Fahadh Faasil: ఫహాద్ ఫాజిల్ తండ్రి డైరెక్షన్‌లో వచ్చిన ఒకే ఒక తెలుగు సినిమా ఇదే -థియేటర్లలో వంద రోజులకుపైనే ఆడింది
Fahadh Faasil: హీరో ఫహాద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ మలయాళం, తమిళ భాషల్లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు. 1980, 90 దశకంలో పలు సూపర్ హిట్ సినిమాలు చేశాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఫాజిల్ తెలుగులోనూ నాగార్జునతో కిల్లర్ మూవీ చేశాడు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
Fahadh Faasil: హీరోగా ఫహాద్ ఫాజిల్ పాన్ ఇండియన్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. మలయాళంలో వైవిధ్యత మేళవించిన కథాంశాల్ని ఎంచుకుంటూ కథానాయకుడిగా వరుస విజయాల్ని అందుకుంటున్నాడు. మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో మూస ధోరణికి భిన్నంగా సాగే డిఫరెంట్ రోల్స్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్నాడు.
పుష్ప 2లో విలన్...
తెలుగులో పుష్ప2లో విలన్‌గా కనిపించబోతున్నాడు ఫహాద్ ఫాజిల్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ యాక్షన్ మూవీలో భైరవ్‌సింగ్ షెకావత్ అనే పోలీస్ పాత్రలో నటించాడు. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయతో రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాల్ని అంగీకరించాడు ఫహాద్ పాజిల్. తమిళంలో వేట్టయాన్, విక్రమ్ సినిమాలతో అదరగొట్టాడు. మూడు భాషల్లో బిజీగా కొనసాగుతోన్నాడు.
అగ్ర దర్శకుడిగా...
ఫహాద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ మలయాళంలో 1980, 90 దశకంలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా చెలామణి అయ్యాడు. తమిళం, మలయాళం భాషల్లో పలు బ్లాక్‌బస్టర్ మూవీస్‌కు దర్శకత్వం వహించాడు. రజనీకాంత్ చంద్రముఖికి మాతృక అయిన మలయాళం మూవీ మణిచిత్రతాజుకు ఫాజిల్ దర్శకుడు కావడం గమనార్హం. మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేష్‌గోపి, తమిళంలో దళపతి విజయ్, కార్తీక్, ప్రభు వంటి హీరోలకు ఎన్నో హిట్లు ఇచ్చాడు ఫాజిల్. ముప్పై ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో దర్శకుడిగా 30, నిర్మాతగా పదికిపైగా సినిమాలు చేశాడు ఫాజిల్.
నాగార్జున కిల్లర్...
దర్శకుడిగా తన కెరీర్‌లో ఫాజిల్ ఓ తెలుగు సినిమా కూడా చేశాడు. అదే నాగార్జున హీరోగా నటించిన కిల్లర్ మూవీ. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో 1992లో రిలీజైన ఈ మూవీ కమర్షియల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఇళయరాజా అందించిన పాటలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి.
తొలుత కిల్లర్ మూవీని మలయాళంలోనే మోహన్‌లాల్‌తో చేయాలని ఫాజిల్ అనుకున్నాడట. ఈ మూవీలో హీరో క్యారెక్టర్‌లో నెగెటివ్ షేడ్స్ ఉండటంతో అప్పుడప్పుడే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువ అవుతోన్న మోహన్‌లాల్ కిల్లర్ మూవీని చేయడానికి వెనకడుగు వేశాడు. దాంతో కిల్లర్ మూవీని నాగార్జునతో తెరకెక్కించాడు ఫాజిల్.
జగపతిబాబు తండ్రి...
ఈ సినిమాను టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ ప్రొడ్యూస్ చేశాడు. కిల్లర్ మూవీలో నగ్మా హీరోయిన్‌గా నటించగా... శారత, బేబీ షామిలి కీలక పాత్రల్లో నటించారు. కిల్లర్ తర్వాత తెలుగులో ఫాజిల్‌కు డైరెక్టర్‌గా అవకాశాలు వచ్చినా తమిళం, మలయాళ భాషల్లో బిజీగా ఉండటంతో సినిమాలు చేయలేకపోయారు.