Leap year lucky zodiac signs: ఫిబ్రవరి 29న పుట్టారా? శుభ యోగాలతో ఈ లీప్ ఇయర్ మీ జీవితంలో ప్రత్యేకంగా మారనుంది-leap year february 29 2024 after four years form raja yogam in this month these zodiac signs get good future ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Leap Year Lucky Zodiac Signs: ఫిబ్రవరి 29న పుట్టారా? శుభ యోగాలతో ఈ లీప్ ఇయర్ మీ జీవితంలో ప్రత్యేకంగా మారనుంది

Leap year lucky zodiac signs: ఫిబ్రవరి 29న పుట్టారా? శుభ యోగాలతో ఈ లీప్ ఇయర్ మీ జీవితంలో ప్రత్యేకంగా మారనుంది

Gunti Soundarya HT Telugu
Feb 26, 2024 11:47 AM IST

Leap year lucky zodiac signs: ఫిబ్రవరి 29న పుట్టారా? అయితే మీరు ఈ శుభ యోగాల ప్రభావంతో అదృష్టవంతులుగా మారబోతున్నారు. అనేక అద్భుతమైన పరిణామాలు ఎదురుకాబోతున్నాయి.

ఫిబ్రవరి 29న శుభ యోగాలు
ఫిబ్రవరి 29న శుభ యోగాలు (freepik)

Leap year lucky zodia signs: నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. అలా 2024 సంవత్సరం లీప్ ఇయర్ గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 29 రోజులు వచ్చాయి. ఈ లీప్ ఇయర్ కొన్ని రాశుల వారికి అద్భుతమైన శుభ యోగాలు తీసుకొచ్చింది. ఫలితంగా ఫిబ్రవరి 29 న జన్మించిన వ్యక్తులు అదృష్టాన్ని పొందబోతున్నారు.

లీప్ ఇయర్ లో గ్రహాలు, నక్షత్రాలకలయిక కారణంగా ఈనెల ప్రత్యేకంగా మారింది. జ్యోతిష్య పరంగా కూడా లీప్ డే కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశుల స్థానాలు జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయి. ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు రాశి చక్రాలు మార్చుకుంటూ ఇతర గ్రహాలతో సంయోగం చెందుతున్నాయి. దాని ఫలితంగా మొత్తం పన్నెండు రాశుల మీద సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండనుంది.

కుంభ రాశిలో మూడు గ్రహాల కలయిక

ఫిబ్రవరి 29న సూర్యుడు, శని, బుధుడు కుంభరాశిలో కలిసి ఉండటం జ్యోతిష్య శాస్త్ర పరంగా అద్భుతంగా పరిగణిస్తారు. గ్రహాల రాజు, గ్రహాల రాకుమారుడు బుధుడు శని సొంత రాశిలో సంచరిస్తున్నారు. శని, సూర్యుడి కలయిక సుమారు 30 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. కుంభ రాశిలో మూడు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య రాజ యోగం కూడా ఏర్పడనుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చి ధనలాభం కలుగుతుంది.

అదేవిధంగా ఈ సమయంలో దేవ గురువు బృహస్పతి తన మిత్ర గ్రహమైన అంగారకుడి రాశిలో ప్రయాణిస్తున్నాడు. శుభాలను ఇచ్చే గ్రహంగా పరిగణించే శుక్రుడు, అంగారకుడు కలిసి మకర రాశిలో సంచారం చేస్తున్నారు.

ఈ ఫిబ్రవరి నెల మరింత ప్రత్యేకం

ఫిబ్రవరి 29న జన్మించిన వ్యక్తులు నాలుగు సంవత్సరాలకు ఒకసారి తమ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటారు. ఈనెలకు ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే.. ఒకటో తారీఖు గురువారంతో ప్రారంభమవగా నెల చివరి రోజు 29 తేదీ కూడా గురువారంతోనే ముగుస్తుంది.

ఫిబ్రవరి 29 కుంభరాశిలో అద్భుతమైన కలయిక జరగబోతుంది. ఈరోజు జన్మించిన వారి జన్మ చార్ట్ లో శని స్థానం బలంగా ఉన్నవాళ్లు పంచ మహా పురుష రాజయోగాన్ని అనుభవిస్తారు. ఇది శుభ, శక్తివంతమైన గ్రహ కలయికలను సూచిస్తుంది.

వృషభం, సింహం, వృశ్చికం లేదా కుంభ రాశుల జాతకులు ఫిబ్రవరి 29 న జన్మించిన వ్యక్తులకు శశ రాజ యోగం ప్రభావం ఉండనుంది. ఇక మేషం, కర్కాటకం, తుల, మకర రాశి వారికి రుచక యోగం ప్రభావంతో సానుకూల ఫలితాలు పొందుతారు.

ఫిబ్రవరి 29, 2024న జన్మించిన పిల్లలకు శని, అంగారకుడు ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఈ గ్రహాల స్థానాలు వారి జన్మ పట్టికను బలోపేతం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ తేదీలో జన్మించిన వారి జీవితం శ్రేయస్సు, ఆనందంతో నిండిపోతుంది.