SSC MTS Recruitment 2024: 8 వేల పోస్ట్ ల ఎస్ఎస్సీ జాబ్స్ కు అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్; టెంత్ పాసైతే చాలు
ఎస్ఎస్సీ ఎంటీఎస్ రిక్రూట్మెంట్ 2024 రిజిస్ట్రేషన్ 2024 జూలై 31తో ముగియనుంది. ఇప్పటివరకు అప్లై చేసుకోని ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు రేపు రాత్రిలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఎస్సీ సుమారు 8 వేల పోస్ట్ లను భర్తీ చేస్తోంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC MTS) రిక్రూట్మెంట్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 జూలై 31 న ముగుస్తుంది. మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ అండ్ హవల్దార్ (సిబిఐసి & సిబిఎన్) ఎగ్జామినేషన్, 2024 కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్ ssc.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాల్సిన లింక్ రేపు రాత్రి 11 గంటలకు డీయాక్టివేట్ అవుతుంది.
పరీక్ష అక్టోబర్ లో..
దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన పేమెంట్ విండో ఆగస్టు 1, 2024తో ముగుస్తుంది. కరెక్షన్ విండో ఆగస్టు 16న ప్రారంభమై ఆగస్టు 17, 2024న ముగుస్తుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్షను 2024 అక్టోబర్- నవంబర్లో నిర్వహిస్తారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 4887 ఎంటీఎస్, 3439 సీబీఐసీ, సీబీఎన్ లో హవల్దార్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కటాఫ్ తేదీలోగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ పరీక్ష లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఇలా అప్లై చేసుకోండి..
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
- ముందుగా ఎస్ఎస్సీ (staff selection commission) అధికారిక వెబ్సైట్ ssc.gov.in ను ఓపెన్ చేయండి.
- వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న Direct link to apply for SSC MTS Recruitment 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోవాలి.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, రిజర్వేషన్ కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. భీమ్ యుపిఐ, నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్లైన్ చెల్లింపు విధానాల ద్వారా లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే డెబిట్ కార్డును ఉపయోగించడం ద్వారా ఆన్ లైన్ లో ఫీజు చెల్లించవచ్చు.
ఎంపిక విధానం..
ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (CBE), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) ఉంటాయి. పీఈటీ, పీఎస్టీలు కేవలం హవల్దార్ పోస్టుకు మాత్రమే. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.