(1 / 7)
మద్యం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా ప్రతిరోజూ తాగేవారు ఎంతో మంది ఉన్నారు. రోజులో ఎక్కువ ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారు.
(Shutterstock)(2 / 7)
ఆల్కహాల్ తో సోడా కలుపుకుని తాగేవారి సంఖ్య ఎక్కువే. అయితే ఇది చాలా ప్రమాదకరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
(Shutterstock )(3 / 7)
సోడాలో కార్బోనేటెడ్ వాటర్, అధిక ఫ్రక్టోజ్, ఆర్టిఫిష్టియల్ కలర్, కెఫీన్, ఫాస్పోరిక్ ఆమ్లం, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ లో సోడా కలుపుకుని తాగడం వల్ల మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది.
(Shutterstock)(4 / 7)
ఆల్కహాల్ లో సోడాకు బదులు నీరు కలుపుకుని తాగమని చెబుతున్నిరు నిపుణులు. ఇంకా చెప్పాలంటే గోరువెచ్చని వేడి నీరు వేసుకుని తాగితే మంచిదని వివరిస్తున్నారు. ఇలా నీళ్లు కలపడం వల్ల దాని రుచి తగ్గిపోతుంది. మత్తు కలగడం కూడా తగ్గుతుంది. హ్యాంగోవర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.
(Shutterstock)(5 / 7)
సోడాలు, కార్బోనేటెడ్ పానీయాలు, శీతల పానీయాలలో భాస్వరం అధికంగా ఉంటుంది. ఈ పానీయాలను అధికంగా తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ ప్రమాదం వస్తుంది.
(Shutterstock)(6 / 7)
మద్యాన్ని రోజులో ఎంత తక్కువగా తాగితే అంత మంచిది. పురుషులు 50 మి.లీ లకు మించి తాగకూడదు. ఇక మహిళలో అందులో సగానికే పరిమితమవ్వాలి.
(Shutterstock )(7 / 7)
(ఇక్కడ మేము ఎవరినీ మద్యం తాగమని ప్రోత్సహించడం లేదు. కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.)
ఇతర గ్యాలరీలు