ఆసియా కప్‌లో టాప్ స్కోరర్లు
ఆసియా కప్‌లో ఇప్పటి వరకూ 1000కిపైగా పరుగులు చేసిన బ్యాటర్లు కేవలం ఇద్దరు మాత్రమే. ఈ ఇద్దరూ శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య, సంగక్కర కావడం విశేషం. అయితే ఈసారి 883 పరుగులతో ఉన్న రోహిత్ శర్మ, 858 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లి వెయ్యి పరుగుల మార్క్ దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు టీమిండియా బ్యాటర్లు వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆసియా కప్ ఆడారు. ఈసారి వన్డే ఫార్మాట్ కావడంతో 1000కిపైగా పరుగులు చేయడం ఈ ఇద్దరికీ సులువే.
Player | Teams | Runs | SR | Mat | Inn | NO | HS | Avg | 30s | 50s | 100s | 6s | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ![]() | IND | 302 | 93 | 6 | 6 | 2 | 121 | 75 | 0 | 2 | 1 | 6 |
2 | ![]() | SL | 270 | 85 | 6 | 6 | 0 | 92 | 45 | 0 | 3 | 0 | 5 |
3 | ![]() | SL | 215 | 89 | 6 | 6 | 0 | 93 | 35 | 1 | 2 | 0 | 2 |
4 | ![]() | PAK | 207 | 97 | 5 | 4 | 0 | 151 | 51 | 0 | 0 | 1 | 4 |
5 | ![]() | PAK | 195 | 94 | 5 | 4 | 2 | 86* | 97 | 1 | 2 | 0 | 3 |
6 | ![]() | IND | 194 | 107 | 6 | 5 | 1 | 74* | 48 | 0 | 3 | 0 | 11 |
7 | ![]() | BAN | 193 | 85 | 2 | 2 | 0 | 104 | 96 | 0 | 1 | 1 | 2 |
8 | ![]() | PAK | 179 | 122 | 5 | 3 | 1 | 109* | 89 | 1 | 0 | 1 | 6 |
9 | ![]() | SL | 179 | 74 | 6 | 6 | 2 | 62* | 44 | 2 | 1 | 0 | 3 |
10 | ![]() | BAN | 173 | 97 | 5 | 5 | 1 | 80 | 43 | 1 | 2 | 0 | 4 |
11 | ![]() | IND | 169 | 89 | 4 | 3 | 1 | 111* | 84 | 1 | 0 | 1 | 2 |
12 | ![]() | BAN | 158 | 84 | 5 | 5 | 1 | 112 | 39 | 0 | 0 | 1 | 3 |
13 | ![]() | BAN | 158 | 68 | 5 | 5 | 0 | 82 | 31 | 0 | 2 | 0 | 3 |
14 | ![]() | IND | 143 | 81 | 6 | 4 | 1 | 82 | 47 | 1 | 1 | 0 | 3 |
15 | ![]() | SL | 132 | 78 | 6 | 6 | 0 | 41 | 22 | 2 | 0 | 0 | 0 |
వార్తలు
FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)
వన్డేల్లో విరాట్ కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 పరుగులు. పాకిస్థాన్ మీద ఈ ఘనత సాధించాడు కోహ్లీ. ఢాకాలో 2012 ఆసియా కప్ సమయంలో భారత్ 13 బంతులు మిగిలి ఉండగానే 330 పరుగులు ఛేదించింది భారత్. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇది సచిన్ టెండూల్కర్‌కు చివరి వన్డే.
ఆసియా కప్‌లో రోహిత్ శర్మ మీద గొప్ప రికార్డు ఉంది. 22 వన్డేల్లో 745 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 23 మ్యాచ్ ల్లో 971 పరుగులు చేసిన మెుదటి స్థానంలో ఉన్నాడు. ఆ జాబితాలో రెండో స్థానం రోహిత్ శర్మదే.
వాస్తవానికి ఆసియా కప్ 2023 పూర్తిగా పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించింది. దీంతో టోర్నమెంట్ పాకిస్థాన్, శ్రీలంకలో జరుగుతుంది.
ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు పోటీ పడనున్నాయి.
ఆసియా కప్ అనేది ఈ ఖండంలోని కొన్ని దేశాలు ఆడతాయి. కాంటినెంటల్ ఛాంపియన్ షిప్ అన్నమాట. గెలిచిన టీమ్ ఆసియా ఛాంపియన్ గా ఉంటుంది. ఈ టోర్నమెంట్ 1984 నుండి మెుదలైంది. దీనికంటే ఏడాది ముందు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏర్పడింది.
ఏమో కొన్నిసార్లు ఇది కూడా జరగొచ్చు. ఎందుకంటే గతంలో కూడా లీగ్ దశలో లేదా సూపర్ 4 దశలో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయి భారత్ ఆసియా కప్‌ను గెలుచుకుంది.
విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో ఒకసారి ఆడలేదు. కారణం BCCI అప్పటి భారత కెప్టెన్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. విరాట్ కోహ్లి 2018 ఆసియా కప్ ఎడిషన్‌ను ఆడలేదు. కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ శర్మ భారత్‌కు నాయకత్వం వహించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది టీమిండియా.
పాకిస్థాన్ గతంలో భారత్‌ను ఓడించింది. అన్ని కుదిరితే మళ్లీ ఓడించగలదు.
ఆసియా కప్‌లో భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించగలదు. ఒక ఉదాహరణ ఏంటంటే 2012లో ఒకసారి సచిన్ టెండూల్కర్ 100వ సెంచరీని బంగ్లాదేశ్ చెడగొట్టింది.
విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత T20I సెంచరీని సాధించడం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా పాకిస్థాన్‌పై మంచి పరుగులు కొట్టడం, ఆసియా కప్ 2022 ట్రోఫీని శ్రీలంక గెలవడం లాంటి మంచి మూమెంట్స్ ఉన్నాయి.
2012 ఆసియాకప్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యధిక స్కోరు 183 పరుగులు చేశాడు.
ఈ సంవత్సరం ప్రారంభంలో శిఖర్ ధావన్ ను భారత వన్డే జట్టు నుండి తొలగించారు. ఒకవేళ అతడిని ఆసియా కప్ ఆడేందుకు పిలిస్తే అది నిజంగా ఆశ్చర్యకరం.
భారతదేశం, పాకిస్థాన్, శ్రీలంక మూడు అత్యంత గట్టి పోటీనిచ్చే జట్లు. ఆసియా కప్ 2023 గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఈ జట్లకే ఉంది.