Web Series: విక‌ట‌క‌వి క‌థ‌తో సినిమా చేయాల‌నుకొని వెబ్‌సిరీస్ చేశాం - ప్రొడ్యూస‌ర్ కామెంట్స్‌-producer ram talluri commented that he wanted to make a film based on vikatakavi web series story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Web Series: విక‌ట‌క‌వి క‌థ‌తో సినిమా చేయాల‌నుకొని వెబ్‌సిరీస్ చేశాం - ప్రొడ్యూస‌ర్ కామెంట్స్‌

Web Series: విక‌ట‌క‌వి క‌థ‌తో సినిమా చేయాల‌నుకొని వెబ్‌సిరీస్ చేశాం - ప్రొడ్యూస‌ర్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 25, 2024 06:42 PM IST

Web Series: న‌రేష్ అగ‌స్త్య‌, మేఘా ఆకాష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు వెబ్ సిరీస్ విక‌ట‌క‌వి న‌వంబ‌ర్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క‌థ‌తో తొలుత సినిమా చేయాల‌ని అనుకున్నామ‌ని, జీ5 ఓటీటీ వ‌ల్ల వెబ్‌సిరీస్‌గా మారింద‌ని ప్రొడ్యూస‌ర్ రామ్ తాళ్లూరి అన్నారు.

వెబ్ సిరీస్
వెబ్ సిరీస్

Web Series: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో న‌టించిన విక‌ట‌క‌వి వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ డిటెక్టివ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌కు ప్ర‌దీప్‌ మద్దాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి వికటకవి వెబ్ సిరీస్‌ను నిర్మించారు.

పసుపు కుంకుమ సీరియల్…

సోమ‌వారం వెబ్‌సిరీస్ యూనిట్ పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటుచేసింది. ఈ వేడుక‌లో న‌రేష్ అగ‌స్త్య మాట్లాడుతూ “గ‌తంలో జీ5లో నేను పసుపు కుంకుమ సీరియల్ చేశాను. ఇప్పుడు లీడ్ రోల్‌గా విక‌ట‌క‌వి వెబ్ సిరీస్‌ చేస్తున్నాను. పరువు వెబ్ సిరీస్ లో నా న‌ట‌న‌ను చూసి విక‌ట‌క‌విలోకి తీసుకున్నారు. ఇంత క్వాలిటీతో తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు ఏ వెబ్ సిరీస్ రాల‌ద‌నే అనుభూతిని విక‌ట‌క‌వి పంచుతుంది” అని అన్నాడు.

సినిమా అనుకున్నాం...

నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ‘విక‌ట‌క‌వి క‌థ‌ను రెండేళ్ల ముందే తేజ్ నాకు చెప్పాడు. అప్పుడు సినిమాగా చేయాల‌ని అనుకున్నాం. కానీ జీ5 వల్ల ఇది వెబ్ సిరీస్‌లా మారింది. అద్భుతంగా ఈ వెబ్ సిరీస్‌ను జీ5 నిర్మించింది. ఈ వెబ్‌సిరీస్‌తో దర్శకుడు ప్రదీప్‌కు మంచి పేరు వస్తుంది" అని చెప్పాడు

స‌ర్వం శ‌క్తిమ‌యం త‌ర్వాత‌...

దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ.. ‘సర్వం శక్తిమయం తరువాత ఏ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్న టైమ్‌లో రామ్ తాళ్లూరి . ఈ కథను ఆయన వినిపించారు. నాకు అద్భుతంగా నచ్చింది. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న కంటెంట్. . నరేష్ అగస్త్యను మత్తు వదలరా నుంచి ఫాలో అవుతున్నాను. అత‌డితో పని చేయాలని క‌ల ఈ సిరీస్‌తో నెర‌వేరింది. ధనుష్ తూటా చిత్రంలో మేఘా నటన నాకు చాలా ఇష్టం. ఈ వెబ్‌సిరీస్‌లో లక్ష్మీ పాత్రను మేఘా ఆకాష్ చక్కగా పోషించారు" అని పేర్కొన్నారు.

‘వికటకవి’లో నాలుగు ఎపిసోడ్స్ ఆల్రెడీ చూశాను. అద్భుతంగా ఉంది. సంగీతం, కెమెరా వర్క్, క్యాస్టూమ్ ఇలా అన్ని అద్భుతంగా సెట్ అయ్యాయి అని రైట‌ర్ బీవీఎస్ ర‌వి అన్నాడు.

తెలంగాణ షెర్లాక్ హోమ్‌

జీ5 కంటెంట్ హెడ్ సాయి తేజ్ మాట్లాడుతూ.. ‘రామ్ తాళ్లూరి ప్రోత్సాహం వల్లే నేను వికటకవి లాంటి కథలు రాయగలిగాను. ఈ కథను చెప్పేందుకు జీ5కి వెళ్లాను. కానీ వాళ్లు నన్ను కంటెంట్ హెడ్‌గా ఉండమని అన్నారు. ఈ కథ ఓకే అయ్యాక డైరెక్టర్ గురించి చర్చలు జరిగాయి. నేను ప్రదీప్ మద్దాలి పేరు చెప్పడంతోనే అంతా ఒప్పేసుకున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో నరేష్ అగస్త్య తెలంగాణ షెర్లాక్ హోమ్‌లా క‌నిపిస్తాడు. నరేష్, మేఘా ఆకాష్ జోడీ బాగుంటుంది’ అని అన్నారు.

విక‌ట‌క‌వి వెబ్‌సిరీస్‌కు అజ‌య్ అర‌సాడ మ్యూజిక్ అందించ‌గా...షోయ‌బ్ కెమెరామెన్‌గా ప‌నిచేశాడు. ప‌రువు త‌ర్వాత న‌రేష్ అగ‌స్త్య లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న తెలుగు వెబ్ సిరీస్ ఇది కావ‌డం గ‌మ‌నార్హం.

Whats_app_banner