Gastric Problem: మసాలా ఫుడ్స్, వేపుడు ఆహారాలే కాదు పాలు తాగినా కూడా గ్యాస్ సమస్య వస్తుందట!-foods causing gastric problems and digestion issues ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gastric Problem: మసాలా ఫుడ్స్, వేపుడు ఆహారాలే కాదు పాలు తాగినా కూడా గ్యాస్ సమస్య వస్తుందట!

Gastric Problem: మసాలా ఫుడ్స్, వేపుడు ఆహారాలే కాదు పాలు తాగినా కూడా గ్యాస్ సమస్య వస్తుందట!

Ramya Sri Marka HT Telugu
Dec 20, 2024 06:30 AM IST

Gastric Problem: చాలా మంది అనుకున్నట్లుగా ఏ పప్పు ధాన్యాలు తింటేనో, లేదా మసాలా ఫుడ్స్ , స్పైసీ ఫుడ్స్ అయిన వేపుళ్లు తినడం వల్ల మాత్రమేనో గ్యాస్ సమస్య రాదట. పాలు లాంటి సామాన్య ఆహారం తీసుకున్నా కూడా గ్యాస్ సమస్య మొదలవుతుందట.

మసాలా ఫుడ్స్, వేపుడు ఆహారాలే కాదు పాలు తాగినా కూడా గ్యాస్ సమస్య
మసాలా ఫుడ్స్, వేపుడు ఆహారాలే కాదు పాలు తాగినా కూడా గ్యాస్ సమస్య (pexel)

గ్యాస్ సమస్య విపరీతమైన సమస్య. సరిగా కూర్చోనివ్వదు, నిలబడనివ్వదు. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. చాలా సందర్భాల్లో కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు మంట వస్తాయని వినే ఉంటాం. అంతేకాకుండా కాస్త మన అనుభవం కూడా తోడై కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల అజీర్తి కలిగిన సందర్భాలు గుర్తుండి ఉండొచ్చు. పేగుల్లో వాయువులు పెరగడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. వాటి వల్ల మనం గ్యాస్ సమస్యగా పిలుచుకునే గ్యాస్ట్రిక్ మొదలవుతుంది.

మరి ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందామా..

1. ఆమ్లాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు

సిట్రస్ ఫ్రూట్స్ అయినటువంటి (ఆరెంజ్‌లు, నిమ్మకాయలు, గ్రేప్ ‌ఫ్రూట్‌లు), టమాటోలు, వెనిగర్ వంటి ఆహారాలు ఎక్కువగా ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఎక్కువగా తింటే కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పన్నమై కడుపు మంట వంటి సమస్యలను తలెత్తుతాయి.

2. కొవ్వు పదార్థాలు, ఎక్కువసార్లు వేయించిన నూనె

కొవ్వు ఎక్కువ ఉన్న మాంసాహారం, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, నూనెతో చేసిన ఆహారాలు మన జీర్ణవ్యవస్థను మందగించేలా చేస్తాయి. ఫలితంగా బ్లోటింగ్, కడుపులో మంట కలిగి గ్యాస్ పెరిగేందుకు కారణమవుతుంది.

3. పాలు , పాల ఉత్పత్తులు

పాలు, పన్నీర్, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు లాక్టోస్ సమస్య ఉన్నవారిలో అజీర్తిని పెంచి, అంతర్గత సమస్యలకు దారి తీస్తుంది. ఫలితంగా గ్యాస్‌ను కలిగించవచ్చు.

4. కార్బొనేటెడ్ పానీయాలు

సోడా, స్పార్క్లింగ్ వాటర్ వంటి కార్బొనేటెడ్ పానీయాలు పొట్టలో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని తాగినప్పుడు వచ్చే తేనుపులను చూసి గ్యాస్ ఫ్రీ అయిందని భ్రమ పడుతుంటాం. వాస్తవానికి వీటితోనే బ్లోటింగ్ సమస్య పెరిగి గ్యాస్ తీవ్రతరం అవుతుంది.

5. కాఫీ , కెఫైన్ ఉన్న ఇతర పానీయాలు

కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్‌లలో ఉన్న కెఫ్టైన్ పొట్టలో ఆమ్లాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. వాటి వల్ల అజీర్ణం కలిగి యాసిడ్ సమస్యలు రెట్టింపు అవుతాయి.

6. మసాలా లేదా కారం ఎక్కువ ఉన్న ఆహారాలు

చిల్లీలు, మిరపకాయలు, గాఢమైన మసాలాలు కడుపులో మంట పెంచి, అజీర్ణం కలిగించవచ్చు.

7. ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఉదాహరణకు సాస్లు, క్యాండీడ్ సూప్‌లు, ఫాస్ట్ ఫుడ్, రెడీ-టూ-ఈట్ ఆహారాలు వంటి పదార్థాల్లో సోడియం , కృత్రిమ పదార్థాలు కలిగి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి.

8. బీన్స్ , పప్పులు

బీన్స్, పప్పులు వంటి ఆహారాలు ఫైబర్ , ఒలిగోసాకరైడ్‌లను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో అవాంతరాలు ఏర్పరచి బ్లాటింగ్‌ను పెంచుతాయి.

9. కూరగాయలు

బ్రోకలి, కాలీఫ్లవర్, క్యాబేజీ , బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ వంటి కూరగాయలు గ్యాస్ , బ్లోటింగ్‌కు కారణం కావచ్చు. ఎందుకంటే అవి ఫైబర్, కాంప్లెక్స్ షుగర్స్‌తో నిండి ఉంటాయి.

10. ఉల్లిపాయలు , వెల్లుల్లి

ఉల్లిపాయలు , వెల్లుల్లి ఫ్రక్టన్స్ అనే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు కలిగి ఉండి, వాటిని జీర్ణించుకోవడం కష్టం కావడం వలన గ్యాస్, బ్లాటింగ్ వంటి సమస్యలు ఏర్పడతాయి.

11. అత్యధిక ఫైబర్ ఉన్న ఆహారాలు

ఫైబర్ ప్రాముఖ్యమైనదే అయినా, అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు (పండ్లు, ధాన్యాలు, బ్రాన్) జీర్ణక్రియలో గ్యాస్, బ్లాటింగ్, అసౌకర్యం కలిగించవచ్చు.

12. మద్యం

మద్యం, ముఖ్యంగా బీర్ , వైన్, పొట్టకు హాని చేస్తాయి. ఆమ్లాన్ని పెంచి జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది.

13. కృత్రిమ తీపి పదార్థాలు

షుగర్-ఫ్రీ ఉత్పత్తుల్లో ఉండే సార్బిటాల్, మ్యానిటాల్, జైలిటాల్ వంటి కృత్రిమ తీపి పదార్థాలు జీర్ణక్రియలో సమస్యలు కలిగిస్తాయి. ఫలితంగా బ్లోటింగ్, గ్యాస్ సమస్యలను కలిగించవచ్చు.

14. చాకొలేట్

చాకొలేట్, ప్రత్యేకంగా డార్క్ చాకొలేట్, పొట్ట దిగువన ఉన్న స్పింక్టర్‌ను సడలించి, ఆమ్లాన్ని వెనక్కి నెట్టేస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌కు దారి తీస్తుంది.

ఈ ఆహారాలు జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలిగిస్తాయి. అందుకే ఈ ఆహారాలను జాగ్రత్తగా తీసుకోవడం మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. వేరు వేరు వెబ్‌సైట్లు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఇది కేవలం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

Whats_app_banner