ఆసియా కప్ షెడ్యూల్, Asia Cup Schedule in Telugu - HT Telugu

ఆసియా కప్ షెడ్యూల్


ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరుగుతుంది. ఈసారి టోర్నీకి రెండు దేశాలు ఆతిథ్యమిస్తున్నాయి. పాకిస్థాన్, శ్రీలంకలలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ దగ్గరే ఉన్నా.. ఆ దేశంలో పర్యటించబోమని బీసీసీఐ తేల్చి చెప్పడంతో ఇండియా ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఆగస్ట్ 30న టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ తలపడతాయి. ఈ మ్యాచ్ ముల్తాన్‌లో జరగనుంది. ఇక టోర్నీకే హైలైట్ అయిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో జరుగుతుంది. ఈ రెండు దేశాలు మరోసారి సెప్టెంబర్ 10న సూపర్ 4లోనూ తలపడే అవకాశం ఉంది. టోర్నీ గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు జరుగుతాయి. అందులో నాలుగు పాకిస్థాన్‌లో, మిగిలిన 9 శ్రీలంకలో జరుగుతాయి. సెప్టెంబర్ 17న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఆసియా కప్ 2023లో మొత్తం ఆరు టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ సహా శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ ట్రోఫీ కోసం తలపడతాయి. ఇందులో నేపాల్ కు ఇదే తొలి ఆసియా కప్ టోర్నీ. గతేడాదిలాగే ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ కనీసం రెండుసార్లు తలపడేలా టోర్నీ షెడ్యూల్ రూపొందించారు. గ్రూప్ ఎలో ఉన్న ఇండియా, పాకిస్థాన్ సూపర్ 4 చేరడం దాదాపు ఖాయం. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప నేపాల్ లీగ్ స్టేజ్ దాటడం అసాధ్యం. ఈ నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్ సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 10వ తేదీల్లో తలపడతాయి. ఈ రెండు జట్లే ఫైనల్ చేరితే సెప్టెంబర్ 17న ముచ్చటగా మూడోసారీ ఆడే అవకాశం ఉంటుంది. ఇండియా తన మ్యాచ్‌లను క్యాండీ, కొలంబోల్లో ఆడనుంది.

మ్యాచ్‌లుతేదీసమయంవేదిక

వార్తలు

FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)

ఆసియా కప్ 2023కు ఆతిథ్యం ఇవ్వ‌నున్న దేశాలు ఏవి?

ఆసియా కప్ 2023 కి పాకిస్థాన్‌, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 17 వరకు ఆసియా క‌ప్‌ జ‌రుగ‌నుంది.

ఆసియా కప్ 2023 ఏ దేశాల్లో జ‌రుగ‌నుంది?

ఆసియా క‌ప్ 2023 పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక‌ల‌లో నిర్వ‌హించ‌నున్నారు.

ఆసియా కప్ 2023 కోసం ఆతిథ్య పాకిస్థాన్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌లు ఆడ‌నుందా?

ఆసియా క‌ప్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌ల‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వ‌నుంది. భ‌ద్ర‌తా కార‌ణాల వ‌ల్ల పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించ‌డానికి భార‌త జ‌ట్టు తిర‌స్క‌రించింది.

ఆసియా కప్ 2023 లో టీమ్ ఇండియా షెడ్యూల్‌?

ఆసియా క‌ప్‌లో టీమ్ ఇండియా ఐదు మ్యాచ్‌లు ఆడ‌నుంది. లీగ్ దశలో పాకిస్థాన్‌, నేపాల్‌ల‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఆ త‌ర్వాత సూపర్ ఫోర్ రౌండ్‌లో క్వాలిఫ‌యింగ్ టీమ్‌ల‌తో మ‌రో మూడు మ్యాచ్‌ల‌ను టీమ్ ఇండియా ఆడ‌నుంది.

ఆసియా కప్ 2023లోపాల్గొన‌నున్న టీమ్‌లు ఏవి?

ఆసియా కప్ 2023లో మొత్తం ఆరు టీమ్‌లు పాల్గొన‌నున్నాయి. భారత్, పాకిస్థాన్ ఫేవ‌రేట్లుగా బ‌రిలో దిగ‌నున్నాయి. వీటితో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ప‌సికూన నేపాల్ కూడా ఆసియా క‌ప్‌లో ఆడ‌నుంది.

ఆసియా క‌ప్‌లో పాకిస్థాన్‌, శ్రీలంక‌ల‌లో ఎన్నేసి మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి?

ఆసియా క‌ప్ 2023లో నాలుగు మ్యాచ్‌ల‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. మిగిలిన మ్యాచ్‌లు శ్రీలంక వేదిక‌గా జ‌రుగున్నాయి.

ఆసియా క‌ప్ 2023లో టీమ్ ఇండియా టైటిల్ గెలిచే అవ‌కాశాలు ఉన్నాయా?

ఆసియా క‌ప్ 2023 టైటిల్ ఫేవ‌రేట్ల‌లో ఒక‌టిగా టీమ్ ఇండియా బ‌రిలోకి దిగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త జ‌ట్టు ఏడు సార్లు ఆసియా క‌ప్ విజేత‌గా నిలిచింది. ఈ సారి క‌ప్ గెలిస్తే ఎనిమిదో సారి టైటిల్ సొంతం చేసుకున్న‌ జ‌ట్టుగా రికార్డ్ క్రియేట్ చేయ‌నుంది.

ఆసియా కప్ 16వ ఎడిషన్ ఏ దేశాల్లో జ‌రుగ‌నుంది?

2023లో జ‌రుగ‌నున్న ఆసియా కప్ 16వ ఎడిషన్‌కు పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి.

ఆసియా క‌ప్ 2023 కోసం పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించేందుకు భార‌త్ నిరాక‌రించిందా?

రెండు దేశాల‌ మ‌ధ్య ఉన్న రాజ‌కీయ ప‌ర‌మైన వైరుధ్యాల, భ‌ద్ర‌తా కార‌ణాల‌ నేప‌థ్యంలో ఆసియా క‌ప్ కోసం పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించేందుకు టీమ్ ఇండియా తిర‌స్క‌రించింది. దాంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించింది.

ఆసియా కప్ 2023లో టీమ్ ఇండియా ఉన్న గ్రూప్ ఏది?

ఆసియా క‌ప్ 2023లో దాయాది దేశం పాకిస్థాన్‌తో క‌లిసి టీమ్ ఇండియా గ్రూప్ A లో ఉంది. ఈ రెండు జ‌ట్ల‌తో పాటు నేపాల్ కూడా గ్రూప్ A లో చోటు ద‌క్కించుకున్న‌ది.

ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ జట్టు ఏ గ్రూప్‌లో ఉంది?

పాకిస్థాన్‌, నేపాల్ ల‌తో క‌లిసి పాకిస్థాన్‌ గ్రూప్ A లో ఉంది

ఆసియా కప్ 2023 లో ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్క‌డ జ‌రుగ‌నుంది?

ఆసియా క‌ప్‌లో పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా సెప్టెంబ‌ర్ 2న త‌ల‌ప‌డ‌నుంది. క్యాండీ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఆసియా క‌ప్‌లో ఇది మూడో మ్యాచ్‌. మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌ నుంచి ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభంకానుంది.

2023 ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మెట్‌లో జ‌రుగ‌నుందా?

ఈ ఏడాది ఆసియా క‌ప్‌ను 50 ఓవ‌ర్ల ఫార్మెట్ (వ‌న్డే) లో నిర్వ‌హించ‌బోతున్నారు. చివ‌ర‌గా 2018లో వ‌న్డే ఫార్మెట్‌లో ఆసియా క‌ప్ జ‌రిగింది.