ఈ రెట్రో మోడల్ స్కూటర్‌కు ఫ్యాన్స్ ఎక్కువే.. 3 లక్షల యూనిట్ల అమ్మకాలు
Bajaj Chetak : బజాజ్ చేతక్ స్కూటర్ అమ్మకాల్లో దూసుకెళ్తోంది. 3 లక్షల యూనిట్ల మార్కును దాటింది. మార్కెట్‌లో ఈ స్కూటీకి తనదైన ముద్రం వేసుకుంది. చాలా మంది ఈ స్కూటర్‌ను ఇష్టపడుతున్నారు.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో 3 లక్షల యూనిట్ల హోల్‌సేల్ మార్కును దాటింది. 2020 జనవరిలో లాంచ్ అయినప్పటి నుండి అక్టోబర్ 2024 వరకు చేతక్ ద్విచక్ర వాహనం మంచి అమ్మకాలను చేసింది. సియామ్ హోల్‌సేల్ డేటా ప్రకారం మొత్తం 3,03,621 యూనిట్లను విక్రయించింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అక్టోబర్ 2024 లో అత్యధిక నెలవారీ ఎగుమతులు చేసింది. బజాజ్ చేతక్ ఈ మైలురాయిని చేరుకోవడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. దీని సేల్స్ వివరాలు వివరంగా తెలుసుకుందాం.
జూన్ 2024లో 2 లక్షల యూనిట్ల మార్కును దాటిన తరువాత బజాజ్ చేతక్ కేవలం నాలుగు నెలల్లో 1 లక్ష యూనిట్ల అమ్మకాలను సాధించింది. అక్టోబర్ 2024లో చేతక్ ద్వారా అత్యధిక నెలవారీ ఎగుమతులు జరిగాయి. ఎందుకంటే బజాజ్ చేతక్ గత నెలలో 30,644 యూనిట్ల అమ్మకాలను సాధించింది.
2025 ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో 1,41,885 చేతక్ ఎగుమతులు సంవత్సరానికి 160 శాతం వృద్ధిని చూపించాయి. అలాగే ఉత్పత్తి-అమ్మకాల నిష్పత్తి బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్వెంటరీని చాలా బాగా నిర్వహిస్తోందని చూపిస్తుంది.
జనవరి 14, 2020న విడుదలైన బజాజ్ స్కూటర్ 3 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును దాటడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. చేతక్ సేల్స్ డేటా షీట్‌ను పరిశీలిస్తే.. 2023 ఆర్థిక సంవత్సరం చివరి వరకు అమ్మకాలు చాలా నెమ్మదిగా ఉన్నాయని చూపిస్తుంది. కానీ 2024 ఆర్థిక సంవత్సరంలో, 2025 ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో డిమాండ్ గణనీయంగా పెరిగింది.
2023 నవంబర్లో చేతక్ 1 లక్ష యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. దీనికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఏదేమైనా విస్తరించిన రిటైల్ నెట్‌వర్క్, పెరిగిన సామర్థ్యం, పెరుగుతున్న కస్టమర్ డిమాండ్ ఫలితంగా కేవలం ఒక సంవత్సరంలోనే తదుపరి 2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. వాస్తవానికి 2 లక్షల యూనిట్ల నుంచి 3 లక్షల యూనిట్లకు చేరుకోవడానికి కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే పట్టింది.
2024 ఆర్థిక సంవత్సరంలో 1,15,702 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది సంవత్సరానికి 219 శాతం పెరుగుదలగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 36,260 యూనిట్లు, 2024 ఏప్రిల్-అక్టోబర్‌లో 1,41,885 యూనిట్లు, 2023 ఏప్రిల్-అక్టోబర్లో 54,519 యూనిట్లతో పోలిస్తే 160 శాతం అధికంగా సేల్స్ జరిగాయి.