DIY టాయిలెట్ క్లీనింగ్: ఈ చిట్కాలతో మీ వాష్ రూమ్‌ను మెరిపించండి-diy toilet cleaning natural ways to keep your toilet sparkling clean ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy టాయిలెట్ క్లీనింగ్: ఈ చిట్కాలతో మీ వాష్ రూమ్‌ను మెరిపించండి

DIY టాయిలెట్ క్లీనింగ్: ఈ చిట్కాలతో మీ వాష్ రూమ్‌ను మెరిపించండి

HT Telugu Desk HT Telugu
Dec 19, 2024 08:00 PM IST

మీ టాయిలెట్‌ని శుభ్రంగా ఉంచుకోవడం మీ ఇంటిల్లిపాది ఆరోగ్యానికి అత్యంత అవసరం. సూపర్ మార్కెట్లు, ఆన్‌లైన్ స్టోర్లలో లభించే బోలెడన్ని టాయిలెట్ క్లీనర్‌లు ప్రభావవంతంగా పనిచేసినప్పటికీ, వాటికి ఖర్చు ఎక్కువనే చెప్పాలి. పైగా పర్యావరణానికి, మీ ఆరోగ్యానికి హాని కలిగించే కఠినమైన రసాయనాలను కలిగి ఉంటాయి.

టాయిలెట్ క్లీనింగ్ సొల్యూషన్స్
టాయిలెట్ క్లీనింగ్ సొల్యూషన్స్ (pixabay)

మీ టాయిలెట్ శుభ్రం చేయడానికి అనేక సహజమైన, సమర్థవంతమైన మార్గాలు ఇక్కడ చూడండి.

వెనిగర్:

క్లీనింగ్‌కు బాగా ఉపకరిస్తుంది. వెనిగర్ ఖనిజ నిక్షేపాలు, ధూళిని కూడా కరిగిస్తుంది. స్ప్రే బాటిల్‌లో సమాన భాగాలలో వైట్ వెనిగర్, నీటిని కలపండి. టాయిలెట్ బౌల్‌పై ద్రావణాన్ని స్ప్రే చేయండి, దానిని 10-15 నిమిషాలు ఉంచి, ఆపై టాయిలెట్ బ్రష్‌తో స్క్రబ్ చేయండి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా మొండి మరకలను స్క్రబ్ చేయడంలో సహాయపడుతుంది. టాయిలెట్ బౌల్‌పై బేకింగ్ సోడా చల్లి, టాయిలెట్ బ్రష్‌తో స్క్రబ్ చేయండి. ఇంకా శక్తిమంతంగా పనిచేయాలంటే బేకింగ్ సోడాను కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ లా చేయండి.

నిమ్మరసం:

సహజమైన క్రిమిసంహారక, డియోడ్రెంట్‌గా పనిచేస్తుంది, నిమ్మరసం మీ టాయిలెట్‌లో దుర్వాసనను పోగొట్టి ఫ్రెష్‌నెస్ ఫీలింగ్ ఇస్తుంది. టాయిలెట్ బౌల్‌లో ఒకటి లేదా రెండు నిమ్మకాయల రసాన్ని చల్లి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత, టాయిలెట్ బ్రష్ ఉపయోగించి స్క్రబ్ చేయండి.

రెగ్యులర్ క్లీనింగ్

రోజువారీ క్లీనింగ్: టాయిలెట్ సీటు, ట్యాంక్, బేస్‌ను తుడిచేందుకు ఒక గుడ్డను పైన సూచించిన ఏదేని ద్రావణాల్లో ఒక దానితో తుడవండి.

వీక్లీ క్లీనింగ్: టాయిలెట్ బ్రష్, క్లీనింగ్ సొల్యూషన్‌తో టాయిలెట్ బౌల్‌ను స్క్రబ్ చేయండి. అంచుల కింద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి.

నెలవారీ క్లీనింగ్: టాయిలెట్ ట్యాంక్, బేస్ పూర్తిగా శుభ్రం చేయండి. వెనిగర్ ద్రావణం ఉపయోగిస్తే ఏవైనా మినరల్స్, హార్డ్ వాటర్ మరకలు కూడా తొలగిపోతాయి.

డీప్ క్లీనింగ్ ఇలా

మొండి మరకలు: మొండి మరకల కోసం, బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ పేస్ట్‌ను తయారు చేయండి. పేస్ట్‌ను స్టెయిన్‌కు అప్లై చేసి, 30 నిమిషాలు అలాగే ఉండనివ్వండి, ఆపై టాయిలెట్ బ్రష్‌తో స్క్రబ్ చేయండి.

హార్ట్ వాటర్ మరకలు: వెనిగర్‌లో కాగితపు టవల్‌ను నానబెట్టి మరకపై అతికించండి. అవసరమైతే టేప్‌తో అతికించండి. రాత్రంతా అలా ఉండిపోనివ్వండి. మరుసటి రోజు ఆ పేపర్ తీసేసి టాయిలెట్ బ్రష్‌తో మరకను స్క్రబ్ చేయండి.

టాయిలెట్ బ్లాక్ అయి ఉంటే: టాయిలెట్ బౌల్‌లో వేడి నీటిని పోయండి. అది కూడా పని చేయకపోతే, అడ్డంకిని తొలగించడానికి ప్లంగర్‌ని ఉపయోగించండి. చివరి ప్రయత్నంగా, మీరు టాయిలెట్ ప్లంబింగ్ స్నేక్ ఉపయోగించి క్లియర్ చేయొచ్చు.

ఈ టిప్స్ కూడా పాటించండి

వెంటిలేషన్: తేమను తగ్గించడానికి, నాచు పెరుగుదలను నివారించడానికి బాత్రూమ్‌లో బాగా వెంటిలేషన్ ఉండేలా చేయండి.

ఎగ్జాస్ట్ ఫ్యాన్: టాయిలెట్ ఉపయోగించినప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ నడిచేలా చూడండి. ఇప్పుడు బయటి రెక్కలు మూసుకుని ఉండి, ఆన్ చేసినప్పుడు తెరుచుకునేలా కొత్త మోడల్స్ వస్తున్నాయి. రూ. 1000 ధర ఉంటుంది. విద్యుత్తు బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది. వీటిని ఉపయోగించడం వల్ల దుర్వాసన ఉండదు. టాయిలెట్ ఫ్రెష్ గా ఉంటుంది.

ఫ్లష్ పనిచేయకపోవడం: ఒక్కోసారి టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్ లోని ప్లాస్టిక్ విడిభాగాలు వాటర్ కారణంగా పట్టేసి ఉంటాయి. ఫ్లష్ పనిచేయకుండా పోతుంది. ప్రతిసారి దానిని ఓపెన్ చేసి కదిలించడం కష్టంగా మారుతుంది. బద్దకంతో ఫ్లష్ రెగ్యులర్ గా చేయకపోవడం వల్ల దుర్గందం వెదజల్లుతుంది. అలాంటప్పుడు ఫ్లష్ వాటర్ ట్యాంకులో, ముఖ్యంగా నీటిని నింపేటప్పుడు కిందికి, పైకి రావాల్సిన విడిభాగాల వద్ద టాయిలెట్ క్లీనర్ వేయడం వల్ల సాల్ట్ వాటర్ తో బిగుసుకుపోయినవన్నీ తిరిగి పనిచేస్తాయి.

లీకేజీ అరికట్టండి: టాయిలెట్ బేస్ చుట్టూ లీక్‌లు సర్వసాధారణం. అలాగే ఫ్లష్ ట్యాంక్ కూడా ఓవర్ ఫ్లో అవుతుంటుంది. వీటి వల్ల టాయిలెట్ ఎప్పుడూ తేమగా ఉండి త్వరగా దుర్గందానికి కారణమవుతుంది. లీకేజీలు మరింత పెద్దవిగా అవకముందే వాటిని అరికట్టండి.

చేతి పరిశుభ్రత: టాయిలెట్‌ కు వెళ్లినప్పుడు కానీ, టాయిలెట్ శుభ్రం చేసినప్పుడు గానీ తర్వాత సబ్బు, నీటితో ఎల్లప్పుడూ మీ చేతులను బాగా కడగాలి. వీలైతే హెర్బల్స్ తో చేసినవి వాడడం వల్ల మీ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.

Whats_app_banner