తెలుగు న్యూస్ / ఫోటో /
AP Pensions : ఏపీ పింఛన్ దారులకు గుడ్ న్యూస్, ఒకరోజు ముందుగానే డిసెంబర్ పెన్షన్ డబ్బులు పంపిణీ
AP Pensions : ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రోజు ముందుగానే డిసెంబర్ నెల పింఛన్లు అందించనున్నారు. డిసెంబర్ 1న ఆదివారం కావడం వలన డిసెంబర్ నెల పెన్షన్ ను ఒకరోజు ముందుగా అనగా నవంబర్ 30నే పంపిణీ చేయనున్నారు.
(1 / 6)
ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రోజు ముందుగానే డిసెంబర్ నెల పింఛన్లు అందించనున్నారు.
(2 / 6)
డిసెంబర్ 1న ఆదివారం కావడం వలన డిసెంబర్ నెల పెన్షన్ ను ఒకరోజు ముందుగా అనగా నవంబర్ 30నే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
(3 / 6)
ప్రతి నెల ఫస్ట్ తారీఖున గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఎన్టీఆర్ భరోసా వృద్ధ్యాప్త పింఛన్లను నేరుగా ఇంటి వద్దే పెన్షనర్లకు అందిస్తున్నారు. వరుసగా రెండు నెలలు పింఛన్ తీసుకోకపోతే మూడు నెలల పింఛన్ ను మూడో నెలలో ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. డిసెంబర్ నెల నుంచే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే వారి పింఛన్ రద్దు చేస్తారు.
(4 / 6)
పెన్షన్ లబ్ధిదారుడు మరణిస్తే ఆయన భార్యకు మరుసటి నెల నుంచి వితంతు పింఛన్ మంజూరు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పింఛన్ తీసుకునే వ్యక్తి ఆ నెల 15వ తేదీ లోపు మరణిస్తే వితంతు మహిళకు తదుపరి నెల ఒకటో తేదీనే పింఛన్ మంజూరు చేయనున్నారు.
(5 / 6)
దివ్యాంగ విద్యార్థుల పింఛన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థుల పింఛన్ డబ్బులను డీబీటీ ద్వారా అకౌంట్‌లలో జమ చేయాలని నిర్ణయించింది. దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెలా పింఛన్ తీసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది.
ఇతర గ్యాలరీలు