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి రిలీజ్ కానున్నాయి. వాటిలో రెండు తెలుగు సినిమాలతోపాటు ఒకటి హారర్ వెబ్ సిరీస్ స్పెషల్ కానుంది. వీటితోపాటు మొత్తంగా 5 వరకు ఇంట్రెస్టింగ్‌గా చూడాల్సినవి ఉన్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దాం.
- KBC 16 Question: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల గురించి మీకు బాగా తెలుసా? అయితే కేబీసీ 16లో అడిగిన ఈ రూ.50 లక్షల విలువైన ప్రశ్నకు సమాధానం చెప్పగలరేమో చూడండి. ఈ ప్రశ్న ఎదుర్కొన్న కంటెస్టెంట్ మాత్రం సమాధానం చెప్పలేక గేమ్ నుంచి వైదొలిగాడు.
- Manjummel Boys TV Premier Date: మలయాళం బ్లాక్‌బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాగా చరిత్ర సృష్టించిన ఈ సినిమా.. ఓటీటీలోనూ రికార్డులు తిరగరాసిన తర్వాత ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ కానుంది.
Simbaa OTT Streaming And Trending Top 6 Place: యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ సింబా ఓటీటీలో ఊహించని విధంగా దూసుకుపోతోంది. రెండు ఓటీటీల్లో గత పదిరోజులుగా ట్రెండింగ్ అవుతోంది. ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో సింబాను తెరకెక్కించారు.
Nindu Noorella Saavasam September 17th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్‌లో అమర్ విగ్రహం తీసుకొస్తానని వెళ్తుంటే.. తనను వద్దని మనోహరి వెళ్తుంది. తీవ్రవాదులు బాంబ్ పెట్టిన విగ్రహాన్ని మనోహరి ఇంటికి తీసుకొస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్లో..
- Bigg Boss 8 Telugu Voting: బిగ్ బాస్ 8 తెలుగు మూడో వారం హౌజ్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 8 మంది కంటెస్టెంట్లు నామినేట్ కాగా.. ఓటింగ్ లైన్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. వాళ్లలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ను ఇలా కాపాడుకోవచ్చు.
Indraja About Suman In CM Pellam Teaser Launch: సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సీఎం పెళ్లాం. గడ్డం వెంకట రమణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సీఎం పెళ్లాం టీజర్‌ను సోమవారం (సెప్టెంబర్ 16) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇంద్రజ కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
- OTT Horror Comedy Movie: ఓ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ మూవీ రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఇటాలియన్ లాంగ్వేజ్ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం ఇక్కడ అసలు విశేషం. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలు చూసేయండి.
Gundeninda Gudigantalu Serial September 17th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్‌లో శ్రుతికి సంజుతో పెళ్లి చూపులు జరుగుతాయి. ఈ క్రమంలో గన్‌ను గిఫ్ట్‌గా సంజు ఇస్తే శ్రుతి తీసుకోదు. దాంతో శ్రుతి తలకు గన్ గురి పెట్టి బెదిరిస్తాడు సంజు.
Brahmamudi Serial September 17th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్‌లో కావ్య వెళ్లడం కరెక్టే అని చెప్పిన అపర్ణ అత్తమామలను నిలదీస్తుంది. కావ్య వెళ్లకుండా ఎందుకు ఆపలేకపోయారని అంటుంది. కావ్య ఇంటికి వెళ్లి పిలుస్తారు సీతారామయ్య, ఇందిరాదేవి. కానీ, కావ్య రాదు.
- Karthika deepam 2 serial today september 17th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీకాంత్ తోనే పెళ్లి జరుగుతుందని కాదని కాశీని కలిస్తే అతడిని చంపేస్తానని శ్రీధర్ కూతురికి వార్నింగ్ ఇస్తాడు. శుభవార్త చెప్తాడనుకున్న తండ్రి అలా మాట్లాడటంతో స్వప్న గుండె ముక్కలవుతుంది.
Nunakkuzhi Review In Telugu: దృశ్యం డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వం రీసెంట్ సూపర్ హిట్ మలయాళ డార్క్ కామెడీ మూవీ నునాక్కుజి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మంచి హిట్ అందుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉందో నునాక్కుజి రివ్యూలో తెలుసుకుందాం.