Bollywood in 2024: ప్రేక్షకులను భయపెట్టి.. ఈ ఏడాది బాలీవుడ్‍ను కాపాడిన హారర్ సినిమాలు.. ఇప్పుడు ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..-shaitaan to stree 2 horror movies saved bollywood box office in 2024 you can watch on these ott platforms ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bollywood In 2024: ప్రేక్షకులను భయపెట్టి.. ఈ ఏడాది బాలీవుడ్‍ను కాపాడిన హారర్ సినిమాలు.. ఇప్పుడు ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..

Bollywood in 2024: ప్రేక్షకులను భయపెట్టి.. ఈ ఏడాది బాలీవుడ్‍ను కాపాడిన హారర్ సినిమాలు.. ఇప్పుడు ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 21, 2024 04:00 PM IST

Bollywood Horror Movies in 2024: ఈ ఏడాది బాలీవుడ్‍లో హారర్ చిత్రాలు హవా చూపించాయి. డీలాగా ఉన్న హిందీ సినీ ఇండస్ట్రీకి ఊపిరిని అందించాయి. బాలీవుడ్ బాక్సాఫీస్‍ను నెలబెట్టాయి. ఆ వివరాలు ఇవే..

Bollywood in 2024: ప్రేక్షకులను భయపెట్టి.. ఈ ఏడాది బాలీవుడ్‍ను కాపాడిన హారర్ సినిమాలు.. ఇప్పుడు ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..
Bollywood in 2024: ప్రేక్షకులను భయపెట్టి.. ఈ ఏడాది బాలీవుడ్‍ను కాపాడిన హారర్ సినిమాలు.. ఇప్పుడు ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..

ఈ ఏడాది 2024లో బాలీవుడ్‍కు పెద్దగా కలిసి రాలేదు. కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. అయితే, హారర్ సినిమా బాలీవుడ్‍ను ఈ ఏడాది నిలబెట్టాయి. దీంతో హిందీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. బడే మియా చోటే మియా, మైదాన్, సర్ఫిరా, జిగ్రా లాంటి సినిమాలు ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చి ఘోరంగా చతికిలపడ్డాయి. దారణంగా పరాజయం చెందాయి. మరికొన్ని సినిమాలు కూడా ప్లాఫ్ బాటపట్టాయి.

అయితే, తక్కువ బడ్జెట్‍తో వచ్చిన హారర్ చిత్రాలు 2024లో బాలీవుడ్‍ను రక్షించాయి. ప్రేక్షకులను భయపెట్టి, ఆకట్టుకొని అదగొట్టాయి. స్త్రీ 2 బిగ్గెస్ట్ హిట్‍గా నిలిచింది. డీలాగా ఉన్న హిందీ ఇండస్ట్రీకి ఉత్తేజాన్ని ఇచ్చింది. షైతాన్ కూడా అదరగొట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‍లో బ్లాక్‍బస్టర్ అయిన హారర్ చిత్రాలు ఇవే..

స్త్రీ 2

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలు పోషించిన హారర్ కామెడీ చిత్రం‘స్త్రీ 2’ ఈ ఏడాది బాలీవుడ్‍లో బిగ్గెస్ట్ హిట్‍గా నిలిచింది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.880కోట్లకు పైగా కలెక్షన్లు దక్కించుకుంది. రూ.627.50 కోట్ల హిందీ నెట్ కలెక్షన్లను దక్కించుకొని.. ఈ విషయంలో స్టార్ హీరోల చిత్రాలన్నింటినీ దాటేసింది. సుమారు రూ.60కోట్ల బడ్జెట్‍తోనే స్త్రీ 2 రూపొందింది. 2018లో వచ్చిన స్త్రీకి సీక్వెల్‍గా ఈ మూవీ వచ్చింది. ప్రేక్షకులను భయపెట్టి, నవ్వించి భారీ బ్లాక్‍బస్టర్ కొట్టింది స్త్రీ 2. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది.

భూల్ భులయ్య 3

కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన హారర్ కామెడీ మూవీ భూల్ భులయ్య కూడా కూడా ఈ ఏడాది మంచి హిట్ సాధించింది. ఈ చిత్రంలో విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ కూడా ప్రధాన పాత్రలు చేశారు. నవంబర్ 1న ఈ చిత్రం రిలీజైంది. సుమారు రూ.417 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ హారర్ మూవీ అదరగొట్టింది. సింగం అగైన్ పోటీలో ఉన్నా భూల్ భులయ్య 3 సత్తాచాటింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ తీసుకుంది. 2025 జనవరిలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది.

షైతాన్

అజయ్ దేవ్‍గణ్, జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా షైతాన్ భారీ హిట్ సాధించింది. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సుమారు రూ.211కోట్ల వసూళ్లను సాధించింది. పక్కా హారర్ మూవీగా వచ్చి ఈ చిత్రం ప్రేక్షకులను వణికించి.. మెప్పించింది. రూ.60కోట్ల బడ్జెట్‍తో రూపొంది.. భారీ బ్లాక్‍బస్టర్ కొట్టింది. షైతాన్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

ముంజ్య

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ముంజ్య’ చిత్రం అదరగొట్టింది. ఈ హారర్ కామెడీ సినిమా ఏకంగా రూ.130కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. సుమారు రూ.30కోట్లతోనే రూపొందిన ఈ చిత్రం ఆ స్థాయిలో వసూళ్లు సాధించి అదరగొట్టింది. అభయ్ వర్మ, శార్వరీ ప్రధాన పాత్రలు పోషించిన ముంజ్య జూన్ 7న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

నవంబర్ 1న రిలీజైన భారీ మల్టీస్టారర్ యాక్షన్ మూవీ సింగం అగైన్ సుమారు రూ.389 కోట్లను దక్కించుకుంది. రూ.350కోట్లతో రూపొందిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది. హృతిక్ రోషన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఫైటర్’ కూడా రూ.300కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో రాణించింది. ఈ మూవీ బడ్జెట్ రూ.250కోట్లకు పైమాటే. ఫైటర్ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

Whats_app_banner