Amla Curry: ఉసిరి కాయలతో స్పెషల్ కర్రీ, టేస్ట్‌తో పాటు బోలెడు హెల్త్ బెనిఫిట్స్ కూడా..
ఉసిరికాయను పచ్చిగా తిని ఉంటారు. పచ్చడి చేసుకుని తిని ఉంటారు. కూరలా ఎప్పుడూ టేస్ట్ చేసి ఉండరు కదా. అయితే ఇది మీ కోసమే! ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయను కూరగా ఎలా మార్చుకోవాలో చూసేద్దామా..
విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసు. ఈ పండును రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఉసిరికాయను అనేక విధాలుగా తింటారు. కొన్నిసార్లు దానితో జ్యూస్ తయారు చేయడం ద్వారా, కొన్నిసార్లు చట్నీ లేదా ఒరుగులు వంటివి తయారు చేయడం వంటి వాటి ద్వారా చాలా రకాలుగా వీటిని తీసుకుంటుంటారు. వీటన్నింటితో పాటు ఉసిరితో రుచికరమైన, స్పైసీ వెజిటేబుల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అంటేనే ఇష్టపడని పిల్లలు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు. కాబట్టి దీన్ని తయారు చేయడానికి సులభమైన రెసిపీని తెలుసుకుందాం.
ఉసిరికాయతో కూర తయారీకి కావలసిన పదార్థాలు
- మెంతులు (1/2 టీస్పూన్),
- ఆవాలు (1/2 టీస్పూన్),
- జీలకర్ర (1/2 టీస్పూన్),
- సోంపు గింజలు (1/2 టీస్పూన్),
- ఆవాలు (1 చిటికెడు),
- పచ్చిమిర్చి (1 సన్నగా తరిగినవి),
- పసుపు (1/2 టీస్పూన్),
- ధనియాల పొడి (1/2 టీస్పూన్),
- వెజిటబుల్ మసాలా (1/2 టీస్పూన్),
- ఉప్పు (రుచికి తగినంత),
- నూనె (తాలింపుకు తగినంత)
ఫస్ట్ స్టెప్ - ఉడకబెట్టడం
ఉసిరికాయ కర్రీ చేయడం కోసం ముందుగా పచ్చి ఉసిరికాయలను తీసుకుని బాగా కడిగి ఉడకబెట్టండి. దీనికి ఎక్కువ సమయం పట్టదు. కాకపోతే ఉసిరికాయలు ఉడికే సమయంలో అవి పేలుతుంటాయి. కాయలు అన్ని అలా పేలిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేయండి. వాటిని చల్లార్చి, వాటి నుంచి గింజలను వేరు చేయండి.
సెకండ్ స్టెప్ - మసాలా తయారీ
ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో స్పెషల్ వెజిటబుల్ మసాలాను తయారు చేయండి. దీని కోసం, మొదట, పాన్ తీసుకుని గ్యాస్‌పై వేడి చేయండి. పూర్తిగా వేడి అయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర, సోంపు గింజలు వేసి మెత్తగా వేయించుకోండి. ఇప్పుడు దానిని ఒక పాత్రలోకి మార్చి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నీళ్లు లేకుండా మిక్సీ గ్రైండర్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా గుజ్జును పక్కకు ఉంచి కర్రీ చేసే సమయంలో వాడండి.
ఆఖరి స్టెప్ - వంట విధానం
- ఉసిరికాయ కూర తయారు చేయడానికి, ముందుగా పాన్లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.
- నూనె వేడి అయ్యాక చిటికెడు ఆవాలు వేసి, వెంటనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కలపాలి.
- తరువాత అందులో మీరు తయారు చేసిన మసాలాను కలపండి. మసాలా ఒకటిన్నర నిముషం పాటు వేపుకోండి.
- తర్వాత అందులో ఉడికించిన ఉసిరికాయలు వేసి మసాలా దినుసులను బాగా కలపాలి. ఇలా 2 నిమిషాలు వేయించాలి.
- ఉసిరికాయలు బాగా వేయించాక పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, వెజిటెబుల్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
- ఇప్పుడు అన్నింటిని బాగా మిక్స్ చేసి మూతపెట్టి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ విధంగా, ఉసిరికాయ రుచికరమైన, మసాలా పొడితో కూర సిద్ధంగా ఉంటుంది.
- వేడి వేడి రోటీలో లేదా వేడి అన్నంలోకి ఉసిరికాయ కూర వేసుకుని తినేయొచ్చు. ఇలా కూర చేసుకోవడం వల్ల ఉసిరికాయలో ఉండే విటమిన్స్ ఏ మాత్రం కోల్పోకుండా శరీరానికి అందుతాయి.
సంబంధిత కథనం