Mahindra Thar 5-door: మహీంద్రా థార్ 5-డోర్ మరోసారి కనిపించింది.. కొత్త అల్లాయ్ వీల్స్‌ మీరూ చూడండి-mahindra thar 5 door spotted once again new alloy wheels designed revealed ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Thar 5-door: మహీంద్రా థార్ 5-డోర్ మరోసారి కనిపించింది.. కొత్త అల్లాయ్ వీల్స్‌ మీరూ చూడండి

Mahindra Thar 5-door: మహీంద్రా థార్ 5-డోర్ మరోసారి కనిపించింది.. కొత్త అల్లాయ్ వీల్స్‌ మీరూ చూడండి

HT Telugu Desk HT Telugu
Published Feb 14, 2024 12:14 PM IST

మహీంద్రా థార్ 5-డోర్ వాహనం మరోసారి కనిపించింది. దీనిలో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ డీజల్ ఇంజన్ ఉంటుంది.

ఐదు డోర్లు కలిగిన కొత్త థార్
ఐదు డోర్లు కలిగిన కొత్త థార్

మహీంద్రా అండ్ మహీంద్రా కొంతకాలంగా థార్ యొక్క 5-డోర్ల వెర్షన్‌ను పరీక్షిస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీ ఈ ఏడాది చివర్లో అమ్మకానికి రానుంది. 5-డోర్ల థార్‌కు మహీంద్రా కొన్ని కాస్మెటిక్ మార్పులు చేయనున్నట్లు తాజా స్పై షాట్స్ చూపిస్తున్నాయి.

ఇది 5-డోర్ల వెర్షన్‌ను 3-డోర్ మోడల్ నుండి వేరు చేయడానికి సహాయపడుతుంది. తాజా స్పై షాట్స్ ప్రకారం థార్ 5-డోర్ల వాహనం థార్ 3-డోర్ల కంటే పెద్దదైన కొత్త అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. థార్ 3-డోర్ 18-అంగుళాల యూనిట్లను ఉపయోగిస్తుంది. 5-డోర్లు కల కొత్త థార్ డైమండ్-కట్ ఫినిష్ తో 19-అంగుళాల యూనిట్లను ఉపయోగిస్తుంది.

అల్లాయ్ వీల్స్ కాకుండా, థార్ 5-డోర్ ఎస్‌యూవీలో ఇతర మార్పులు ఉన్నాయి. హెడ్ ల్యాంప్‌లు ఇప్పుడు ఎల్‌ఇడిఎస్ మరియు కొత్త ఎల్‌ఇడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు కూడా ఉంటాయి. రియర్ టెయిల్ ల్యాంప్ యూనిట్లు కూడా ఇప్పుడు కొత్తగా ఉన్నాయి. రీడిజైన్ చేయబడిన ఎల్ఇడి ఎలిమెంట్లను కలిగి ఉన్నాయి. ఇక ఫ్రంట్ గ్రిల్‌ను కూడా మార్చారు.ఇప్పుడు వెనుక డోర్ హ్యాండిల్స్‌ను సి-పిల్లర్ పై అమర్చారు.

ఇంటీరియర్ లేఅవుట్ ఎక్కువగానే ఉంటుంది. దీనిలో కొన్ని అప్ డేట్స్ రానున్నాయి. ఉదాహరణకు స్టీరింగ్ వీల్‌ను ఎక్స్‌యూవీ 700 నుంచి అనుకరించారు. డ్యాష్ బోర్డ్‌లో అతిపెద్ద మార్పు ఏమిటంటే, ఎక్స్‌యువి 400 నుండి అనుకరించినదే అయినా, మరింత అడ్వాన్స్‌డ్‌గా కొత్త ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది.

అయితే ఇందులో కొన్ని ఈవీ సంబంధిత ఫీచర్లు ఉండవు. కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రస్తుత వ్యవస్థ కంటే పెద్దది. కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌పై నడుస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేను ఇది సపోర్ట్ చేస్తుంది.

టెస్టింగ్ చేస్తూ కనిపించింది

5-డోర్లు కలిగిన థార్ ఇటీవల లాండౌర్‌లో హై ఆల్టిట్యూడ్ టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఆటోమొబైల్ తయారీదారులు తరచుగా తమ వాహనాలను అన్ని రకాల వాతావరణాలలో పరీక్షిస్తారు. ఈ పరీక్షలో కొంత భాగాన్ని ఎత్తైన ప్రదేశాల్లో నిర్వహిస్తారు.

అన్ని రకాల వాతావరణాల్లో వాహనం ఇబ్బంది లేకుండా, వినియోగదారుడికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడటమే దీని ఉద్దేశం. కొన్నిసార్లు, వాహనాలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత సమస్యలను ఎదుర్కొంటాయి. తయారీదారులు ఇసియు అప్‌గ్రేడ్ ఉపయోగించి లేదా చిన్న యాంత్రిక మార్పులు చేయడం ద్వారా వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది.

Whats_app_banner