Bigg Boss Winners Remuneration: ఓటీటీతోపాటు బిగ్ బాస్ తెలుగు 1 నుంచి 8 సీజన్ల విన్నర్స్.. వారికి వచ్చిన డబ్బు ఎంతంటే?-bigg boss telugu 1 to 8 all seasons winners and their remuneration along with bigg boss ott telugu prize money ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Winners Remuneration: ఓటీటీతోపాటు బిగ్ బాస్ తెలుగు 1 నుంచి 8 సీజన్ల విన్నర్స్.. వారికి వచ్చిన డబ్బు ఎంతంటే?

Bigg Boss Winners Remuneration: ఓటీటీతోపాటు బిగ్ బాస్ తెలుగు 1 నుంచి 8 సీజన్ల విన్నర్స్.. వారికి వచ్చిన డబ్బు ఎంతంటే?

Sanjiv Kumar HT Telugu
Dec 21, 2024 05:05 PM IST

Bigg Boss Telugu All Seasons Winners And Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్‌గా గెలిచిన నిఖిల్ మలియక్కల్ రూ. 55 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓటీటీతోపాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 నుంచి 8 వరకు నిలిచిన విన్నర్స్ ఎవరు, వారికి వచ్చిన డబ్బు ఎంత అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీతోపాటు బిగ్ బాస్ తెలుగు 1 నుంచి 8 సీజన్ల విన్నర్స్.. వారికి వచ్చిన డబ్బు ఎంతంటే?
ఓటీటీతోపాటు బిగ్ బాస్ తెలుగు 1 నుంచి 8 సీజన్ల విన్నర్స్.. వారికి వచ్చిన డబ్బు ఎంతంటే?

Bigg Boss Telugu 1 To 8 Seasons Winners Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఇటీవలే ముగిసిపోయింది. డిసెంబర్ 15న బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే నిర్వహించి విన్నర్‌గా నిఖిల్ మలియక్కల్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓటీటీతోపాటు బిగ్ బాస్ తెలుగు 1 నుంచి 8 వరకు సీజన్స్ విన్నర్స్ ఎవరు, వారి రెమ్యునరేషన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 1 విన్నర్

తెలుగులో మొదటిసారిగా 2017లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ప్రారంభమైంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ తెలుగు 1 విన్నర్‌గా నటుడు శివ బాలాజీ నిలిచాడు. విజేతగా నిలిచిన శివ బాలాజీకి రూ. 50 లక్షల ప్రైజ్ మనీ లభించింది.

బిగ్ బాస్ తెలుగు 2 విజేత

2018లో ప్రసారం అయిన బిగ్ బాస్ తెలుగు 2 సీజన్‌లో విజేతగా కౌశల్ మండా విజేతగా నిలిచాడు. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ తెలుగు 2 విన్నర్ కౌశల్ మండాకు బిగ్ బాస్ ప్రైజ్ మనీ కింద రూ. 50 లక్షలు వరించాయి.

బిగ్ బాస్ తెలుగు 3 విన్నర్

కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 3 సీజన్‌ 2019లో స్టార్ట్ అయింది. ఈ సీజన్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా గెలిస్తే గట్టి పోటీ ఇచ్చిన యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఇక బిగ్ బాస్ తెలుగు 3 విజేత అయిన రాహుల్ సిప్లిగంజ్‌కు 50 లక్షల రూపాయలు అందాయి.

బిగ్ బాస్ తెలుగు 4 విజేత

20220 సంవత్సరంలో అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌లో విన్నర్‌గా హీరో అభిజీత్ దుద్దాల ఎంపికయ్యాడు. అభిజీత్‌కు బిగ్ బాస్ ప్రైజ్ మనీ కింద రూ. 25 లక్షలు మాత్రమే వచ్చింది. ప్రైజ్ మనీతోపాటు ఓ కాస్ట్‌లీ బైక్ గిఫ్ట్‌గా అందింది. అయితే, ఇదే సీజన్‌లోని టాప్ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్‌కు ఇచ్చిన మనీ ఆఫర్ తీసుకుని రూ. 25 లక్షలు ఎగరేసుకుపోయాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్

2021లో వచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్‌గా వీజే సన్నీ గెలిచి ప్పైజ్ మనీ కింద రూ. 50 లక్షలు అందుకున్నాడు. ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా హీరో అక్కినేని నాగార్జున బాధ్యతలు చేపట్టారు.

బిగ్ బాస్ తెలుగు 6 విజేత

సింగర్ రేవంత్ విన్నర్‌గా నిలిచిన బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ 2022లో వచ్చింది. విజేతగా గెలిచిన రేవంత్ బిగ్ బాస్ ప్రైజ్ మనీ రూ. 10 లక్షలతోపాటు మహీంద్ర కేయూవీ 100 కారు, రూ. 25 లక్షల విలువ గల ల్యాండ్ చేజిక్కించుకున్నాడు. అయితే, గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకున్న రన్నరప్ శ్రీహాన్ బిగ్ బాస్ ప్రైజ్ మనీలోని రూ. 40 లక్షలు తీసుకోవడంతో రేవంత్‌కు పది లక్షలు మిగిలాయి. అంతేకాకుండా, ఆరో సీజన్‌లో ఓటింగ్‌ను బట్టి శ్రీహాన్ విజేత అని ప్రకటించడం గమనార్హం.

బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్

2023లో టెలీకాస్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. నాగార్జున హోస్ట్‌గా చేసిన ఈ సీజన్‌లోని బిగ్ బాస్ ప్రైజ్ మనీలోని రూ. 15 లక్షల ఆఫర్‌ను ప్రిన్స్ యావర్ తీసుకున్నాడు.

బిగ్ బాస్ తెలుగు 8 విజేత

డిసెంబర్ 15న ముగిసిన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌కు విన్నర్‌గా నిలిచిన నిఖిల్‌ మలియక్కల్‌కు రామ్ చరణ్ ట్రోఫీ అందించాడు. బిగ్ బాస్ ప్రైజ్ మనీ కింద రూ. 55 లక్షలతోపాటు ఖరీదైనా కారును గిఫ్ట్‌గా నిఖిల్ అందుకున్నాడు.

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 విన్నర్

స్టార్ మా టీవీ ఛానెల్‌లో కాకుండా కేవలం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో మాత్రమే 24 గంటలు ప్రసారం అయిన సీజన్ బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్. 2022లో వచ్చిన బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 విన్నర్‌గా హీరోయిన్ బిందు మాధవి రూ. 40 లక్షల ప్రైజ్ మనీ అందుకుంది. మొదటి సారి లేడి కంటెస్టెంట్ విన్నర్ అయిన ఈ బిగ్ బాస్ ఓటీటీ తెలుగు సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్ట్‌గా చేశారు.

Whats_app_banner