Maharashtra Election Results 2024 Live: మహాారాష్ట్రలో ఎన్డీఏ ప్రభంజనం- ఝార్ఖండ్‌లో ఇండియా కూటమికి పట్టం..
- Maharashtra Election Results 2024 : హై-ఓల్టేజ్ మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఈ హెచ్‌టీ తెలుగు లైవ్ అప్డేట్స్ని ఫాలో అవ్వండి..
Sat, 23 Nov 202403:16 PM IST
ఉప ఎన్నికల్లో ‘ఎన్నికల వ్యూహకర్త’ ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు
బిహార్ లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ‘ఎన్నికల వ్యూహకర్త’ ప్రశాంత్ కిషోర్ కు చెందిన పార్టీ ‘జన్ సురాజ్’ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఓడిపోయారు. వారిలో ముగ్గురు డిపాజిట్లు కోల్పోయారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ ఒంటరిగా పోటీ చేస్తుందని, మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
Sat, 23 Nov 202401:56 PM IST
‘ఈవీఎంల వల్లనే నా భర్త ఫహద్ అహ్మద్ ఓడిపోయాడు’: స్వర భాస్కర్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్త ఫహద్ అహ్మద్ ఓడిపోవడంపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ స్పందించారు. ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ 16 నుంచి 19 రౌండ్లను రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. 99% బ్యాటరీ ఉన్న ఈవీఎం లు ఓపెన్ చేసిన తరువాతే తన భర్త మెజారిటీని కోల్పోయారని ఆరోపించారు.
Sat, 23 Nov 202401:33 PM IST
‘నమ్మలేకపోతున్నా..’: ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ ఓటమిపై స్పందించారు. రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. "కోవిడ్ సమయంలో కుటుంబ పెద్దగా నా మాట విన్న మహారాష్ట్ర నాతో ఇలా ప్రవర్తిస్తుందని నమ్మలేకపోతున్నాను" అని ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర హక్కుల కోసం తాము పోరాడుతూనే ఉంటామన్నారు.
Sat, 23 Nov 202401:22 PM IST
వయనాడ్ లో ప్రియాంక గాంధీ రికార్డ్; 4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ
వయనాడ్ లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థిపై 4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన సోదరుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అరంగేట్రం చేసిన ప్రియాంక గాంధీ వాద్రా అసమాన విజయం అందుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీకి 6,22,338 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కు 2,11,407 ఓట్లు వచ్చాయి. వయనాడ్ లోక్ సభ స్థానానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరిగింది.
Sat, 23 Nov 202412:26 PM IST
మహారాష్ట్ర లో బీజేపీ కూటమి విజయంపై ప్రధాని మోదీ హర్షం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘అభివృద్ధి గెలిచింది. సుపరిపాలన గెలిచింది. ఐక్యంగా మనం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ‘‘ఎన్డీయేకు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన మహారాష్ట్రలోని నా సోదరీమణులు, సోదరులకు, ముఖ్యంగా రాష్ట్రంలోని యువత, మహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఆప్యాయత, ఆప్యాయత అసమానం’’ అని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Sat, 23 Nov 202412:22 PM IST
మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయానికి 5 ప్రధాన కారణాలు
బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఐదు ప్రధాన కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. అవి..
1- లడ్కీ బహిన్ యోజన
2. ఏక్ హై తో సేఫ్ హై
3. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
4. ఏక్ నాథ్ షిండే నియామకం
5. బ్రాండ్ మోదీ
Sat, 23 Nov 202412:00 PM IST
మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయంపై స్టాక్ మార్కెట్ ఎలా స్పందిస్తుంది?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం పెట్టుబడిదారులను సానుకూలంగా ప్రభావితం చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. దాంతో, పెట్టుబడిదారులు రక్షణాత్మకం నుండి దూకుడుకు వ్యూహానికి మారవచ్చని భావిస్తున్నారు. బీజేపీ విధానాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, తయారీ రంగాల్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.
Sat, 23 Nov 202409:34 AM IST
మహారాష్ట్రలో ‘‘కిస్సా కుర్చీ కా’’..; సీఎం పీఠం ఎవరికి?
మహాయుతి కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో, మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే విషయంలో ఉత్కంఠ నెలకొన్నది. కూటమిలోని మూడు పార్టీలు తమకే సీఎం పీఠం దక్కాలన్న ఆకాంక్షను ఇప్పటికే వ్యక్త పరిచాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి కావాలని బీజేపీ వర్గాలు కోరుకుంటున్నాయి. మరోవైపు శివసేన చీలిక వర్గం నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నే మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టాలని ఆయన వర్గం నాయకులు కోరుకుంటున్నారు. ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్ కే ఈ సారి సీఎం పదవి ఇవ్వాలని ఆయన భార్య బహిరంగంగానే డిమాండ్ చేశారు.
Sat, 23 Nov 202407:49 AM IST
మహా వికాశ్ అఘాడీ ఫెయిల్..
మహారాష్ట్రలో విపక్ష మహా వికాశ్ అఘాడీ డీలాపడింది. కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం కేవలం 57 స్థానాల్లోనే లీడింగ్‌లో ఉంది.
Sat, 23 Nov 202407:36 AM IST
మహారాష్ట్రలో పరిస్థితి ఇలా..
మధ్యాహ్నం 1 గంట ట్రెండ్స్ ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి 221 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇండియా కూటమి 56కి పరిమితమైంది. ఇతరులు 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Sat, 23 Nov 202406:59 AM IST
సీఎంగా దేవేంద్ర ఫడణవీస్..!
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అతిపెద్ద పార్టీగా అవతరించడంతో, మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఫడ్నవిస్ సీఎం అవుతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు బీజేపీ నేత ప్రవీణ్ దరేకర్ సమాధానమిస్తూ.. సీఎం మహాయుతి నుంచి వస్తారని అన్నారు. సహజంగానే అతిపెద్ద పార్టీ.. సీఎంని నిలబడుతుందని, ఫలితంగా బీజేపీ నుంచి సీఎం ఉంటే అది దేవేంద్ర ఫడ్నవిస్ అవుతారని అన్నారు.
Sat, 23 Nov 202406:40 AM IST
మహారాష్ట్రలో ప్రభంజనం
మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది! బీజేపీ నేతృత్వంలోని కూటమి 220 కన్నా ఎక్కువ సీట్లల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. విపక్ష కూటమి మాత్రం 56 చోట్ల ముందంజలో ఉంది.
Sat, 23 Nov 202406:04 AM IST
వెనకంజలో జీషన్ సిద్ధిఖీ..
అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 32 ఏళ్ల జీషన్ సిద్ధిఖీ ప్రస్తుతం శివసేనకు చెందిన వరుణ్ సతీష్ సర్దేశాయ్ (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) కంటే 5,237 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వాండ్రే ఈస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి అదే నియోజకవర్గం నుంచి ఎన్సీపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.
వాండ్రే ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన (యూబీటీ) అభ్యర్థి వరుణ్ సతీష్ సర్దేశాయ్ పై జీషాన్ సిద్ధిఖీ పోటీ చేస్తున్నారు.
దివంగత ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ సిద్ధిఖీ మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయడంతో కాంగ్రెస్ నాయకత్వం ఆయనను ఆగస్టులో బహిష్కరించింది.
ఆయన తండ్రి కాంగ్రెస్‌ని వీడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అజిత్ పవార్ వర్గంలో చేరారు. అయితే జీషాన్ తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటించడానికి చాలా నెలలు పట్టింది.
Sat, 23 Nov 202405:51 AM IST
'ఎన్నికల్లో కుట్ర..'
బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తన ఆధిక్యాన్ని సుస్థిరం చేసుకుంటుండగా, ముందస్తు ఎన్నికల ట్రెండ్స్ కుట్రను సూచిస్తున్నాయని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ శనివారం ఉదయం అన్నారు. ఇందులో పెద్ద కుట్ర కనిపిస్తోందని ఆయన విలేకరులతో అన్నారు.
ఈ ఫలితాన్ని ప్రజాతీర్పుగా తమ పార్టీ అంగీకరించదని సంజయ్ రౌత్ అన్నారు.
Sat, 23 Nov 202404:59 AM IST
ప్రియాంక గాంధీ..
కేరళ వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభంజన సృష్టించనున్నారు! పోటీ చేస్తున్న తొలి ఎన్నికలో ప్రియాంక హవా కొనసాగుతోంది. సోదరుడు రాహుల్ గాంధీ విడిచిపెట్టిన సీటు నుంచి ప్రియాంక గాంధీ లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి.
Sat, 23 Nov 202404:47 AM IST
లీడింగ్‌లో ఆదిత్య థాక్రే
శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నేత ఆదిత్య థాక్రే.. వోర్లీ నియోజకవర్గం నుంచి లీడింగ్‌లో ఉన్నారు.
Sat, 23 Nov 202404:27 AM IST
ఝార్ఖండ్‌లో మారిన సమీకరణలు..
ఝార్ఖండ్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి! బీజేపీకి గట్టిపోటీనిస్తూ.. జేఎంఎం కూటమి దూసుకెళుతోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 33 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. జేంఎం 31 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
Sat, 23 Nov 202404:01 AM IST
లీడింగ్‌లో ప్రియాంక గాంధీ..
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోరులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ దాదాపు 35వేల ఓట్లతో లీడింగ్‌లో ఉన్నారు.
Sat, 23 Nov 202403:52 AM IST
100 మార్క్ దాటిన ఎన్డీఏ..
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి దూసుకెళుతోంది! ఇప్పటికే 100కుపైగా సీట్లల్లో లీడింగ్‌లో ఉంది. విపక్ష కూటమి 20 చోట్ల ముందంజలో ఉంది. అటు ఝార్ఖండ్‌లోనూ బీజేపీ కూటమి 30 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. జేఎంఎం కూటమి 13 చోట్ల ముందంజలో ఉంది.
Sat, 23 Nov 202403:32 AM IST
దూసుకెళుతున్న బీజేపీ..
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దూసుకెళుతోంది. మహారాష్ట్రలో కూటమి 88 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఝార్ఖండ్‌లో 31 చోట్ల ముందంజలో ఉంది.
Sat, 23 Nov 202403:02 AM IST
ఝార్ఖండ్ ఎర్లీ ట్రెండ్స్..
ఉదయం 8 గంటల 20 నిమిషాలకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. ఝార్ఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 9 చోట్ల లీడింగ్‌లో ఉంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి 3 చోట్ల ముందుంది.
Sat, 23 Nov 202403:02 AM IST
మహారాష్ట్ర ఎర్లీ ట్రెండ్స్..
ఉదయం 8 గంటల 20 నిమిషాలకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 24 సీట్లల్లో లీడింగ్‌లో ఉంది. విపక్ష ఇండియా కూటమి (మహా వికాస్ ఆఘాడీ) 3 చోట్ల లీడింగ్‌లో ఉంది. ఇతరులు ఒక చోట ముందున్నారు.
Sat, 23 Nov 202402:47 AM IST
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలో ఓట్లను లెక్కిస్తారు.
Sat, 23 Nov 202402:35 AM IST
ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ..
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 13 రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. వీటి కోసం దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
Sat, 23 Nov 202402:01 AM IST
ఎంవీఏ ప్రత్యేక ప్రణాళికలు..
కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శివసేన (యూబీట) కూటమి అయిన మహారాష్ట్ర వికాస్ అఘాడీ (ఎంవీఏ) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సిద్ధమైంది. ఇందుకోసం కీలక ప్రణాళికను రూపొందించింది.
మూడు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్యనేతలతో విడివిడిగా సమావేశమై వ్యూహాలు, వాటి అమలుపై సమీక్షించారు. అలాగే, సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే ఇండిపెండెంట్లు, రెబల్ అభ్యర్థుల మద్దతు కూడగట్టే బాధ్యతను నేతలకు అప్పగించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఫ్లైట్ బుకింగ్స్, బస వంటి లాజిస్టిక్ ఏర్పాట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందుకోసం హోటల్ గ్రాండ్ హయత్ లో సుమారు 150 గదులను బుక్ చేసినట్టు, హోటల్ రినైసాన్స్, హోటల్ ఐటీసీ గ్రాండ్ మరాఠాలో ప్రత్యామ్నాయ వసతిని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Sat, 23 Nov 202401:45 AM IST
ఉదయం 8 గంటలకు..
మహారాష్ట్ర, ఝార్ఖండ్‌తో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ క్రమంలో అభ్యర్థుల్లో చాలా మంది ఇప్పటికే వివిధ ఆలయాలకు వెళ్లి తమ గెలుపు కోసం పూజలు చేస్తున్నారు.
Sat, 23 Nov 202401:20 AM IST
హై సెక్యూరిటీ మధ్య కౌంటింగ్..
మహారాష్ట్ర, ఝార్ఖండ్‌తో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని కౌటింగ్ సెంటర్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
Sat, 23 Nov 202412:54 AM IST
ఝార్ఖండ్‌లో నిత్యం అనిశ్చితి!
2000లో బీహార్ నుండి రాష్ట్రం విడిపోయినప్పటి నుండి ఏడుగురు రాజకీయ నాయకులు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఒక్క రఘుబర్ దాస్ మాత్రమే వరుసగా ఐదు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. మిగిలినవారు రోజుల వ్యవధిలోనే సీఎం పీఠం దిగుతూ.. మళ్లీ ఎక్కుతూ నెట్టుకురావాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికైన ఐదు అసెంబ్లీల్లో ఏ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించలేదు.
Sat, 23 Nov 202412:39 AM IST
Election results live : ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్..
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు విజయం సాధిస్తాయని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందని ఒక ఎగ్జిట్ పోల్ పేర్కొంది.
బీజేపీ నేతృత్వంలోని కూటమిలో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ), జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఉన్నాయి. ఝార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) ఉన్నాయి.
Sat, 23 Nov 202412:34 AM IST
Election results : ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..
నాలుగు ప్రధాన ఎగ్జిట్ పోల్స్, సి-ఓటర్, పి-మార్క్, దైనిక్ భాస్కర్, లోక్‌షాహి మరాఠీ-రుద్ర, మహాయుతి లేదా ఎంవీఏ స్పష్టమైన మెజారిటీని సాధించే అవకాశం లేదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లలో మహాయుతి 112 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని, ప్రతిపక్ష ఎంవీఏ 104 సీట్లు గెల్చుకోవచ్చని, 61 సీట్లలో గట్టి పోటీ ఉందని సి-వోటర్ సర్వే పేర్కొంది. మెజారిటా మార్క్ 145గా ఉంది.
Sat, 23 Nov 202412:32 AM IST
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన..?
మహారాష్ట్రలో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది. ఆ లోపు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అలా కాని పక్షంలో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది.
Sat, 23 Nov 202412:29 AM IST
ఝార్ఖండ్‌లో ఇలా..
ఝార్ఖండ్‌లో 82 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 40 మెజారిటీ మార్క్ దాటాలి. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి (జేఎంఎం భాగమైన) మధ్య పోటీ నెలకొంది.
Sat, 23 Nov 202412:28 AM IST
ఉప ఎన్నికల ఫలితాలు కూడా..
మహారాష్ట్ర, ఝార్ఖండ్‌తో పాటు 13 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ సీట్లు, రెండు లోక్‌సభ సీట్లకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి. వీటిల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసిన వయనాడ్ సీటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Sat, 23 Nov 202412:34 AM IST
మహారాష్ట్రలో హై-ఓల్టేజ్ ఎన్నికలు..
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు కావాలి. ఇక్కడ అధికార మహాయుతీ, విపక్ష మహావికాస్ ఆఘాడీ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. దాదాపు అన్ని పార్టీలు పరువు, అస్తిత్వం కోసం పోటీ చేసిన ఈ ఎన్నికల ఫలితాల కోసం యావత్ భారత దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
Sat, 23 Nov 202412:25 AM IST
ఓట్ల లెక్కింపు..
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది.