Telugu News
- Live news today : నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం హెచ్టీ తెలుగు పేజ్ని ఫాలో అవ్వండి..
- Amith Sha Telangana Tour: లక్ష మందితో ఖమ్మంలో అమిత్ షా సభ నిర్వహిస్తామని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు సభ స్థలాన్ని పరిశీలించిన ఆయన... పలు వివరాలను వెల్లడించారు.
- Varun Tej - Lavanya Engagement: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‍మెంట్ వేడుక ఘనంగా జరిగింది. కొణిదెల, అల్లు కుటుంబాలు ఈ వేడుకకు హాజరయ్యాయి.
Odisha train accident: సరిగ్గా వారం క్రితం, గత శుక్రవారం ఒడిశాలో బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో సుమారు 280 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్థానికంగా ఉన్న పాఠశాల భవనంలో తాత్కాలికంగా భద్రపర్చారు.
- CM KCR On Aasara Pensions: వికలాంగులకు తీపి కబురు చెప్పారు సీఎం కేసీఆర్. దశాబ్ధి ఉత్సవాల వేళ ప్రస్తుతం అందిస్తున్న రూ. 3వేల పింఛన్ ను రూ. 4 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
14 ఏళ్ల దళిత బాలికపై, స్థానికంగా ఉండే 16 ఏళ్ల బాలుడు అత్యాచారం జరిపి, హత్య చేసిన ఘటన యూపీ రాజధాని లక్నో సమీప గ్రామంలో జరిగింది. హత్య చేసిన తరువాత బాలిక మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీసి పారిపోయాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ నేరంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ముంబై హత్య ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మనోజ్ సహాని అనే 56 ఏళ్ల వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న సరస్వతి వైద్య అనే మహిళను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా నరికి, వాటిని ఉడకించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
- WTC Final: రహానే, శార్దూల్ ఠాకూర్ రాణించటంతో డబ్ల్యూటీసీ ఫైనల్‍లో ఫాలోఆన్ ప్రమదాన్ని టీమిండియా తప్పించుకుంది. కాగా, ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం దక్కింది.
- TDP Latest News: అమరావతి ఎక్కడికీ పోదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తొమ్మిది నెలల తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తానని చెప్పారు. ఇవాళ ఐ-టీడీపీ సదస్సులో మాట్లాడిన ఆయన... వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
CM KCR Mancherial District Tour: సీఎం కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ను సీఎం ప్రారంభించారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
- Nara Lokesh Sports Ground:ముఖ్యమంత్రి ఇలాకాలో ప్రతిపక్షనాయకుడి కటౌట్లు కలకలం రేపాయి. సిఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో జాతీయ రహదారిపై టీడీపీ యువనేత పేరుతో భారీ ఫ్లెక్సీలతో క్రీడాప్రాంగణం వెలియడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
- Ambati Rayudu Latest News: టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి సీఎం జగన్ భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందన్న చర్చ టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారింది.
- మిస్ వరల్డ్ 2023 పోటీలను భారత్ లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ గురువారం ప్రకటించింది. ఇది మిస్ వరల్డ్ పోటీల 71వ ఎడిషన్. 27 సవత్సరాల తరువాత మళ్లీ భారత్ ఈ అందాల పోటీలను నిర్వహిస్తుండడం విశేషం.
- Sunil Gavaskar praises Ajinkya Rahane: భారత బ్యాట్స్‌మన్ రహానేపై సునీల్ గవాస్కర్ పొగడ్తల వర్షం కురిపించాడు. భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడు ఆదుకుంటాడని ప్రశంసించాడు.
Maruti Suzuki Alto Tour H1: సరికొత్త ఆల్టోను మారుతి సుజుకీ ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. పెట్రోల్, సీఎన్జీ వర్షన్లలో వినియోగదారులను ఆకర్షించే మైలేజీతో ఈ మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1 (Maruti Suzuki Alto Tour H1) మార్కెట్లోకి వచ్చింది.
- TSLPRB Latest Updates: ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. జూన్ 14 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సెంటర్ల వివరాలను ప్రకటించింది.
- Animal: రణ్‍బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ చిత్రం విడుదలపై క్లారిటీ వచ్చింది. మందుగా ప్రకటించిన తేదీనే రీలీజ్ కానుంది.
భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ, సెన్సెక్స్ లు నష్టాల్లో ముగియడం వరుసగా ఇది రెండో రోజు. శుక్రవారం సెన్సెక్స్ 223 పాయింట్లను, నిఫ్టీ 71 పాయింట్లను కోల్పోయింది.
- Apsara Murder Case Updates: పూజారి చేతిలో హత్యకు గురైన అప్సర కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఇద్దరి మధ్య పరిచయం మొదలు నుంచి హత్య వరకు ఏం జరిగిందనే దానిపై కూపీ లాగుతున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.