Best family car : మిడల్​ క్లాస్​కి ఎంతో ఇష్టమైన ఈ సెడాన్​ కారు.. ఇప్పుడు కొత్తగా!-best sedan car skoda slavia facelift to launch in h2 2025 see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Family Car : మిడల్​ క్లాస్​కి ఎంతో ఇష్టమైన ఈ సెడాన్​ కారు.. ఇప్పుడు కొత్తగా!

Best family car : మిడల్​ క్లాస్​కి ఎంతో ఇష్టమైన ఈ సెడాన్​ కారు.. ఇప్పుడు కొత్తగా!

Sharath Chitturi HT Telugu
Nov 25, 2024 10:20 AM IST

Best family car in India : సెడాన్​ లవర్స్​కి అదిరిపోయే వార్త! ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్​గా ఉన్న స్కోడా స్లావియాకి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోంది. లాంచ్​ టైమ్​లైన్​, కొత్త ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

కొత్తగా స్కోడా స్లావియా.. లాంచ్​ ఎప్పుడంటే!
కొత్తగా స్కోడా స్లావియా.. లాంచ్​ ఎప్పుడంటే!

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ సెడాన్​గా పేరు తెచ్చుకున్న స్కోడా స్లావియా.. వచ్చే ఏడాది ఫేస్​లిఫ్ట్ వర్షెన్​ని పొందబోతోంది! స్కోడా స్లావియా ఫేస్​లిఫ్ట్ 2025 ద్వితీయార్ధంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది అనేక విజువల్, ఫీచర్ అప్​డేట్స్​తో వస్తుంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్కోడా కొత్త ఆటోమేటిక్ గేర్ బాక్స్​పై పనిచేస్తోంది. ఇది అప్​డేటెడ్ స్లావియాతో అందుబాటులోకి వస్తుందని సమాచారం. అయితే త్వరలోనే కుషాక్​ ఎస్​యూవీకి కూడా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోంది. దాని తర్వాతే, స్కోటా స్లావియా కొత్త వర్షెన్​ లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.

స్కోడా స్లావియా ఫేస్​లిఫ్ట్: కీలక మార్పులు (అంచనా)

డిజైన్ పరంగా, రాబోయే స్కోడా స్లావియా ఫేస్​లిఫ్ట్ కొత్త సూపర్బ్, ఆక్టేవియా మాదిరిగానే డిజైన్ ఫిలాసఫీని అవలంబించనుంది. ఇవి ప్రస్తుతం కార్ల తయారీదారుకు అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్​లుగా ఉన్నాయి. కొత్త స్లావియా ప్రస్తుత దాని కంటే షార్ప్​ అండ్​ సొగసైన లుక్స్​తో రావొచ్చు!

ఫీచర్స్​ విషయానికి వస్తే, స్కోడా స్లావియా ఫేస్​లిఫ్ట్ 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, మెరుగైన కనెక్టెడ్ కార్ టెక్నాలజీలను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అలాగే, ఇది కొత్త ఇంటీరియర్ ట్రిమ్​లు, కలర్ స్కీమ్​లను పొందవచ్చు. రాబోయే ఫేస్​లిఫ్ట్​లో ఒక ప్రధాన అప్​డేట్ కొత్త ఆటోమేటిక్ గేర్ బాక్స్! దీనిపై చెక్ కార్ల తయారీ సంస్థ గత కొంతకాలంగా పనిచేస్తోంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఇది వినియోగదారులకు స్మూత్​ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ సెడాన్ 1.0-లీటర్ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్ మోటార్​తో కొనసాగుతుంది. కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ మినహా, సెడాన్ మిగిలిన గేర్​బాక్స్​ ఆప్షన్స్​ యథాతథంగా కొనసాగుతాయి.

స్కోడా స్లావియా ప్రస్తుతం భారత మార్కెట్​లో ఉన్న ఆటోమొబైల్ సంస్థ నుంచి రెండొవ అత్యంత విజయవంతమైన కారు! ఈ మిడ్-సైజ్ సెడాన్ మార్చి 2022లో భారతదేశంలో అడుగుపెట్టింది. ఇది బ్రాండ్​కి చెందిన ఇండియా 2.0 ప్రోగ్రామ్​లో కీలక భాగం! స్కోడా స్లావియా రెండు ఇంజిన్లు, రెండు ట్రాన్స్​మిషన్ ఆప్షన్స్​లో లభిస్తుంది.

ఇది హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్​లతో పాటు ఫోక్స్​వ్యాగన్ వర్టూస్​తో పోటీపడుతుంది. స్కోడా స్లావియా బహుళ స్టైలింగ్ ప్యాక్​లతో లభిస్తుంది. వీటిలో మోంటే కార్లో ఎడిషన్ ఉంది. దీనిని ఓఈఎం ప్రపంచవ్యాప్తంగా కొన్ని మార్కెట్లలో అందిస్తోంది. కొత్తగా వచ్చే సెడాన్​లోనూ ఈ స్టైలింగ్​ ప్యాక్​ ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం