జుట్టు సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మెంతులను వాడితే చాలా ఫలితాలు ఉంటాయి.

Unsplash

By Anand Sai
Nov 25, 2024

Hindustan Times
Telugu

మెంతి గింజలలో హార్మోన్-రెగ్యులేటింగ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యత కారణంగా జుట్టు రాలడాన్ని ఆపుతాయి.

Unsplash

మెంతులు కూడా యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇది స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

Unsplash

మెంతుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్న కారణంగా ఇది చుండ్రు లేకుండా చేస్తుంది. తల, జుట్టును రక్షిస్తుంది.

Unsplash

మెంతి గింజలను రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఈ నానబెట్టిన వాటిని రుబ్బుకోవాలి.

Unsplash

అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె లేదా పుల్లని పెరుగు మిక్స్ చేసి జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. గంట తర్వాత షాంపూతో కడుక్కోవాలి.

Unsplash

రెండు టేబుల్ స్పూన్ల మెంతి గింజలను రెండు కప్పుల నీటిలో వేసి 15 నిమిషాలు మరిగించాలి. నీటిని చల్లార్చి వడకట్టాలి.

Unsplash

షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో మీ తలను కడగాలి. ఈ మెంతి నీటిని తలపై పోసేటప్పుడు స్కాల్ప్‌ను సున్నితంగా మసాజ్ చేయండి.

Unsplash

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగేందుకు ఈ ఏడు రకాల డ్రింక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి

pexels