JEE Main Correction Window 2025 : రేపు జేఈఈ మెయిన్ 2025 కరెక్షన్ విండో ఓపెన్.. ఇవి మార్చుకోవచ్చు
JEE Main Correction Window 2025 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ 2025 సెషన్ 1 కోసం కరెక్షన్ విండోను నవంబర్ 26, 2024న తెరవబోతోంది. జేఈఈ మెయిన్స్ 2025కు దరఖాస్తు చేసుకుని, తమ దరఖాస్తులో సవరణలు చేయాలనుకునే అభ్యర్థులు చేసుకోవచ్చు.
టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2025 కోసం నవంబర్ 22 2024న రిజిస్ట్రేషన్‌లను మూసివేస్తుంది. ఇటీవలి నోటిఫికేషన్‌లో రిజిస్ట్రేషన్ చివరి తేదీని పొడిగించమని స్పష్టం చేసింది. ఇప్పుడు ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. జేఈఈ 2025 సెషన్ 1 కోసం కరెక్షన్ విండోను నవంబర్ 26, 2024న తెరుస్తుంది.
జేఈఈ మెయిన్స్ 2025కు దరఖాస్తు చేసుకుని, తమ దరఖాస్తులో సవరణలు చేయాలనుకునే అభ్యర్థులు ఎడిట్ చేసుకోవచ్చు. jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా దిద్దుబాటు చేయవచ్చు. ఈ ఏడాది 12.5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫారంలో కొన్ని దిద్దుబాట్లు లేదా మార్పులు చేయాలనుకునే విద్యార్థుల కోసం నవంబర్ 26 నుంచి 27 వరకు కరెక్షన్ విండో ఓపెన్ ఉంటుంది.
ఎన్ఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్, ఐఐఐటీల్లో బీటెక్, ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్(సీఎఫ్టీఐ)ల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ పేపర్-1 నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎడిట్‌ను చాలా జాగ్రత్తగా చేయాలని అధికారులు సూచించారు. ఎందుకంటే సరిదిద్దడానికి మరొక అవకాశం ఇవ్వరు.
ఈ సమయంలో అభ్యర్థులు తమ మొబైల్ నంబర్, ఇమెయిల్, శాశ్వత / ప్రస్తుత చిరునామా, అత్యవసర సంప్రదింపు వివరాలు, ఫోటోను మార్చడానికి అనుమతించరు. అయితే ఈ కింది వివరాలలో దేనినైనా మార్చవచ్చు
తల్లి పేరు, తండ్రి పేరు, అభ్యర్థి పేరు మార్చేందుకు అవకాశం ఉంటుంది. పదో తరగతి, ఇంటర్ వివరాలు మార్చుకోవచ్చు. పాన్ నంబర్, పుట్టిన తేదీ, లింగం, వర్గం/ పీడబ్ల్యుడీ స్థితి, సంతకం ఎడిట్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా అభ్యర్థులు పేపర్, పరీక్ష మాధ్యమం, పరీక్షా కేంద్రాల ప్రాధాన్యతను కూడా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. జేఈఈ మెయిన్ సెషన్-1 2025 జనవరి 22 నుంచి జనవరి 31 వరకు జరగనుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది.