About Us - https://telugu.hindustantimes.com

మా గురించి తెలుసుకోండి

1924లో మహత్మా గాంధీ హిందుస్తాన్ టైమ్స్‌ను ప్రారంభించారు. హెచ్‌టి మీడియా నేడు భారతదేశంలో అతిపెద్ద మీడియా సంస్థలలో ఒకటి. హిందుస్థాన్ టైమ్స్ (ఆంగ్ల వార్తాపత్రిక), హిందుస్థాన్ ( హిందుస్థాన్ మీడియా వెంచర్స్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థ ద్వారా హిందీ దినపత్రిక) సంపాదక బృందం అత్యంత నాణ్యత, సృజనాత్మకత. నిజాయితీతో ముందుకు సాగుతోంది.

హిందుస్థాన్ టైమ్స్‌తో పాటు హెచ్ టి మీడియా మింట్ అనే జాతీయస్థాయి వ్యాపార వార్తాపత్రికను ప్రచురిస్తోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, ఛండీగఢ్, పూణే, కోల్‌కతా, అహ్మదాబాద్‌ నుంచి ప్రచురితమవుతున్న మింట్ భారతదేశంలోని వ్యాపార వార్తాపత్రికలలో రెండో స్థానంలో ఉంది.

హెచ్‌టి మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుకుంది. హెచ్‌టి మీడియా నుంచి ఫీవర్ ఎఫ్ఎమ్ నేడు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రేడియో నెట్ వర్క్. నాలుగు నగరాలలో మొదలైన ఫీవర్ ఎఫ్ఎం నేడు 13 నగరాల ప్రేక్షకులను చేరుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్. లక్నో, కాన్పూర్, ఆగ్రా, గోరఖ్‌పూర్, అలహాబాద్, అలీఘఢ్, బరేలీ నగరాలకు విస్తరించింది.

హెచ్‌టి మీడియా ఇంటర్నెట్ వ్యాపారాలు ఫైర్ ఫ్లై ఇ-ఇన్షియేటివ్‌కు చెందినవి. అవి ప్రముఖ వెబ్ పోర్టల్స్ అయిన hindustantimes, livemint పోర్టల్స్‌ను నడుపుతున్నాయి. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి ఉపయోగపడేలా ప్రారంభించిన వెబ్ సైట్ shine.com . దీని సృజనాత్మక డిజైన్, సులువైన వాడకం వినియోగదారులు, పరిశ్రమ నుంచి ప్రశంసలను పొందింది. desimartini.com - వినోదం, ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించి అన్ని వార్తలను అందిస్తుంది.

సంస్థ నుంచి ఎడ్యుకేషనల్ పోర్టల్ HTCampus పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉన్నత విద్యపై సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

హిందుస్థాన్ టైమ్స్ వెబ్ పోర్టల్స్ పంజాబీ, బెంగాలీ లో కూడా ఉన్నాయి. ఈసారి హెచ్‌టి మీడియా తెలుగు హిందుస్తాన్ టైమ్స్ పోర్టల్ ద్వారా తెలుగు పాఠకులను చేరుతోంది.