(1 / 4)
రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. త్వరలోనే సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
(2 / 4)
రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో, త్వరలో సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
(3 / 4)
ఒకటి రెండు నెలల్లో ఈ సన్నబియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు.
(4 / 4)
బీపీఎల్ కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇది దొడ్డు బియ్యంగా ఉందని… దీన్ని మార్చి సన్నిబియ్యం ఇస్తామని పేర్కొన్నారు.
ఇతర గ్యాలరీలు