Best budget smartphone : మోటో నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​- ఫీచర్స్​లో మాత్రం తగ్గేదేలే!-moto g 5g 2025 leaks reveal triple cameras larger battery and enhanced performance all details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Budget Smartphone : మోటో నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​- ఫీచర్స్​లో మాత్రం తగ్గేదేలే!

Best budget smartphone : మోటో నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​- ఫీచర్స్​లో మాత్రం తగ్గేదేలే!

Sharath Chitturi HT Telugu
Nov 25, 2024 01:40 PM IST

Best budget smartphone : మోటో నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్ లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ ఫీచర్​ లోడెడ్​ గ్యాడ్జెట్​ పేరు మోటో జీ 5జీ (2025). ఈ మోడల్​ ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మోటో నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్
మోటో నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్ (Motorola)

మోటరోలా తన తదుపరి బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్​ఫోన్​ని రెడీ చేస్తోంది. అధి.. మోటో జీ 5జీ (2025). ఈ స్మార్ట్​ఫోన్​ని సంస్థ అనేక ముఖ్యమైన అప్​గ్రేడ్స్​తో ఆవిష్కరించనుందని 91మొబైల్స్ తాజా నివేదిక తెలిపింది. కెమెరా, బ్యాటరీ పర్ఫార్మెన్స్​లో గణనీయమైన అప్​డేట్స్​ పరిచయం చేస్తూ ఈ పరికరం ప్రస్తుత డిజైన్​ని నిలుపుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

మోటో జీ 5జీ (2025): స్పెసిఫికేషన్లు- ఫీచర్లు..

లీక్స్​ ప్రకారం.. మోటో జీ 5జీ (2025) మునుపటి మాదిరిగానే ఫ్లాట్ డిస్​ప్లే, మందపాటి బాటమ్ బెజెల్స్​ని కలిగి ఉంటుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం హెడ్​ఫోన్​ జాక్ కూడా ఉన్నాయి. ఇవి రెండూ మునుపటి మోడళ్లకు భిన్నంగా ఉంటాయి. అయితే, రేర్ కెమెరా మాడ్యూల్​లో భారీ అప్​గ్రేడ్ ఉంటుంది. కొత్త రెక్టాంగ్యులర్​ మాడ్యూల్ మూడు సెన్సార్లను కలిగి ఉంటుంది. ఇది కెమెరా నాణ్యతలో మెరుగుదలను సూచిస్తుంది. మునుపటి తరం మాదిరిగానే ఈ ఫోన్ 6.6 ఇంచ్​ డిస్​ప్లేని కలిగి ఉంటుందని సమాచారం.

పనితీరు పరంగా, ప్రాసెసర్, ర్యామ్ గురించి నిర్దిష్ట వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, మోటో జీ 5జీ (2025).. 2024 వెర్షన్ కంటే మెరుగైన పనితీరును అందిస్తుందని భావిస్తున్నారు. ఇది ఎక్స్​టెండెడ్​ యూజ్​, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాల కోసం పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ మోడల్​లో చెప్పుకోదగ్గ మార్పు కెమెరా వ్యవస్థ! ఈ డివైస్ ట్రిపుల్ కెమెరా సెటప్​ని కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అల్ట్రా-వైడ్ లెన్స్​ని జోడించే దిశగా ఊహాగానాలు ఉన్నాయి. సెన్సార్ల ఖచ్చితమైన కాన్ఫిగరేషన్ ఇంకా బయటకు రాలేదు. మోటో జీ (2024) మోడల్​లో 6.6 ఇంచ్​ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాటర్ రెసిస్టెంట్ వీగన్ లెదర్ బ్యాక్ ఉన్నాయి.

మోటో జీ 5జీ (2025) స్నాప్​డ్రాగన్ 4 జెన్ 1 చిప్​సెట్​ను 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​తో అందించనుంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఇందులో ఉండనున్నాయి.

మోటో జీ 5జీ (2025)..

ఈ మోటో జీ 5జీ (2025) డివైజ్ మోటో జీ పవర్ 5జీ (2025) తో పాటు లాంచ్ అవుతుంది. అయితే ఇది భారతదేశంలో అందుబాటులో ఉంటుందా? లేదా? అనేది అస్పష్టంగా ఉంది. మోటోరోలా ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో మోటో జీ05, మోటో జీ15 అనే రెండు కొత్త ఎంట్రీ లెవల్ మోడళ్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం