లోక్‌సభ ఎన్నికలు 2024 షెడ్యూలు
2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు తేదీలు
తొలి విడతలో.. ఎన్ని స్థానాలు : 102 ఎన్నికల నోటిఫికేషన్: 28 మార్చి 2024 నామినేషన్లకు చివరి తేదీ: 2 ఏప్రిల్ నామినేషన్ల ఉపసంహరణకు గడువు: 30 మార్చి 2024 పోలింగ్ తేదీ: ఏప్రిల్ 19, 2024 ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024 లోక్‌సభ ఎన్నికలు రెండో విడత ఎన్ని స్థానాలు : 89 ఎన్నికల నోటిఫికేషన్: 28 మార్చి 2024 నామినేషన్లకు చివరి తేదీ: 4 ఏప్రిల్ 2024 నామినేషన్ల పరిశీలన: 5 ఏప్రిల్ 2024 అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 8 ఏప్రిల్ 2024 పోలింగ్ తేదీ: 26 ఏప్రిల్ 2024 ఓట్ల లెక్కింపు: జూన్ 4, 2024 లోక్‌సభ ఎన్నికలు మూడో విడత ఎన్ని స్థానాలు : 94 ఎన్నికల నోటిఫికేషన్: 12 ఏప్రిల్ 2024 నామినేషన్లకు చివరి తేదీ: 19 ఏప్రిల్ 2024 నామినేషన్ల పరిశీలన: 20 ఏప్రిల్ 2024 అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 22 ఏప్రిల్ 2024 పోలింగ్ తేదీ: 7 మే 2024 ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024 లోక్ సభ ఎన్నికలు నాలుగో విడత ఎన్ని స్థానాలు : 96 ఎన్నికల నోటిఫికేషన్: 18 ఏప్రిల్ 2024 నామినేషన్లకు చివరి తేదీ: 25 ఏప్రిల్ 2024 నామినేషన్ల పరిశీలన: 26 ఏప్రిల్ 2024 అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 29 ఏప్రిల్ 2024 పోలింగ్ తేదీ: 13 మే 2024 ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024 లోక్‌సభ ఎన్నికలు ఐదో విడత ఎన్ని స్థానాలు : 49 ఎన్నికల నోటిఫికేషన్: 26 ఏప్రిల్ 2024 నామినేషన్లకు చివరి తేదీ: 3 మే 2024 నామినేషన్ల పరిశీలన: 4 మే 2024 అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 6 మే 2024 పోలింగ్ తేదీ: 20 మే 2024 ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024 లోక్‌సభ ఎన్నికలు ఆరో విడత ఎన్ని స్థానాలు : 57 ఎన్నికల నోటిఫికేషన్: 29 ఏప్రిల్ 2024 నామినేషన్లకు చివరి తేదీ: 6 మే 2024 నామినేషన్ల పరిశీలన: 7 మే 2024 అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 9 మే 2024 పోలింగ్ తేదీ: 25 మే 2024 ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024 లోక్‌సభ ఎన్నికలు ఏడో విడత ఎన్ని స్థానాలు : 57 ఎన్నికల నోటిఫికేషన్: 7 మే 2024 నామినేషన్లకు చివరి తేదీ: 14 మే 2024 నామినేషన్ల పరిశీలన: 15 మే 2024 అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 17 మే 2024 పోలింగ్ తేదీ: 1 జూన్ 2024 ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024 2024లోక్‌సభ ఎన్నికల్లో ఎంత మంది ఓటు వేయబోతున్నారు? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిథ్య చట్టం 1950 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇందులో భాగంగా 29 మే 2023న ఓటర్ల నమోదుకు స్పెషల్ సమ్మరీ రివిజన్(ఎస్ఎస్ఆర్) ప్రారంభించింది.
కాగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇప్పటివరకు 96.88 కోట్ల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఓటుహక్కు ఉన్న వారి సంఖ్య 6 శాతం పెరిగింది. 18 నుంచి 19 ఏళ్ల వయస్సు గల ఓటర్లు ఈసారి 1.85 కోట్ల మంది ఉన్నారు. 2019లో వీరి సంఖ్య 1.5 కోట్లు మాత్రమే. మహిళా ఓటర్ల సంఖ్య 2019లో 43.1 కోట్లు ఉండగా, 2024లో 47.1 కోట్లకు పెరిగంది. పురుష ఓటర్ల సంఖ్య 2019లో 48.5 కోట్లు ఉండగా, 2024లో 48.7 కోట్లకు పెరిగింది.
2019 లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ఎప్పుడు వచ్చింది? పోలింగ్ తేదీలు ఏంటి?
2019 జనరల్ ఎలెక్షన్స్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం 2019 మార్చి 10న షెడ్యూలు విడుదల చేసింది. అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల ఎన్నికలకు కూడా షెడ్యూలు జారీచేసింది. మొత్తం ఏడు విడతల్లో 2019 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.
తొలి విడత పోలింగ్ 2019 ఏప్రిల్ 11న 91 స్థానాలకు జరిగింది. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 18న 95 స్థానాలకు జరిగింది., మూడో విడత పోలింగ్ 116 స్థానాలకు ఏప్రిల్ 23న జరిగింది. నాలుగో విడత పోలింగ్ 71 స్థానాలకు ఏప్రిల్ 29న జరిగింది. ఐదో విడత పోలింగ్ 50 స్థానాలకు మే 6న జరిగింది. ఆరో విడత పోలింగ్ 59 నియోజకవర్గాలకు మే 12న జరిగింది. ఏడో విడత పోలింగ్ 59 నియోజకవర్గాలకు మే 19న జరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల మే 23, 2019న వెలువడ్డాయి.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి?
2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయభేరి మోగించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ- ఎన్డీఏ కృషి చేస్తోంది. ఇక మోదీని గద్దెదించాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలు 'ఇండియా' కూటమిగా ఏకమయ్యాయి. 2019లో మొత్తం 542 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీకి 303 సీట్లు దక్కాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 353 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో సరిపెట్టుకుంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు సాధించింది, ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి బలం ఎక్కువగా ఉంది?
ఉత్తర భారత దేశం
బిహార్:
మొత్తం సీట్లు- 40
బీజేపీ- 17
జేడీయూ - 16
లోక్ జనశక్తి పార్టీ- 6
కాంగ్రెస్- 1
ఆర్జేడీ- 0
రాష్ట్రీయ లోక్ సమ్తా పార్టీ- 0
ఎన్సీపీ- 0
(బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు ఎన్డీఏ కూటమిలో భాగం)
ఛండీగఢ్:
మొత్తం సీట్లు- 1
బీజేపీ- 1
కాంగ్రెస్- 0
ఆమ్ ఆద్మీ పార్టీ- 0 ఛత్తీస్‌గఢ్:
మొత్తం సీట్లు- 11
బీజేపీ- 9
కాంగ్రెస్- 2
దాద్రా అండ్ నగర్ హవేలీ:
మొత్తం సీట్లు- 1
బీజేపీ- 0
ఇండిపెండెంట్- 1
డామన్ అండ్ డయూ:
మొత్తం సీట్లు-1
బీజేపీ- 1
కాంగ్రెస్- 0
దిల్లీ:
మొత్తం సీట్లు- 7
బీజేపీ- 7
ఆమ్ ఆద్మీ పార్టీ- 0
కాంగ్రెస్- 0
గోవా:
మొత్తం సీట్లు- 2
బీజేపీ- 1
కాంగ్రెస్- 1
గుజరాత్:
మొత్తం సీట్లు- 26
బీజేపీ- 26
కాంగ్రెస్- 0
హరియాణా:
మొత్తం సీట్లు- 10
బీజేపీ- 10
కాంగ్రెస్- 0
ఇండియన్ నేషనల్ లోక్‌దళ్- 0
హిమాచల్ ప్రదేశ్:
మొత్తం సీట్లు-4
బీజేపీ- 4
కాంగ్రెస్- 0
జమ్ముకశ్మీర్:
మొత్తం సీట్లు- 6
బీజేపీ- 3
కాంగ్రెస్- 0
పీడీపీ- 0
ఎన్సీ- 3
ఝార్ఖండ్:
మొత్తం సీట్లు- 14
బీజేపీ- 11
ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్- 1
కాంగ్రెస్- 1
ఝార్ఖండ్ ముక్త్ మోర్చా- 1
మధ్యప్రదేశ్:
మొత్తం సీట్లు- 29
బీజేపీ- 28
కాంగ్రెస్- 1
మహారాష్ట్ర:
మొత్తం సీట్లు- 48 బీజేపీ- 23
శివసేన- 18
కాంగ్రెస్- 1
ఎన్సీపీ- 4
ఏఐఎంఐఎం- 1
ఇండిపెండెంట్- 1
(బీజేపీ, శివసేన- ఎన్డీఏ కూటమి)
ఒడిశా:
మొత్తం సీట్లు- 21
బిజు జనతా దళ్- 12
బీజేపీ- 8
కాంగ్రెస్- 1
పంజాబ్:
మొత్తం సీట్లు- 13
కాంగ్రెస్- 8
శిరోమణి అకాలీ దళ్- 2 బీజేపీ- 2
ఆమ్ ఆద్మీ పార్టీ- 1
రాజస్థాన్:
మొత్తం సీట్లు- 25
బీజేపీ- 24
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ- 1
కాంగ్రెస్- 0
ఉత్తర్ ప్రదేశ్:
మొత్తం సీట్లు- 80
బీజేపీ- 62
అప్నా దళ్ (ఎస్)- 2
బీఎస్పీ- 10
సమాజ్‌వాదీ పార్టీ- 5
కాంగ్రెస్- 1
ఉత్తరాఖండ్:
మొత్తం సీట్లు- 5
బీజేపీ- 5
కాంగ్రెస్- 0
పశ్చిమ బెంగాల్:
మొత్తం సీట్లు- 42
టీఎంసీ- 22
బీజేపీ- 18
కాంగ్రెస్- 2
సీపీఐఎం- 0
దక్షిణ భారత దేశం
అండమాన్ అండ్ నికోబార్ దీవులు:
మొత్తం సీట్లు- 1
కాంగ్రెస్- 1
బీజేపీ- 0
ఆంధ్రప్రదేశ్:
మొత్తం సీట్లు- 25 వైసీపీ- 22
టీడీపీ- 3
జనసేన- 0
బీజేపీ- 0
కర్ణాటక:
మొత్తం సీట్లు- 28
బీజేపీ- 25
ఇండిపెండెంట్- 1
కాంగ్రెస్- 1
జేడీఎస్- 1
కేరళ:
మొత్తం సీట్లు- 20
కాంగ్రెస్- 15
ముస్లిం లీగ్- 2
సీపీఐఎం- 1
కేరళ కాంగ్రెస్ (ఎం)- 1
ఆర్‌ఎస్పీ- 1
బీజేపీ- 0
సీపీఐ- 0
లక్షద్వీప్:
మొత్తం సీట్లు- 1
ఎన్సీపీ- 1
కాంగ్రెస్- 0
పుదుచ్చెరి:
మొత్తం సీట్లు- 1
కాంగ్రెస్- 1
ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్- 0
తమిళనాడు:
మొత్తం సీట్లు- 39
డీఎంకే- 24
కాంగ్రెస్- 8
సీపీఐ- 2
సీపీఐఎం- 2 అన్నాడీఎంకే- 1
ముస్లిం లీగ్- 1
విదుతళై చిరుథైగళ్ కచి- 1
బీజేపీ- 0
పట్టాలి మక్కల్ కచి- 0
(మొదటి మూడు, ముస్లిం లీగ్, వీసీటీ- యూపీఏ కూటమి)
తెలంగాణ:
మొత్తం సీట్లు- 17
టీఆర్ఎస్- 9
కాంగ్రెస్- 3
బీజేపీ- 4
ఏఐఎంఐఎం- 1
ఈశాన్య భారత దేశం
అరుణాచల్ ప్రదేశ్:
మొత్తం సీట్లు- 2
బీజేపీ- 2 కాంగ్రెస్- 0
అసోం:
మొత్తం సీట్లు- 14
బీజేపీ- 9
కాంగ్రెస్- 3
ఆల్ ఇండియా యూనైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్- 1
ఇండిపెండెంట్- 1
మణిపూర్:
మొత్తం సీట్లు- 2 బీజేపీ- 1
నాగా పీపుల్స్ ఫ్రెంట్- 1
కాంగ్రెస్- 0
మేఘాలయ:
మొత్తం సీట్లు- 2 బీజేపీ- 0
కాంగ్రెస్- 1
నేషనల్ పీపుల్స్ పార్టీ- 1
మిజోరం:
మొత్తం సీట్లు- 1
మీజో నేషనల్ ఫ్రెంట్- 1
కాంగ్రెస్- 0
నాగాలాండ్:
మొత్తం సీట్లు- 1
ఎన్డీఏ- 1
కాంగ్రెస్- 0
సిక్కిం:
మొత్తం సీట్లు- 1
సిక్కిం క్రాంతికారి మోర్చా- 1
సిక్కిం డెమొక్రటిక్ ఫ్రెంట్- 0
త్రిపుర:
మొత్తం సీట్లు- 2
బీజేపీ- 2
కాంగ్రెస్- 0
సీపీఐఎం- 0
- ఫేజ్ 1
- ఫేజ్ 1A
- ఫేజ్ 2
- ఫేజ్ 2A
- ఫేజ్ 3
- ఫేజ్ 4
- ఫేజ్ 5
- ఫేజ్ 6
- ఫేజ్ 7
FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)
ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ఉన్న పార్టీల జాబితా ఇదీ. బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)(అజిత్ పవార్), జనతాదళ్(సెక్యులర్), ఏఐఏడీఎంకే (ఓపీఎస్), అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్, పుథియ నీది కచ్చి, జనతాదళ్ (యూ), లోక్‌జనశక్తి పార్టీ (రాంవిలాస్), రాష్ట్రీ లోక్‌జనశక్తి పార్టీ, హిందుస్తానీ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్‌జనతా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, అసోం గణ పరిషద్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, అప్నాదళ్(సోనేలాల్), రాష్ట్రీయ లోక్‌దళ్, నిషాద్ పార్టీ, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా ఎన్.ఆర్.కాంగ్రెస్, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారీ మోర్చా, మిజోనేషనల్ ఫ్రంట్, జననాయక్ జనతా పార్టీ, హర్యానా లోక్‌హిత్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, ఇండిజినియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, నాగా పీపుల్స్ ఫ్రంట్, శిరోమణి అకాలీదళ్ సంయుక్త, భారత్ ధర్మ జనసేన, కేరళ కామరాజ్ కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే), రాష్ట్రీయ సమాజ్ పక్ష, ప్రహార్ జనశక్తి పార్టీ, జన సురాజ్య శక్తి, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్.
ది ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా). దీనికి ఛైర్‌పర్సన్‌గా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. కూటమిలోని పార్టీల జాబితా ఇది. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కేరళ కాంగ్రెస్ (ఎం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్ థాకరే), విదుతలై చిరుతైగల్ కచ్చి
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్నాయి.
కాంగ్రెస్ 47 సీట్లు, డీఎంకే 24 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 23 సీట్లు, శివసేన (ఉద్దవ్) 6 సీట్లు, ఎన్సీపీ(శరద్ పవార్) 4 సీట్లు, సీపీఎం 3 సీట్లు, సమాజ్‌వాదీ 3 సీట్లు, ఐయూఎంఎల్ 3 సీట్లు, జేకేఎన్సీ 3 సీట్లు, సీపీఐ 2 సీట్లు, ఆప్ 1 సీటు, జేఎంఎం 1 సీటు,కేసీ(ఎం) 1 సీటు, ఆర్‌ఎస్పీ 1 సీటు, వీసీకే 1 సీటు కలిగి ఉంది. మొత్తంగా సుమారు 123 సీట్లు కలిగి ఉంది.
ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ స్థానాలు ఉండేవి. వైఎస్సార్ కాంగ్రెస్ 22, టీడీపీ 3 స్థానాలు గెలుచుకుంది.
తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంది. బీఆర్ఎస్ స్థానాలు: మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి బీజేపీ స్థానాలు: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ కాంగ్రెస్ స్థానాలు: మల్కాజిగిరి, భువనగిరి, నల్గొండ ఎంఐఎం: హైదరాబాద్