SSC CPO Result 2024: ఎస్ఎస్సీ సీపీఓ పేపర్-1 ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ను ఇలా చెక్ చేసుకోండి..-ssc cpo result 2024 for paper i out heres how to check ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssc Cpo Result 2024: ఎస్ఎస్సీ సీపీఓ పేపర్-1 ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ను ఇలా చెక్ చేసుకోండి..

SSC CPO Result 2024: ఎస్ఎస్సీ సీపీఓ పేపర్-1 ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ను ఇలా చెక్ చేసుకోండి..

Sudarshan V HT Telugu
Sep 03, 2024 07:22 PM IST

సీపీఓ 2024 పేపర్ 1 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.gov.in లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.ఎస్ఎస్సీ సీపీవో పేపర్-1 పరీక్షను 2024 జూన్ 27 నుంచి 29 వరకు దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు.

ఎస్ఎస్సీ సీపీఓ పేపర్-1 ఫలితాలు విడుదల
ఎస్ఎస్సీ సీపీఓ పేపర్-1 ఫలితాలు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ సీపీఓ 2024 పేపర్ 1 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ 2024 పరీక్ష రాసిన అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.gov.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

ఎస్ఎస్సీ సీపీఓ ఫలితాలు 2024: ఎలా చెక్ చేయాలి

  • ఎస్ఎస్సీ సీపీఓ 2024 పేపర్ 1 రాసిన అభ్యర్థులు ముందుగా ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.gov.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో ఎస్ఎస్సీ సీపీఓ రిజల్ట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
  • ఎస్ఐ మరియు సీఏపీఎఫ్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చ చేయండి.
  • అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకునేందుకు పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
  • పేజీని డౌన్ లోడ్ చేసుకోండి. భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు దాని హార్డ్ కాపీని ముద్రించండి.

జూన్ 27 నుండి జూన్ 29 వరకు

ఎస్ఎస్సీ సీపీఓ (SSC CPO) పేపర్ 1 పరీక్షను 2024 జూన్ 27 నుండి జూన్ 29 వరకు దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. త్వరలో సీఏపీఎఫ్ నిర్వహించే పీఈటీ/పీఎస్టీకి అర్హులైన అభ్యర్థులను పిలుస్తారు. పీఈటీ/పీఎస్టీ షెడ్యూలును ఎస్ఎస్సీ ప్రాంతీయ కార్యాలయాలు తగిన సమయంలో తెలియజేస్తాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్లో వివరాలు చూసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థుల మార్కులు, ఫైనల్ ఆన్సర్ కీని కమిషన్ త్వరలో అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది. పీఈటీ/ పీఎస్టీ అడ్మిషన్ సర్టిఫికేట్ల జారీపై అప్డేట్స్ కోసం అభ్యర్థులు కమిషన్ ప్రాంతీయ కార్యాలయాల వెబ్సైట్లను సందర్శించాలని సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్ఎస్సీ (ssc) అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.