RCB IPL 2025 Players list: ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్పిదం.. టాప్ ప్లేయర్లని వదిలేసి లాస్ట్‌లో వెంపర్లాట-royal challengers bengaluru updated squad after day 1 ipl 2025 auction ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Ipl 2025 Players List: ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్పిదం.. టాప్ ప్లేయర్లని వదిలేసి లాస్ట్‌లో వెంపర్లాట

RCB IPL 2025 Players list: ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్పిదం.. టాప్ ప్లేయర్లని వదిలేసి లాస్ట్‌లో వెంపర్లాట

Galeti Rajendra HT Telugu
Nov 25, 2024 10:00 AM IST

IPL 2025 Auction RCB: ఐపీఎల్ 2025 మెగా వేలంలో టాప్ ప్లేయర్లను కొనుగోలు చేసే డబ్బు, అవకాశం ఉన్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లైట్ తీసుకుంది. ఆఖరికి నిలకడలేని ప్లేయర్ల‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ తప్పిదాలు
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ తప్పిదాలు (PTI)

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభంలోనే వరుస తప్పిదాలు చేసి.. ఆఖర్లో ప్లేయర్ల కోసం వెంపర్లాడింది. ఆదివారం వేలంలో ఆ జట్టు రూ.12.5 కోట్లతో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్‌ని కొనుగోలు చేయడం ఒక్కటే కాస్త ఫర్వాలేదనిపిస్తోంది. ఇంగ్లాండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ను రూ.11.5 కోట్లకు, లియామ్ లివింగ్‌స్టోన్‌ను రూ.8.75 కోట్లకు దక్కించుకుంది.

ఆశ్చర్యకరంగా వికెట్ కీపర్ జితేష్ శర్మ కోసం ఆర్సీబీ రూ.11 కోట్లు వెచ్చించింది. అలాగే రసిక్ దార్ (రూ.6 కోట్లు), సుయాష్ శర్మ (రూ.2.6 కోట్లు)లను ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ.. ఈ ప్లేయర్లలో ఎవరికీ నిలకడగా రాణించే రికార్డ్ లేదని ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.

వాస్తవానికి వేలంలో మొదటి రెండు సెట్లలో టాప్ ప్లేయర్లు వేలానికి రాగా.. ఆర్సీబీ సీరియస్‌గా ప్రయత్నించలేదు. జట్టుని నిర్మించుకునే సమయంలో సమతూకం పాటిస్తూ.. ఆటగాళ్లను ఎంచుకోవాలనే ఆలోచన ఆర్సీబీ ఫ్రాంఛైజీకి లేకపోయిందా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

నిలకడ, కచ్చితత్వంతో బంతులేసే ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేలానికి వచ్చినా ఆర్సీబీ పట్టించుకోలేదు. కేఎల్ రాహుల్ తక్కువ ధరకే వస్తున్నా.. లైట్ తీసుకుంది. కెప్టెన్సీ అనుభవం ఉన్న శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ కోసం బిడ్ వేసేందుకు కూడా వెనుకంజ వేసింది. ఆర్సీబీ వద్ద ఉన్న డబ్బుతో ఈ ముగ్గురు ప్లేయర్లలో ఒకరికి రూ.20 కోట్ల వరకూ ఖర్చు చేసుకునే వెసులబాటు ఉంటుంది. అయినా.. పట్టించుకోలేదు. చివరికి టాప్ ప్లేయర్లు అందరూ అమ్ముడుపోగా.. నిలకడలేని పవర్ హిట్టర్లు, ధారాళంగా పరుగులిచ్చే బౌలర్లు, అనుభవం లేని వికెట్ కీపర్ కోసం కోట్లని ఆర్సీబీ తగలేసింది. .

ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ కొనుగోళ్లు

  • సాల్ట్ (రూ.11.50 కోట్లు)
  • జితేష్ శర్మ (రూ.11 కోట్లు)
  • లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.8.75కోట్లు)
  • జోష్ హేజిల్వుడ్ (రూ.8.75 కోట్లు)
  • రసిక్ దార్ (రూ.6 కోట్లు)
  • సుయాష్ శర్మ (రూ.2.6 కోట్లు)

ఆర్సీబీ ఇప్పటికే రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు

విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)

రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు)

యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.52.35 కోట్లు ఖర్చు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ.. ఆటగాళ్ల రిటెన్షన్ కోసం రూ.37.00 కోట్లు ఖర్చు చేసేసింది. దాంతో.. ప్రస్తుతం ఆ ఫ్రాంఛైజీ వద్ద రూ.30.65 కోట్లు ఉన్నాయి. అయితే.. ఇంకా 16 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది.

Whats_app_banner