Lord Sun: జనవరి 13 వరకు ధనుస్సు రాశిలోకి సూర్యుడి సంచారం, ఈ రాశివారికి అదృష్టం-suns transit into sagittarius sign till january 13 good luck for this sign ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Sun: జనవరి 13 వరకు ధనుస్సు రాశిలోకి సూర్యుడి సంచారం, ఈ రాశివారికి అదృష్టం

Lord Sun: జనవరి 13 వరకు ధనుస్సు రాశిలోకి సూర్యుడి సంచారం, ఈ రాశివారికి అదృష్టం

Haritha Chappa HT Telugu
Dec 19, 2024 06:30 PM IST

Lord Sun: సూర్యుడు జనవరి 13 వరకు ధనుస్సు రాశిలో ఉంటాడు. రాశిచక్ర పంచాంగం ప్రకారం జనవరి 14న సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున పవిత్రమైన మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండటం ద్వారా కొన్ని రాశులకు మేలు జరుగుతుంది.

సూర్య సంచారం
సూర్య సంచారం

సూర్యభగవానుడు ప్రతి నెలా రాశిచక్రాలను మారుస్తాడు. సూర్యభగవానుడు డిసెంబర్ 15న వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు జనవరి 13 వరకు ధనుస్సు రాశిలో ఉంటాడు. రాశిచక్ర పంచాంగం ప్రకారం జనవరి 14న సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున పవిత్రమైన మకర సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండటం ద్వారా కొన్ని రాశులకు ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. ధనుస్సు రాశిలో సూర్యభగవానుడు ఉండటం వల్ల కొన్ని రాశుల వారు ప్రయోజనం పొందుతారు. నెల రోజుల పాటూ ఈ రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.

జనవరి 13 వరకు సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండటం ద్వారా ఏ రాశుల వారు లాభపడతారో తెలుసుకోండి.

మేష రాశి

మేషరాశి వారికి కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మనసు సంతోషంగా ఉంటుంది. ఇప్పటికే నిలిచిపోయిన పనులు సాధ్యపడతాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభావకాశాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. కష్టపడి పనిచేస్తే శుభ ఫలితాలు వస్తాయి. వృత్తి, రంగాల్లో పురోభివృద్ధికి అవకాశాలున్నాయి.

సింహ రాశి

ఈ రాశి వారు సూర్యుడి వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వీరి మనస్సులో ఆనందం వెల్లివిరుస్తుంది. సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభావకాశాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు ఏర్పడతాయి.

కన్యా రాశి

ఈ రాశివారి జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతి అంశంలో లాభావకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగంలో పురోగతికి మార్గం సుగమం అవుతుంది. కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి. సంపదను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యా, మేధోపరమైన పనులు సత్ఫలితాలు ఇస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

ధనుస్సు రాశి

ఈ రాశి వారు ఉద్యోగంలో,వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే నిలిచిపోయిన పనుల్లో శ్రమతో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితిలో సానుకూల మెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది.

( గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడం లేదు. మరింత సమాచారం, సలహాల కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.)

Whats_app_banner