Kia Syros SUV: కియా సైరోస్ ఎస్యూవీ లాంచ్; ఏడీఏఎస్ సహా ప్రీమియం ఫీచర్స్ ఉన్న సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఇది
Kia Syros SUV: గ్లోబల్ లాంచ్ లో భాగంగా భారత్ లో కియా సైరోస్ ఎస్యూవీ లాంచ్ అయింది. ఈ కియా సైరోస్ భారతదేశంలో కియా నుండి వచ్చిన ఐదవ ఎస్ యూవీ. ఇది కియా సోనెట్ తో పాటు సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ విభాగంలో పోటీపడుతుంది.
Kia Syros SUV: కియా సైరోస్ ప్రపంచ మార్కెట్లతో పాటు భారతదేశంలో అధికారికంగా ప్రవేశించనుంది. ఈ ఎస్ యూవీ బుకింగ్స్ జనవరి 3, 2025 నుండి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఫిబ్రవరి 2025 నుండి ప్లాన్ చేయబడ్డాయి. కియా ఇండియా పోర్ట్ ఫోలియోలో ఇది ఐదవ ఎస్యూవీ. దీనిని కియా తన ‘న్యూ స్పీషీస్ ఆఫ్ ఎస్యూవీ’ గా పిలుస్తోంది.
పోటీ అధికం
భారత్ లో సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీ తీవ్రంగా ఉంది. ఈ సెగ్మెంట్ లోనే మారుతి సుజుకి బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్యూవి 3ఎక్స్ఓ, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, లేటెస్ట్ గా వచ్చిన స్కోడా కైలాక్ వంటి ఇతర మోడళ్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మరోవైపు, ఇదే సెగ్మెంట్లో కియా నుంచి కియా సోనెట్ ఇప్పటికే ఉంది. ఇప్పుడు కొత్తగా కియా సైరోస్ వస్తోంది. అయితే, సైరోస్ యువ కస్టమర్లు, ప్రీమియం కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకుంది.
సోనెట్ నుంచి భిన్నంగా..
ఇంకా, సోనెట్ నుంచి వేరు చేయడం కోసం కియా సైరోస్ లో చాలా భిన్నమైన స్టైలింగ్ కు వెళ్ళింది. అయితే, వీల్ బేస్ మినహా రెండింటి మధ్య కొలతలు దాదాపు సమానంగా ఉంటాయి. అయితే, సైరోస్ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కియా (kia motors) పేర్కొంది.
కియా సైరోస్ డిజైన్
కియా సైరోస్, కియా సోనెట్ ల మధ్య కొలతలు చాలా వరకు ఒకేలా ఉన్నప్పటికీ, డిజైన్ చాలా భిన్నంగా ఉంటుంది. కియా (KIA) 2.0 వ్యూహం కింద కంపెనీ డిజైన్ 2.0 ఫిలాసఫీని కలిగి ఉన్న కియా మొట్టమొదటి సారి భారతదేశంలో తయారు చేసిన ఎస్ యూవీ సైరోస్. డిజైన్ లాంగ్వేజ్ మొదట ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన కియా ఈవీ9 తో సమానంగా ఉంటుంది. ముందు భాగంలో, సైరోస్ వర్టికల్ ఎల్ఈడి డిఆర్ఎల్లతో పాటు చుంకీ ఫ్రంట్ బంపర్, బచ్ ఫేస్ ను పొందుతుంది. ఇది ఆర్వీ లాంటి ఫ్లాట్ రూఫ్ లైన్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. వెనుక భాగంలో, సైరోస్ రాప్-ఎరౌండ్ ఎల్-ఆకారంలో ఎల్ఇడి టెయిల్ లైట్లతో వస్తుంది. ఇవి ఎత్తుగా అమర్చబడి రూఫ్ లైన్ కు కనెక్ట్ చేయబడి ఉంటాయి.
కియా సైరోస్ ఫీచర్లు
డిజైన్ లాంగ్వేజ్ తో పాటు, కియా సోనెట్ తో పోలిస్తే సైరోస్ ఫీచర్ల పరంగా కూడా భిన్నంగా ఉంటుంది. కియా సైరోస్ మరింత ప్రీమియం ఫీచర్లను కస్టమర్లకు అందిస్తోంది. కియా సైరోస్ లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేతో కూడిన 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంది. ఇందులోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ ను పొందుతుంది. అదనంగా, సైరోస్ క్యాబిన్ లో వెంటిలేటెడ్ సీట్లు (ముందు, వెనుక రెండూ), స్లైడింగ్, రిక్లైనింగ్ రెండవ వరుస సీట్లు, ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ చేయడానికి పుష్ బటన్, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా, వైర్లెస్ ఛార్జర్, ట్విన్ యుఎస్బీ సి పోర్ట్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, పనోరమిక్ సన్రూఫ్ ఉన్నాయి. భద్రత పరంగా చూస్తే, సైరోస్ లో అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) లెవల్ 2 టెక్నాలజీ లభిస్తుంది. ఈ వాహనం లేన్ కీప్ అసిస్ట్ తో సహా 16 అధునాతన అడాప్టివ్ ఫీచర్లతో వస్తుంది. హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆరు ఎయిర్ బ్యాగులు తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
కియా సైరోస్ స్పెసిఫికేషన్లు
కియా సైరోస్ పెట్రోల్, డీజిల్ పవర్ట్రెయిన్లలో లభిస్తుంది. సోనెట్ టర్బో వేరియంట్లలో కనిపించే 1.0 లీటర్ మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ సైరోస్ పెట్రోల్ వేరియంట్లలో ఉంటుంది. అయితే, సోనెట్ మాదిరిగా కాకుండా, టర్బో పెట్రోల్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 118బిహెచ్ పి పవర్, 172ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సైరోస్ డీజిల్ వేరియంట్లలో సోనెట్, సెల్టోస్, కియా కారెన్స్ లకు శక్తినిచ్చే 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఉంటుంది. సైరోస్ లోని డీజల్ ఇంజన్ గరిష్టంగా 116బిహెచ్ పి పవర్, 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ తో జతచేయబడుతుంది.