ఈ 7 సీటర్ ధర 5.32 లక్షలు.. మైలేజీలో కూడా బెటర్.. కొనేందుకు మిడిల్ క్లాస్ వాళ్లు ఆలోచించొచ్చు!
Maruti Suzuki Eeco 7 Seater : మారుతి సుజుకిలో మంచి వాహనం తీసుకోవాలంటే ఈకో 7 సీటర్ బెస్ట్. ఎందుకంటే ఇది రెండు విధాలుగా మీకు ఉపయోగపడుతుంది. ఈ కారు గురించి తెలుసుకుందాం..
మారుతి సుజుకి ఈకో చాలా మందికి తెలుసు. 2010లో ఇది మార్కెట్‌లోకి వచ్చింది. అప్పటి నుండి జనాలకు దీనిపై మక్కువ ఎక్కువే. ఇది పెద్దగా ఉండే 7-సీటర్ వాహనం. దీనితో వ్యక్తిగత వినియోగమే కాకుండా స్కూల్ వ్యాన్‌గా కూడా వాడుతారు. భారతీయ మార్కెట్‌లో మధ్యతరగతి ప్రజలకు ఇది చాలా ఇష్టమైన వాహనం అని చెప్పవచ్చు. ఈ కారు తక్కువ ధరతో వస్తుంది.. అధిక మైలేజీని ఇస్తుంది. ఈ వాహనం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మారుతి సుజుకి ఈకోలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 81 పీఎస్ పవర్, 104.4ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సీఎన్జీ మోడల్‌లో కూడా దొరుకుతుంది. సీఎన్‌జీలో నడుస్తున్నప్పుడు దాని పవర్ అవుట్‌పుట్ తగ్గుతుంది. సీఎన్‌జీ వేరియంట్ 72 పీఎస్ పవర్, 95ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
దీని మైలేజీ గురించి చూస్తే.. పెట్రోల్ ఇంజన్ లీటరుకు 20 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సీఎన్‌జీ ఇంజన్ కిలోగ్రాముకు 27 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.
మారుతి సుజుకి ఈకో బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.32 లక్షల నుండి మొదలవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 6.58 లక్షల ఎక్స్-షోరూమ్‌కు వరకు ఉంటుంది. ఈ కారు 5 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో అమ్మకానికి అందుబాటులో దొరుకుతుంది.
ఇందులో మాన్యువల్ ఏసీ, 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, డిజిటల్ స్పీడోమీటర్, ప్రయాణికుల సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్, ఈబీడీ, వెనుక పార్కింగ్ సెన్సార్‌తో కూడిన ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
తక్కువ ధరలో మంచి వాహనం కొనాలి అనుకునేవారికి ఉపయోగపడుతుంది. ఇది ఇంటికి, అటు ఇతర పనులకు కూడా ఉపయోగించుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్లకు ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
టాపిక్