50ఎంపీ కెమెరా, 45వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వచ్చే ఈ రియల్‌మీ ఫోన్‌ఫై తగ్గింపు-realme narzo 70 turbo with 50mp camera and 45w fast charging smartphone gets best discount check affordable price here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  50ఎంపీ కెమెరా, 45వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వచ్చే ఈ రియల్‌మీ ఫోన్‌ఫై తగ్గింపు

50ఎంపీ కెమెరా, 45వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వచ్చే ఈ రియల్‌మీ ఫోన్‌ఫై తగ్గింపు

Anand Sai HT Telugu
Dec 19, 2024 11:00 AM IST

Realme Narzo Turbo 70 Discount : రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీ స్మార్ట్‌ఫోన్‌ తగ్గింపులో దొరుకుతుంది. ఈ సేల్‌లో ఈ రియల్‌మీ ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది.

రియల్‌మీ నార్జో 70 టర్బో
రియల్‌మీ నార్జో 70 టర్బో

మీరు 15 నుండి 16 వేల రూపాయల బడ్జెట్‌లో కొత్త ఫోన్ కోసం చూస్తున్నట్లయితే రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ప్రత్యేకత ఏమిటంటే అమెజాన్‌ డీల్‌లో ఈ ఫోన్ బంపర్ డిస్కౌంట్తో లభిస్తుంది. 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,998గా ఉంది. అంటే 15 శాతం డిస్కౌంట్‌తో వస్తుంది. ఈ డీల్‌లో ఫోన్‌పై రూ.2500 కూపన్ డిస్కౌంట్ దొరుకుతుంది.

ఈ ఫోన్ మీద రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను 2400×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందిస్తున్నారు. ఈ డిస్ ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్‌తో ఉన్న ఈ డిస్‌ప్లే ఎల్లో బ్రైట్ నెస్ లెవల్ 2000 నిట్స్ వరకు ఉంటుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం మీకు పాండా గ్లాస్ కూడా లభిస్తుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ప్రాసెసర్‌గా కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌ను ఫోన్‌లో అందిస్తోంది. ఫొటోగ్రఫీ కోసం ఎల్ఈడీ ఫ్లాష్‌తో రెండు కెమెరాలు ఈ ఫోన్‌లో ఉన్నాయి. వీటిలో 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ ఏఐ మెయిన్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందిస్తోంది.

రియల్‌మీకి చెందిన ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని చూడొచ్చు. ఈ బ్యాటరీ 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఓఎస్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

Whats_app_banner