SSC CGL results 2024 : ఎస్ఎస్సీ సీజీఎల్ ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోండి..
ఎస్ఎస్సీ సీజీఎల్ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాలు వెలువడినప్పుడు ఎక్కడ్ చెక్ చేసుకోవాలి? రిజల్ట్స్‌ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1 ఫలితాల కోసం అభ్యర్థుల నిరీక్షణ కొనసాగుతోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వీటిని ఇంకా విడుదల చేయలేదు. అయితే, ఫలితాలు వెలువడిన అనంతరం పరీక్షకు హాజరైన అభ్యర్థులు ssc.gov.in ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి మెరిట్ జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ రోల్ నంబర్లను ఉపయోగించి ఫలితాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1 ఫలితాలు 2024: ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
ఫలితాలను తనిఖీ చేయడానికి అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని అనుసరించవచ్చు:
- ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి
- రిజల్ట్ ట్యాబ్‌ని ఓపెన్ చేయండి.
- ఫలితాలు వెలువడినప్పుడు సీజీఎల్ టైర్ 1 రిజల్ట్స్ లింక్ లైవ్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి.
- పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.
- రోల్ నెంబరు ఉపయోగించి మీ ఫలితాన్ని తనిఖీ చేయండి.
టైర్-2 పరీక్షకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల రోల్ నంబర్లను పేర్కొంటూ కమిషన్ పీడీఎఫ్‌లో ఫలితాలను వెల్లడిస్తుంది.
దేశవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ 9 నుంచి 26 వరకు ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1 పరీక్ష జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రిహెన్షన్పై మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి.
అదనంగా, ప్రతి విభాగంలో 25 ప్రశ్నలు, గరిష్ట మార్కులు 50గా నిర్ణయించారు. ఇంగ్లిష్ కాంప్రిహెన్షన్ విభాగాన్ని మినహాయించి ఇంగ్లిష్, హిందీలో మొత్తం ప్రశ్నలు సెట్ చేశారు.
ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-1 ప్రొవిజనల్ ఆన్సర్ కీని అక్టోబర్ 4న విడుదల చేయగా, అభ్యర్థులు అభ్యంతరాలను తెలిపే విండో అక్టోబర్ 8 వరకు ఓపెన్ అయ్యి ఉంది.
ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1 ఉత్తీర్ణత మార్కులు:
జనరల్/అన్రిజర్వ్డ్: 30 శాతం
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్: 20 శాతం
ఇతరులు: 20 శాతం.
ఇదిలా ఉండగా, ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 2 పరీక్ష తేదీలను కమిషన్ ఇప్పటికే విడుదల చేసింది. 2025 జనవరి 18, 19, 20 తేదీల్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది.
ఈ పరీక్ష ద్వారా 17,727 కేంద్ర ప్రభుత్వ గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది.
సంబంధిత కథనం