Telangana Tourism : ప్రకృతి అందాలు.. చారిత్రక కట్టడాలు.. ఓరుగల్లు నగరం పర్యాటకులకు స్వర్గధామం-the natural beauty and historical monuments of warangal city attract tourists ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : ప్రకృతి అందాలు.. చారిత్రక కట్టడాలు.. ఓరుగల్లు నగరం పర్యాటకులకు స్వర్గధామం

Telangana Tourism : ప్రకృతి అందాలు.. చారిత్రక కట్టడాలు.. ఓరుగల్లు నగరం పర్యాటకులకు స్వర్గధామం

Dec 19, 2024, 06:26 PM IST Basani Shiva Kumar
Dec 19, 2024, 06:26 PM , IST

  • Telangana Tourism : తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి ఊపిరి పోస్తోంది. పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా ఓరుగల్లును పర్యాటకులకు స్వర్గధామంగా మారుస్తోంది. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఒకే రోజులో పలు ప్రదేశాలను చూసేలా ఏర్పాట్లు చేస్తోంది.

ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలకు పుట్టినిల్లు ఓరుగల్లు. ముఖ్యంగా వరంగల్ నగరంలోని పలు ప్రదేశాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దీంతో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఒకే రోజులో చాలా ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.

(1 / 5)

వరంగల్‌ వెళ్తే కచ్చితంగా కోటను చూడాలి. కాకతీయ రాజులు నిర్మించిన కోట ఇది. పర్యాటకుల్ని ఎంతో ఆకర్షిస్తున్న ఈ ప్రాంతాన్ని అడ్వెంచర్‌ పర్యాటకంగా మార్చనున్నారు. గుండు చెరువులో బోటింగ్, రాతి కీర్తి తోరణాలు, రాతికోట, ఖుష్‌మహల్‌ ఆకర్షించేలా ఫసాడ్‌ విద్యుత్తు వెలుగుల సదుపాయం కల్పించారు. చెరువు చుట్టూ బండ్‌ నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడికి వస్తే.. నగరంలోని ఉన్న ప్రైవేట్‌ హోటల్స్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి కేవలం 2.4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

(2 / 5)

వరంగల్‌, హనుమకొండ నగరాల మధ్యన భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. విశాలమైన భద్రకాళి చెరువు చుట్టూ భద్రకాళి బండ్‌‌ను అభివృద్ధి చేస్తున్నారు. చెరువులో బోటింగ్‌ సదుపాయం కల్పించడానికి, దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి పనులు చేపడుతున్నారు. ఇక్కడి వెళ్తే హరిత లేదా ప్రైవేటు హోటళ్లలో విశ్రాంతి తీసుకోవచ్చు. వరంగల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. 

(3 / 5)

వరంగల్ నగరంలో మరో చారిత్రక కట్టడం వేయి స్తంభాల గుడి. ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు కొలువయ్యారు. ఇక్కడ శిల్పకళా సంపద ఆకట్టుకుంటుంది. ఇటీవలే వేయి స్తంభాల నాట్య మండపానికి పూర్వవైభవం తీసుకొచ్చారు. ఇక్కడికి వెళ్లే.. హరిత హోటల్, ప్రైవేటు హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. వరంగల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి 6 కిలోమీటర్లు, హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనం లేదా బస్సుల్లో వస్తే 154 కిలోమీటర్లు ఉంటుంది.

(4 / 5)

నగరంలో పిల్లలు ఆసక్తిగా సందర్శించే జూపార్క్ ఉంది. దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనికి సమీపంలోనే హరిత హోటల్ ఉంది. ఇది కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్యలో ఉంటుంది. హనుమకొండ, వరంగల్ బస్టాండ్‌ల నుంచి 10 నిమిషాల్లో జూపార్క్‌కు చేరుకోవచ్చు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు