2024 కోసం మా ప్రత్యేక ఆస్ట్రాలజీ (జ్యోతిష్యం) పేజీకి స్వాగతం. ఈ సంవత్సరం మన జాతకాలను ప్రభావితం చేసే గ్రహాలు, నక్షత్రాల కదలికలతో కూడిన సంపూర్ణ సమాచారం ఇక్కడ పొందండి.
జవాబు: గ్రహాలు నిర్ధిష్ట కాలాన్ని అనుసరించి తమ కదలికలు మార్చుకుంటాయి. అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి పరివర్తన చెందుతాయి. గ్రహాలు అలా ఒక రాశి నుంచి ఇంకో రాశికి సంచరించినప్పుడు విభిన్న రాశుల జాతకులు శుభ, అశుభ ఫలితాలు పొందుతారు. 2024లో కూడా పలు గ్రహాల సంచారం ఉంటుంది. ఆయా సంచారాలను బట్టి జాతకుల రాశి ఫలితాలు ఉంటాయి.
+
జవాబు: సాధారణంగా అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శని. శనీశ్వరుడు ప్రతి రెండున్నరేళ్లకోసారి తన రాశిని మార్చుకుంటాడు. తరువాత రాహువు, కేతువు ప్రతి 19 నెలలకోసారి రాశి మారుతారు. గురువు (బృహస్పతి) 12.5 నెలల్లో రాశి మారుతాడు. కుజుడు 45 రోజులకోసారి, సూర్యుడు 30 రోజులకోసారి రాశి మారుతారు. శుక్రుడు 26 రోజులకు, బుధుడు 21 రోజులకు రాశి మారుతాడు. చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు రాశి మారుతాడు. ఇలా రాశి మారినప్పుడల్లా జాతకుల వ్యక్తిగత జాతక చక్రం అనుసరించి వారిపై ఈ గ్రహ సంచార ప్రభావం పడుతుంది.
+
జవాబు: 2024లో సూర్య గ్రహణం రెండుసార్లు, చంద్రగ్రహణం రెండుసార్లు ఏర్పడనుంది. 2024లో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. రెండో సూర్యగ్రహణం అక్టోబరు 2న ఏర్పడనుంది. 2024లో మొదటి చంద్రగ్రహణం మార్చి 25న, రెండో చంద్రగ్రహణ సెప్టెంబరు 18న ఏర్పడనున్నాయి.