Visakhapatnam Glass Skywalk Bridge : విశాఖలో మరో టూరిజం అట్రాక్షన్, కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం-visakhapatnam glass skywalk bridge construction starts at kailasagiri titanic view point ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakhapatnam Glass Skywalk Bridge : విశాఖలో మరో టూరిజం అట్రాక్షన్, కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం

Visakhapatnam Glass Skywalk Bridge : విశాఖలో మరో టూరిజం అట్రాక్షన్, కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం

Bandaru Satyaprasad HT Telugu
Nov 25, 2024 07:40 PM IST

Visakhapatnam Glass Skywalk Bridge : విశాఖలో మరో టూరిస్ట్ అట్రాక్షన్ రాబోతుంది. కైలాసగిరి వద్ద టైటానిక్ వ్యూ పాయింట్ వద్ద కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. రూ.6 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది.

విశాఖలో మరో టూరిజం అట్రాక్షన్, కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం
విశాఖలో మరో టూరిజం అట్రాక్షన్, కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం

విశాఖపట్నం పర్యాటకంలో మరో అట్రాక్షన్ యాడ్ కానుంది. భారతదేశపు అతి పొడవైన గ్లాస్ స్కైవాక్ వంతెన విశాఖలో నిర్మిస్తున్నారు. కైలాసగిరి వద్ద టైటానిక్ వ్యూ పాయింట్ దగ్గర కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. రూ.6 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.

స్కైవాక్ వంతెనపై ఒకేసారి 40 మంది వ్యక్తులు నడిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్కైవాక్ వంతెన పై నుంచి కింద ఉన్న ప్రకృతి దృశ్యాలను చూసి పర్యాటకులు మంత్రముగ్దులు అవుతారు.

స్కైవాక్‌ వంతెనతో పాటు, రెండు థ్రిల్లింగ్ జిప్-లైన్‌లు, స్కై సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటుచేయనున్నారు. ఒక్కొక్కటి 150 మీటర్లు మేర ఈ ట్రాక్ ను ఏర్పాటు చేయనున్నారు. టూరిస్టులు ఈ సాహసాలను ఎంతగానో ఆస్వాదిస్తారు. స్కైవాక్, జిప్ లైన్, సైక్లింగ్ ట్రాక్ లు సుందరమైన కొండల మధ్య సాహసోపేతమైన అనుభవాన్ని కలిగిస్తాయి.

విశాఖపట్నంలో దేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెనను నిర్మిస్తున్నారు. 50 మీటర్ల మేర విస్తరించి ఉండే ఈ వంతెనపై నుంచి సముద్రం, కొండల అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. కైలాసగిరి వద్ద టైటానిక్ వ్యూపాయింట్‌కు దగ్గర ఏర్పాటు చేస్తున్న ఈ గ్లాస్ వంతెన సాహసికులకు, ప్రకృతి ప్రేమికులకు మరపురాని అనుభూతిని అందించనుంది. దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నవంబర్ 18న ప్రారంభించారు.

గ్లాస్ స్కైవాక్ వంతెన గురించి ఆసక్తికరమైన విషయాలు

గ్లాస్ స్కైవాక్ వంతెన విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన కైలాసగిరి వద్ద నిర్మిస్తున్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్‌గా నిర్మించబడింది. ఈ ప్రాజెక్ట్ ను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఆర్జే అడ్వెంచర్స్‌తో కలిసి, ఎస్ఎస్ఎమ్ షిప్పింగ్ లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ గ్లాస్ వంతెన ఒకేసారి 40 మంది వ్యక్తులు నడవవచ్చు. 

విశాఖ నుంచి ఐదు వైష్ణవ ఆలయాల దర్శన ప్యాకేజీ

విశాఖ‌ప‌ట్నం నుంచి రాష్ట్రంలోని ఐదు వైష్ణ‌వ ఆల‌యాల ద‌ర్శ‌నానికి ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్‌లను ఏర్పాటు చేసింది. ఈ స‌ర్వీస్‌ల‌ను యాత్రికులు వినియోగించుకోవాల‌ని ఏపీఎస్ ఆర్టీసీ రీజ‌న‌ల్ మేనేజ‌ర్ బి.అప్ప‌ల‌నాయుడు కోరారు. ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బ‌ట్టీ, ప్ర‌యాణీకులు, యాత్రీకులు అత్య‌ధికంగా వెళ్లే మార్గాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షిత‌మైన ప్ర‌యాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ఐదు వైష్ణ‌వ ఆల‌యాల ద‌ర్శ‌నానికి ఈ బస్సు స‌ర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది. 

మార్గ‌శిర మాసంలో పంచ వైష్ణ‌వ క్షేత్ర‌ద‌ర్శిన పేరుతో డిసెంబ‌ర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్ర‌త్యేక స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయా తేదీల్లో విశాఖ‌ప‌ట్నం ద్వారకా బ‌స్‌స్టేష‌న్ నుంచి రాత్రి 9 గంట‌ల‌కు బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి.

తొలుత ద్వార‌కా తిరుమ‌లలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శించుకుంటారు. అనంత‌రం అక్క‌డ నుంచి అంత‌ర్వేది చేరుకొని అక్క‌డ‌ శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ద‌ర్శించుకుంటారు. ఆ త‌రువాత అప్ప‌న‌ప‌ల్లి చేరుకుని, అక్క‌డ శ్రీబాల బాల‌జీ స్వామిని ద‌ర్శించుకుంటారు. అక్క‌డ నుంచి గొల్ల‌లమామిడాడ చేరుకుని కోదండ రామాల‌యాన్ని ద‌ర్శించుకుంటారు. త‌రువాత అన్న‌వ‌రం చేరుకుని అక్క‌డ‌ శ్రీ వీర వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ స్వామిని ద‌ర్శనం చేసుకుంటారు. అక్క‌డ నుంచి విశాఖ‌ప‌ట్నం చేరుకుంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం