SSC Steno Exam : 12వ తరగతి పాసైతే చాలు.. ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు!-ssc steno grade c and d exam 2024 registration begins check direct link ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssc Steno Exam : 12వ తరగతి పాసైతే చాలు.. ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు!

SSC Steno Exam : 12వ తరగతి పాసైతే చాలు.. ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు!

Sharath Chitturi HT Telugu
Jul 27, 2024 10:29 AM IST

ఎస్ఎస్సీ స్టెనో గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2006 ఖాళీల కోసం ssc.gov.in. దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూడండి..

ఎస్ఎస్సీ స్టెనో గ్రేడ్ సీ అండ్ డీ పరీక్ష రిజిస్ట్రేషన్​ షురూ..
ఎస్ఎస్సీ స్టెనో గ్రేడ్ సీ అండ్ డీ పరీక్ష రిజిస్ట్రేషన్​ షురూ..

స్టెనో గ్రేడ్ సీ, డీ పరీక్ష 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రారంభించింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సీ’, 'డీ' ఎగ్జామినేషన్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ssc.gov.in ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ లింక్​ని పొందవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 17 ఆగష్టు 2024 అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో సుమారు 2006 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: జూలై 26
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 17
  • ఆన్​లైన్​ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఆగస్టు 18
  • కరెక్షన్ విండో తేదీలు: ఆగస్టు 27 నుంచి ఆగస్టు 28, 2024
  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: అక్టోబర్-నవంబర్ 2024

స్టెనో గ్రేడ్ సీ, డీ పరీక్ష 2024 రిజిస్ట్రేషన్​ కోసం డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అర్హతా- వయస్సు పరిమితి..

  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సీ': 2024 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'డీ': ఆగస్టు 1, 2024 నాటికి 18 నుంచి 27 ఏళ్లు

విద్యార్హత..

కటాఫ్ తేదీ నాటికి అంటే 17.08.2024 నాటికి గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం..

ఎంపిక విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సీబీటీలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. మొత్తం పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్​లో మాత్రమే ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ రెండింటిలోనూ ఉంటాయి.

దరఖాస్తు ఫీజు..

రిజర్వేషన్​కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ (ఈఎస్ ఎం)లకు చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఇతరలకు రూ. 100.

భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే డెబిట్ కార్డులను ఉపయోగించి మాత్రమే ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్​ని చూడవచ్చు.

ఎస్‌ఎస్సీ సీజీఎల్ 2024 దరఖాస్తుకు నేడే చివరి రోజు..

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్ 2024) దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. పరీక్షకు ఇంకా దరఖాస్తు చేసుకోని వారు శనివారం (రాత్రి 11 గంటల్లోపు) ssc.gov.inలోగా తమ ఫారాలను సమర్పించవచ్చు.

ఎస్ఎస్సీ సీజీఎల్ 2024కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 24గా ఉండేది. అయితే తదితర కారణాలతో దరఖాస్తు చేసుకోలేని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జూలై 25 నుంచి జూలై 28 వరకు పొడిగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం