New Smartphone: ఈ నయా పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఇండియాలోకి రానున్న తొలి మొబైల్ సిరీస్ ఇదే.. వివరాలు-indias first mediatek dimensity 9400 powered series is oppo find x8 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  New Smartphone: ఈ నయా పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఇండియాలోకి రానున్న తొలి మొబైల్ సిరీస్ ఇదే.. వివరాలు

New Smartphone: ఈ నయా పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఇండియాలోకి రానున్న తొలి మొబైల్ సిరీస్ ఇదే.. వివరాలు

Nov 19, 2024, 09:07 PM IST Chatakonda Krishna Prakash
Nov 19, 2024, 08:59 PM , IST

Oppo Find X8 Series: కొత్త పవర్‌ఫుల్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమన్సిటీ 9400తో ఇండియాలోకి రానున్న తొలి సిరీస్‍గా ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ఉండనుంది. ఈ మొబైల్ సిరీస్ వివరాలు ఇక్కడ చూడండి. 

ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫ్లాగ్‍షిప్ మొబైళ్లు నవంబర్ 21వ తేదీన లాంచ్ కానున్నాయి. ఇండియాతో పాటు గ్లోబల్‍గా అదే రోజున అడుగుపెట్టనున్నాయి. కొద్దిరోజులుగా ఈ సిరీస్ గురించిన డిజైన్, స్పెసిఫికేషన్లు, కొన్ని ఫీచర్లను ఒప్పో టీజ్ చేస్తూ ఉంది.  

(1 / 5)

ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫ్లాగ్‍షిప్ మొబైళ్లు నవంబర్ 21వ తేదీన లాంచ్ కానున్నాయి. ఇండియాతో పాటు గ్లోబల్‍గా అదే రోజున అడుగుపెట్టనున్నాయి. కొద్దిరోజులుగా ఈ సిరీస్ గురించిన డిజైన్, స్పెసిఫికేషన్లు, కొన్ని ఫీచర్లను ఒప్పో టీజ్ చేస్తూ ఉంది.  (Oppo)

మీడియాటెక్ డైమన్సిటీ 9400 ప్రాసెసర్‌ను ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ మొబైళ్లు కలిగి ఉండనున్నాయి. ఈ ప్రాసెసర్‌తో ఇండియా మార్కెట్‍లోకి వస్తున్న తొలి ఫోన్లు ఇవే కానున్నాయి. అడ్వాన్స్ ఏఐ ఫీచర్లను ఈ సిరీస్ మొబైళ్లు కలిగి ఉంటాయి. మీడియాటెక్ ఎక్స్‌ట్రా రేంజ్ 3.0 కూడా ప్రత్యేకంగా ఈ ఫ్లాగ్‍షిప్ సిరీస్‍లో ఉండనుంది.

(2 / 5)

మీడియాటెక్ డైమన్సిటీ 9400 ప్రాసెసర్‌ను ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ మొబైళ్లు కలిగి ఉండనున్నాయి. ఈ ప్రాసెసర్‌తో ఇండియా మార్కెట్‍లోకి వస్తున్న తొలి ఫోన్లు ఇవే కానున్నాయి. అడ్వాన్స్ ఏఐ ఫీచర్లను ఈ సిరీస్ మొబైళ్లు కలిగి ఉంటాయి. మీడియాటెక్ ఎక్స్‌ట్రా రేంజ్ 3.0 కూడా ప్రత్యేకంగా ఈ ఫ్లాగ్‍షిప్ సిరీస్‍లో ఉండనుంది.(Oppo )

ఒప్పో ఫైండ్ ఎక్స్8  సిరీస్ కెమెరా సెంట్రిక్‍గా కూడా ఉండనుంది. ఈ సిరీస్‍లో ప్రో మోడల్‍ వెనుక మూడు ఫ్లాగ్‍షిప్ సెన్సార్లతో కూడిన కెమెరాలు ఉండనున్నాయి. 50 మెగాపిక్సెల్ సోనీ ఎస్‍వైటీ-808 ప్రధాన కెమెరా, సోనీ ఐఎంఎక్స్858 పెరీస్కోప్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలు ప్రో వేరియంట్ వెనుక ఉండనున్నాయి. బేస్ మోడల్ ఫైండ్ ఎక్స్8 వెనుక 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‍టీవై 700 ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 50 మెగాపిక్సెల్ ఎల్‍వైటీ-600 పెరీస్కోప్ టెలిఫొటో లెన్స్ కెమెరాలు ఉంటాయి. 

(3 / 5)

ఒప్పో ఫైండ్ ఎక్స్8  సిరీస్ కెమెరా సెంట్రిక్‍గా కూడా ఉండనుంది. ఈ సిరీస్‍లో ప్రో మోడల్‍ వెనుక మూడు ఫ్లాగ్‍షిప్ సెన్సార్లతో కూడిన కెమెరాలు ఉండనున్నాయి. 50 మెగాపిక్సెల్ సోనీ ఎస్‍వైటీ-808 ప్రధాన కెమెరా, సోనీ ఐఎంఎక్స్858 పెరీస్కోప్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలు ప్రో వేరియంట్ వెనుక ఉండనున్నాయి. బేస్ మోడల్ ఫైండ్ ఎక్స్8 వెనుక 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‍టీవై 700 ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 50 మెగాపిక్సెల్ ఎల్‍వైటీ-600 పెరీస్కోప్ టెలిఫొటో లెన్స్ కెమెరాలు ఉంటాయి. (Oppo)

ఒప్పో ఫైండ్స్ ఎక్స్ 8 ప్రో మోడల్ 6.78 ఇంచుల ఎల్‍టీపీవో అమోలెడ్  డిస్‍ప్లేతో రానుంది. క్వాడ్ కర్వ్డ్ గ్లాస్, కార్నింగ్ గొరిల్లా 7ఐ ప్రొటెక్షన్ డిస్‍ప్లేకు ఉంటుంది. 6.59 ఇంచుల 1.5కే ఫ్లాట్ డిస్‍ప్లేతో ఎక్స్8 మోడల్ వస్తోంది.

(4 / 5)

ఒప్పో ఫైండ్స్ ఎక్స్ 8 ప్రో మోడల్ 6.78 ఇంచుల ఎల్‍టీపీవో అమోలెడ్  డిస్‍ప్లేతో రానుంది. క్వాడ్ కర్వ్డ్ గ్లాస్, కార్నింగ్ గొరిల్లా 7ఐ ప్రొటెక్షన్ డిస్‍ప్లేకు ఉంటుంది. 6.59 ఇంచుల 1.5కే ఫ్లాట్ డిస్‍ప్లేతో ఎక్స్8 మోడల్ వస్తోంది.(Oppo)

5,190 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో రానుండగా.. 5,630ఎంఏహెచ్ బ్యాటరీని ఒప్పో ఫైండ్ ఎక్స్8 కలిగి ఉంటుంది. ఈ మొబైళ్లు 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వైర్లెస్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ కలర్ ఓఎస్ 15తో ఈ ఫోన్లు రానున్నాయి. లాంచ్ సమయంలో ఒప్పో ఫైండ్స్ ఎక్స్8 సిరీస్ ధరలు అధికారింగా వెల్లడికానున్నాయి. 

(5 / 5)

5,190 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో రానుండగా.. 5,630ఎంఏహెచ్ బ్యాటరీని ఒప్పో ఫైండ్ ఎక్స్8 కలిగి ఉంటుంది. ఈ మొబైళ్లు 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వైర్లెస్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ కలర్ ఓఎస్ 15తో ఈ ఫోన్లు రానున్నాయి. లాంచ్ సమయంలో ఒప్పో ఫైండ్స్ ఎక్స్8 సిరీస్ ధరలు అధికారింగా వెల్లడికానున్నాయి. (oppo)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు