IPL Auction 2025 Highlights: రిషబ్ పంత్ అటు.. కేఎల్ రాహుల్ ఇటు.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు వింత నిర్ణయం
Rishabh Pant vs KL Rahul IPL 2025 Auction: లక్నో సూపర్ జెయింట్స్‌పై కోపంతో వేలానికి కేఎల్ రాహుల్ వచ్చాడు.. ఢిల్లీ క్యాపిటల్స్ వద్దనుకుని రిషబ్ పంత్ వేలానికి వచ్చాడు. ఇద్దరు ప్లేయర్లు వేలానికి వచ్చినప్పుడు మాజీ ఫ్రాంఛైజీలు ఫన్నీ గేమ్ ఆడాయి.
Rishabh Pant IPL Price: ఐపీఎల్ 2025 మెగా వేలం చిత్రమైన కొనుగోళ్లకి వేదికగా మారుతోంది. భారీ అంచనాల మధ్య వేలానికి వచ్చిన భారత స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యుజ్వేందర్ చాహల్‌లో.. ఒక్క కేఎల్ రాహుల్ మినహా మిగిలిన వాళ్లందరికీ మంచి ధర లభించింది. మరీ ముఖ్యంగా.. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వేలం సమయంలో వారి పాత ఫ్రాంఛైజీలు చిత్రంగా స్పందించి అందర్నీ ఆశ్చర్యపరిచాయి.
రిషబ్ పంత్ కోసం ఆర్టీఎం వాడిన ఢిల్లీ
రిషబ్ పంత్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి రాగా.. అతని కోసం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టిగా పోటీపడ్డాయి. దాంతో అతని ధర ఆకాశాన్నంటగా.. రూ.20.75 కోట్ల వద్ద అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డుని వాడింది.
రూ. 27 కోట్లు చెప్పిన లక్నో
వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీతో విభేదాల కారణంగానే రిషబ్ పంత్ వేలానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అలాంటిది మళ్లీ అతనే కావాలని ఢిల్లీ ఆర్టీఎం కార్డు వాడింది. ఒకవేళ ఢిల్లీకి ఆడేందుకు పంత్‌కి అభ్యంతరం లేకపోతే..రూ.18 కోట్లకే అతడ్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ కూడా ఢిల్లీకి ఉండేది. కానీ.. వేలానికి వదిలేసి.. ఆఖర్లో చేజారుతున్నప్పుడు ఆర్టీఎం ప్రయోగించింది. అయితే.. లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లు ధర చెప్పడంతో.. ఆర్టీఎం కార్డుని ఢిల్లీ విత్‌డ్రా చేసుకుంది. దాంతో రిషబ్ పంత్ రూ.27 కోట్లకి లక్నో టీమ్ సొంతం అయ్యాడు.
రాహుల్‌ను పట్టించుకోని లక్నో
లక్నో ఫ్రాంఛైజీతో విభేదాల కారణంగా కేఎల్ రాహుల్ వేలానికి వచ్చాడు. దాంతో రిషబ్ పంత్ తరహాలో అతనికీ భారీ ధర దక్కుతుందని అభిమానులు ఆశించారు. అయితే.. రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన కేఎల్ రాహుల్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10 కోట్ల వరకూ పోటీపడ్డాయి.
కానీ.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ రూ.12 కోట్లకి పెంచగా..చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీతో అతని ధర రూ.14 కోట్లకి తాకింది. అయితే.. కేఎల్ రాహుల్ కోసం ఆర్టీఎం వాడే ఛాన్స్ ఉన్నా.. లక్నో సూపర్ జెయింట్స్ నిరాకరించింది. దాంతో రూ.14 కోట్లకే ఢిల్లీ సొంతం అయ్యాడు.
కెప్టెన్లని మార్చుకున్నారంతే
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఇన్నాళ్లు నడిపించగా.. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కి గత రెండేళ్ల నుంచి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ కెప్టెన్ లక్నోకి.. లక్నో కెప్టెన్ ఢిల్లీకి మారారు. రెండు ఫ్రాంఛైజీలు జస్ట్ కెప్టెన్లని మార్చుకున్నాయంతే.. అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
వేలంలో భారీ ధర పలికిన భారత క్రికెటర్లు
రూ.20 కోట్లపైనే ధర పలుకుతానని ఆశించిన రాహుల్ రూ.14 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ అతడ్ని రిటైన్ చేసుకొని ఉంటే కనీసం రూ.18 కోట్లు పైనే ఇచ్చి ఉండేది. భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ని రూ.26.75 కోట్లకి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ రూ.18 కోట్లు (పంజాబ్ కింగ్స్), పలకగా.. అర్షదీప్ సింగ్ రూ.18 కోట్లు (పంజాబ్ కింగ్స్), మహ్మద్ సిరాజ్ రూ.12.25 కోట్లు (గుజరాత్ టైటాన్స్), మహ్మద్ షమీ రూ.10 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్) మంచి ధరకే అమ్ముడుపోయారు.