ఏ క్రికెట్ మ్యాచ్ అయినా సరే లైవ్ స్కోర్స్ అనేవి చాలా ఆసక్తి రేపుతాయి. ప్రతి అభిమాని ఈ లైవ్ స్కోరు కోసం వెతుకుతుంటారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఎవరు ఎన్ని పరుగులు చేశారు? ఎన్ని వికెట్లు తీశారు? అదనపు పరుగులు ఎన్ని? మ్యాచ్‌లో కీలకమైన మలుపులు ఏంటి? ఇవన్నీ లైవ్ స్కోర్ల ద్వారానే తెలుస్తుంటాయి. ఈ లైవ్ స్కోర్లు, కామెంటరీ ఒక రకంగా మ్యాచ్ పూర్తి స్వరూపాన్ని కళ్లకు కడతాయి. అలాంటి క్రికెట్ లైవ్ స్కోర్లు తెలుసుకోవాలన్ని మీ ఆసక్తి మేరకు హిందుస్థాన్ టైమ్స్ తన అత్యాధునిక టెక్నాలజీ ద్వారా లైవ్ స్కోరు కేటగిరీని మీ ముందుకు తీసుకొస్తోంది. దీని ద్వారా ప్రతి అంతర్జాతీయ జట్టు ఆడబోయే, ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్ అప్‌డేట్స్, సమగ్ర స్కోరుకార్డులు, షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తాజా వార్తలు, మ్యాచ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు, ట్రివియాలు, గణాంకాలు, ఇలా క్రికెట్ చుట్టూ తిరిగే ప్రతి సూక్ష్మమైన అంశాన్ని మీకు అందిస్తాం. అంతర్జాతీయ జట్లు ఆడబోయే సిరీస్‌ల లైవ్ స్కోర్లు, కామెంటరీని ఈ లైవ్ స్కోర్ ద్వారా మీరు తెలుసుకునే వీలు కలుగుతుంది.
క్రికెట్ మ్యాచ్ లైవ్ స్కోర్లు తెలుసుకోవాలని ప్రతి అభిమాని ఆరాటపడతాడు. ఇంట్లో అయినా, ఆఫీసులో ఉన్నా, ఏదైనా ప్రయాణం చేస్తున్నా.. ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ చూడలేకపోతుంటే కనీసం స్కోరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ లైవ్ స్కోర్ల ద్వారా మ్యాచ్‌కు సంబంధించిన ప్రతి క్షణం అప్‌డేట్స్ క్రికెట్ అభిమానులకు చేరతాయి. ఇలా లైవ్ స్కోరు చెక్ చేయడానికి ఇప్పుడు ఎన్నో వెబ్‌సైట్లు, యాప్స్, సోషల్ మీడియా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఎక్కడ ఉన్నా కూడా క్రికెట్ మ్యాచ్ లైవ్ చూసే వీలు కలుగుతోంది. ఇక క్రికెట్ కు సంబంధించి మెగా ఈవెంట్లు అంటే ఆసియా కప్, వరల్డ్ కప్, యాషెస్ సిరీస్, ఐపీఎల్ లాంటి ఈవెంట్లలో ఈ లైవ్ స్కోర్లు తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇలాంటి లైవ్ కవరేజ్ మొత్తం హిందుస్థాన్ టైమ్స్ మీ ముందుకు తీసుకొస్తుంది. మీరు ఎక్కడున్నా లైవ్ స్కోర్లు, కామెంటరీ, కీలక మలుపులు వంటి ముఖ్యమైన సమాచారాన్ని మా వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.