New SUV : టాటా నెక్సాన్‌కి పోటీగా స్కోడా కొత్త ఎస్యూవీ- బుకింగ్స్‌కి ముందే భారీ డిస్కౌంట్స్..
స్కోడా కైలాక్ కొనాలని చూస్తున్న కస్టమర్స్‌కి బంపర్ ఆఫర్! బుకింగ్స్‌కి ముందే ఈ ఎస్‌యూవీకి సంబంధించి.. సంస్థ భారీ డిస్కౌంట్స్‌ని ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత పెంచేందుకు రెడీ అవుతోంది స్కోడా సంస్థ. తన సరికొత్త ఎస్యూవీ స్కోడా కైలాక్‌ని ఇప్పటికే లాంచ్ చేయగా, డిసెంబర్ 2న బుకింగ్స్‌ని ఓపెన్ చేస్తుంది. ఆ సమయానికి కొత్త ఎస్యూవీ పూర్తి ధరను సంస్థ ప్రకటిస్తుంది. ఇక ఇప్పుడు బుకింగ్స్‌కి ముందే కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసే పనిలో పడింది స్కోడా! మారుతీ సుజుకీ బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి సబ్-కాంపాక్ట్ సెగ్మెంట్ లీడర్లకు పోటీగా వస్తున్న ఈ ఎస్‌యూవీపై అనేక ప్రయోజనాలు, డిస్కౌంట్లతో కూడిన ప్రత్యేక కైలాక్ క్లబ్‌ను ప్రకటించింది. ఇది బుకింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సభ్యత్వ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
స్కోడా కైలాక్..
సబ్- కాంపాక్ట్ ఎస్‌యూవీలోకి స్కోడాకి తొలి ప్రాడక్ట్ ఈ కైలాక్. కైలాక్ ఈ నెల 6 న భారతదేశంలో రూ .7.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదలైంది. పాపులర్ కుషాక్ ఎస్యూవీ ఆధారంగా రూపొందించినది ఈ స్కోడా కైలాక్.
ప్రారంభ రోజుల్లో అత్యధికంగా లాభపడటానికి, స్కోడా తన వినియోగదారుల కోసం ఉద్దేశించిన కైలాక్ క్లబ్‌ను ప్రారంభించింది. క్లబ్లో చేరాలని భావించిన వారు కైలాక్ ఎస్‌యూవీని కొనుగోలు చేస్తే అనేక ప్రయోజనాలను పొందుతారు. 25 శాతం తక్కువ బుకింగ్ మొత్తం, ఇతరుల కంటే రెండు గంటల ముందు ప్రాధాన్య బుకింగ్ విండో పొందడం, రూ .10,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన యాక్సెసరీలను కొనుగోలు చేస్తే రూ .2,000 వరకు ప్రత్యేక డిస్కౌంట్ వంటివి ఈ క్లబ్ ద్వారా లభిస్తుంది.
స్కోడా కైలాక్: వేరియంట్లు, కలర్స్..
స్కోడా కైలాక్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ ఉన్నాయి. క్లాసిక్ వేరియంట్ ధరను వెల్లడించగా.. ఇతర వేరియంట్ల ధరను త్వరలోనే ప్రకటించనున్నారు. ఆలివ్ గోల్డ్, టోర్నడో రెడ్, కార్బన్ స్టీల్, బ్రిలియంట్ సిల్వర్, క్యాండీ వైట్ వంటి ఐదు ఎక్స్టీరియర్ రంగుల్లో ఈ ఎస్యూవీ లభిస్తుంది.
స్కోడా కైలాక్: ఫీచర్లు..
స్కోడా కైలాక్ ఎస్‌యూవీని అనేక ఫీచర్లతో ప్యాక్ చేసింది. ఇది ఈ సెగ్మెంట్లో అత్యంత ప్రీమియం ఆఫర్లలో ఒకటిగా నిలిచింది. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో వైర్లెస్ కనెక్టివిటీతో కూడిన 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, 8 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేషన్‌తో కూడిన సిక్స్ వే అడ్జెస్టెబుల్ ఎలక్ట్రిక్ ఫ్రెంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ వార్నింగ్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అన్ని వేరియంట్లలో 25 యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లను సంస్థ అందిస్తుంది. వీటిలో ఆరు ఎయిర్ బ్యాగులు, మల్టీ-కొలిషన్ బ్రేక్, రోల్ఓవర్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ఈబీడీతో యాంటీ-లాక్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి.
స్కోడా కైలాక్ ఇంజిన్, ట్రాన్స్మిషన్..
స్కోడా కైలాక్ 1.0-లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 113బీహెచ్పీ పవర్, 178ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
సంబంధిత కథనం