Term of Use - https://telugu.hindustantimes.com

వినియోగ నిబంధనలు

హెచ్ టి మీడియా లిమిటెడ్.. హెచ్ టి తెలుగు వెబ్ సైట్ కు మిమ్మల్ని స్వాగతిస్తోంది. సైట్ ఉపయోగించడానికి మా నియమ నిబంధనలు దిగువన పొందుపరిచాం. మీరు సైట్ ఉపయోగించినప్పుడల్లా ఈ నిబంధనలు అమలవుతాయి.

నియమ నిబంధనల్లో ఏదైనా మార్పు ఉన్నట్లయితే, మీరు వాటిని ఈ పేజీలో చూడవచ్చు.

ఈ సైట్ (telugu.hindustantimes.com) ఉపయోగించడానికి హెచ్ టి మీడియా లిమిటెడ్ ఈ క్రింది షరతులను నిర్దేశించింది.

  1. telugu.hindustantimes.com వినియోగించినట్లయితే ఈ నిబంధనలకు చట్టబద్ధంగా కట్టుబడి ఉండటానికి మీరు అనుమతించినట్టవుతుంది. మీరు మొదట telugu.hindustantimes.com సైట్ ను వినియోగించిన వెంటనే ఈ నియమావళి అమలులోకి వస్తుంది. దిగువ పేర్కొన్న అన్ని నిబంధనలకు చట్టబద్ధులై ఉండేందుకు సమ్మతించని పక్షంలో telugu.hindustantimes.com ఉపయోగించవద్దు.
  2. హెచ్ టి మీడియా లిమిటెడ్ ఆన్ లైన్ లో సమాచారం అందించడం ద్వారా ఈ నిబంధనలను మార్చవచ్చు. హెచ్ టి మీడియా లిమిటెడ్ నియమావళిలో మార్పులు తెలుసుకోవడం కోసం దయచేసి ఈ నిబంధనలను రెగ్యులర్గా సమీక్షించండి. భవిష్యత్తులో ఏదైనా నిబంధన మారినప్పటికీ మీరు telugu.hindustantimes.com వినియోగిస్తే, సవరించిన నిబంధనలను పాటించడానికి మీరు చట్టబద్ధంగా బాధ్యత వహిస్తారు.
  3. మీ వ్యక్తిగత వినియోగానికి, వాణిజ్యేతర వినియోగానికి తప్ప మీరు telugu.hindustantimes.com కంటెంట్ ని ఉపయోగించలేరు. కాపీ, పునరుత్పత్తి, పునఃప్రచురణ, డౌన్ లోడ్, పోస్ట్, బ్రాడ్ కాస్ట్ వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు. మీ వ్యక్తిగత, వాణిజ్యేతర ఉపయోగం కాకుండా ఏదైనా హెచ్ టి పోర్టల్లో కంటెంట్ నుంచి అనుసరణలు, మార్పులు లేదా ఏదైనా ఉత్పన్న పని సృష్టించరాదని కూడా మీరు అంగీకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైనా ఇతర ఉపయోగం కోసం హెచ్ టి మీడియా లిమిటెడ్ నుంచి ముందస్తు రాతపూర్వక అనుమతి అవసరం అవుతుంది.
  4. ఈ వెబ్ సైట్ ఉపయోగించే ఇతర వ్యక్తుల హక్కును ఉల్లంఘించని విధంగా telugu.hindustantimes.com వెబ్ సైట్ ను చట్టబద్ధంగా మాత్రమే ఉపయోగించడానికి మీరు అంగీకరించారు. ఎవరైనా వ్యక్తిని వేధించడం లేదా అసౌకర్యానికి గురిచేయడం, అశ్లీల లేదా అభ్యంతరకరమైన కంటెంట్ పంపడం లేదా telugu.hindustantimes.com మధ్య సాధారణ సంభాషణ ప్రవాహానికి అంతరాయం కలిగించడం నిషేధిత ప్రవర్తన పరిధిలోకి వస్తుంది.

డిస్క్లెయిమర్-

ఏ మెటిరియల్ లోనూ చేసిన ప్రకటనకు హెచ్ మీడియా లిమిటెడ్ బాధ్యత వహించదు. telugu.hindustantimes.com లో ప్రచురించే ఏ స్టేట్ మెంట్ పైనా నిపుణుడిని సంప్రదించకుండా ఆధారపడవద్దు. ఒక నిర్ధిష్ట ప్రయోజనం కోసం లేదా నిర్ధిష్ట వ్యక్తి అభ్యర్థన మేరకు ఎలాంటి సమాచారం అందించదు.
telugu.hindustantimes.com లో కనిపించే సమాచారం, పేర్లు, చిత్రాలు, ఫోటోలు, లోగోలు మరియు చిహ్నాలకు మేం ఎలాంటి హామీ ఇవ్వడం లేదు.

telugu.hindustantimes.com నుంచి లింక్ ద్వారా మీరు ఇతర సైట్ లను సందర్శించవచ్చు. ఆ సైట్ లు మా నియంత్రణలో లేవు. వాటి కంటెంట్ కు మేం ఏ విధంగానూ బాధ్యత వహించం.

దిగువ పేర్కొన్న నష్టాలకు హెచ్ టి మీడియా లిమిటెడ్ బాధ్యత వహించదు

(ఎ) డేటా కోల్పోయినట్లయితే

(బి) ఆదాయం లేదా ఆశించిన లాభం కోల్పోవడం

(సి) వ్యాపారం కోల్పోవడం (డి) ఏదైనా అవకాశాన్ని కోల్పోవడం

(ఇ) పేరు ప్రఖ్యాతులు కోల్పోవడం (ఎఫ్) తృతీయ పక్షం ద్వారా కలిగే నష్టం

జి) చర్య రూపంతో సంబంధం లేకుండా telugu.hindustantimes.com వినియోగించడం వల్ల కలిగే ఏదైనా పరోక్ష, పర్యవసాన, ప్రత్యేక లేదా అపార నష్టం ఉన్నట్లయితే.

ఒకవేళ మీరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే:


1) ఏదైనా telugu.hindustantimes.com చర్చలో పాల్గొనడానికి ముందు దయచేసి తల్లిదండ్రుల లేదా సంరక్షకుడి అనుమతిని పొందండి.
మీ గురించి లేదా మరెవరి వ్యక్తిగత సమాచారాన్ని ఎన్నడూ వెల్లడించవద్దు (ఉదాహరణకు, టెలిఫోన్ నెంబరు, ఇంటి చిరునామా లేదా ఈమెయిల్ చిరునామా).

telugu.hindustantimes.com తృతీయపక్ష కంటెంట్

telugu.hindustantimes.com లో ఇతరులు సబ్మిట్ చేసిన ప్రకటనలను మీరు చూస్తారు. ప్రకటనదారులు మాకు సమర్పించే ప్రకటనల సమస్యలకు పూర్తిగా బాధ్యత వహిస్తారు. ఆ ప్రకటన చట్టవిరుద్ధం కాదని వారు ధృవీకరిస్తున్నారు. ప్రకటనలో ఏదైనా దోషం ఉన్నట్లయితే, కొంత భాగం వదిలి వేసి ఉంటే దానికి మేం బాధ్యత వహించం.

భద్రత

దయచేసి మీ గురించి లేదా మరెవరి గురించి వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దు (ఉదాహరణకు: టెలిఫోన్ నెంబరు, ఇంటి చిరునామా లేదా ఇమెయిల్ చిరునామా). దయచేసి ఎలాంటి పోస్టల్ చిరునామాను చేర్చవద్దు. మీరు ఒక చిరునామా గురించి మాకు తెలియజేయాలనుకుంటే, మీరు 'మమ్మల్ని సంప్రదించండి' లింక్ ఉపయోగించవచ్చు.

సాధారణ నిబంధనలు

ఈ నియమాలు ఎప్పటికప్పుడు మారవచ్చు. దయచేసి మీరు అన్ని నియమ నిబంధనలను ఎప్పటికప్పుడు బాగా చదవండి. మారిన నిబంధనలను ప్రచురించాక మీరు సైట్ లను వినియోగించడం కొనసాగిస్తే, మీరు అన్ని నియమ నిబంధనలను ఆమోదించారని పరిగణించినట్లవుతుంది.

telugu.hindustantimes.com నిరంతర, అంతరాయం లేని సేవలను అందించడానికి మేం మా వంతు కృషి చేస్తాం. అయితే మేం దానికి హామీ ఇవ్వం. ఎలాంటి అంతరాయం లేదా ఆలస్యానికి మేం బాధ్యత వహించం.

మేనేజ్మెంట్ లో చట్టం, న్యాయపరిధి

భారత చట్టాలు ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 కింద అన్ని నియమ నిబంధనలను నియంత్రించవచ్చు, విశ్లేషించవచ్చు. దీనికి సంబంధించిన అన్ని సంబంధిత నియమాలు, సూచనలు, ఉత్తర్వులు నోటిఫికేషన్లు కూడా వర్తిస్తాయి.

ఈ సైట్ బ్రౌజ్ చేయడానికి ఎంచుకోవడం ద్వారా, సైట్ యొక్క గోప్యతా విధానాన్ని పాటించడానికి మీరు అంగీకరిస్తున్నారు.