ఆసియా కప్ 2023 పాయింట్ల టేబుల్
ఆసియా కప్ 2023 గ్రూప్స్ చూస్తే గ్రూప్ ఎలో సూపర్ 4 చేరుకునే టీమ్స్ ఏవో సులువుగా చెప్పొచ్చు. ఇండియా, పాకిస్థాన్ లాంటి జట్లను దాటి తొలిసారి ఆసియా కప్ ఆడుతున్న నేపాల్ సూపర్ 4 చేరడం దాదాపు అసాధ్యం. ఒకవేళ ఇండియా, పాకిస్థాన్ సూపర్ 4 చేరితే ఏ1గా పాకిస్థాన్, ఏ2గా ఇండియా ఉంటాయి. గ్రూప్ బి నుంచి ఎవరు సూపర్ 4 చేరతారన్నది చెప్పడం కాస్త కష్టమే. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఒకదానికొకటి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఇక గ్రూప్ బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్ 4 చేరతాయనుకుంటే.. బంగ్లాదేశ్ బీ1గా, శ్రీలంక బీ2గా ఉంటాయి. వీటిలో ఏ1, బీ2 మధ్య జరగబోయే సూపర్ 4 మ్యాచ్ మాత్రమే పాకిస్థాన్‌లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లు శ్రీలంకలో ఉంటాయి.
Asia Cup Points Table 2024 - Super 4
Pos | Teams |
---|---|
1 | indindia |
2 | slsri lanka |
3 | banbangladesh |
4 | pakpakistan |
Matches | Won | Lost | Tied | NR | Points | NRR | Series Form |
---|---|---|---|---|---|---|---|
3 | 2 | 1 | 0 | 0 | 4 | +1.753 | LWW |
3 | 2 | 1 | 0 | 0 | 4 | -0.134 | WLW |
3 | 1 | 2 | 0 | 0 | 2 | -0.463 | WLL |
3 | 1 | 2 | 0 | 0 | 2 | -1.283 | LLW |
Pos: Position, Pld: Played, Pts: Points, NRR: Net Run Rate
Asia Cup Points Table 2024 - Group A
Pos | Teams |
---|---|
1 | pakpakistan |
2 | indindia |
3 | nepnepal |
Matches | Won | Lost | Tied | NR | Points | NRR | Series Form |
---|---|---|---|---|---|---|---|
2 | 1 | 0 | 0 | 1 | 3 | +4.760 | AW |
2 | 1 | 0 | 0 | 1 | 3 | +1.028 | WA |
2 | 0 | 2 | 0 | 0 | 0 | -3.572 | LL |
Pos: Position, Pld: Played, Pts: Points, NRR: Net Run Rate
Asia Cup Points Table 2024 - Group B
Pos | Teams |
---|---|
1 | slsri lanka |
2 | banbangladesh |
3 | afgafghanistan |
Matches | Won | Lost | Tied | NR | Points | NRR | Series Form |
---|---|---|---|---|---|---|---|
2 | 2 | 0 | 0 | 0 | 4 | +0.594 | WW |
2 | 1 | 1 | 0 | 0 | 2 | +0.373 | WL |
2 | 0 | 2 | 0 | 0 | 0 | -0.910 | LL |
Pos: Position, Pld: Played, Pts: Points, NRR: Net Run Rate
Asia Cup Points Table 2022-SUPER FOUR
Pos | Team | Mat | Won | Lost | Tied | N/R | Pts | NRR |
---|---|---|---|---|---|---|---|---|
1 | SRI LANKASL | 3 | 3 | 0 | 0 | 0 | 6 | 0.701 |
2 | PAKISTANPAK | 3 | 2 | 1 | 0 | 0 | 4 | -0.279 |
3 | INDIAIND | 3 | 1 | 2 | 0 | 0 | 2 | 1.607 |
4 | AFGHANISTANAFG | 3 | 0 | 3 | 0 | 0 | 0 | -2.006 |
Asia Cup Points Table 2022-GROUP A
Pos | Team | Mat | Won | Lost | Tied | N/R | Pts | NRR |
---|---|---|---|---|---|---|---|---|
1 | INDIAIND | 2 | 2 | 0 | 0 | 0 | 4 | 1.096 |
2 | PAKISTANPAK | 2 | 1 | 1 | 0 | 0 | 2 | 3.811 |
3 | HONG KONGHK | 2 | 0 | 2 | 0 | 0 | 0 | -4.875 |
Asia Cup Points Table 2022-GROUP B
Pos | Team | Mat | Won | Lost | Tied | N/R | Pts | NRR |
---|---|---|---|---|---|---|---|---|
1 | AFGHANISTANAFG | 2 | 2 | 0 | 0 | 0 | 4 | 2.467 |
2 | SRI LANKASL | 2 | 1 | 1 | 0 | 0 | 2 | -2.233 |
3 | BANGLADESHBAN | 2 | 0 | 2 | 0 | 0 | 0 | -0.576 |
వార్తలు
FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)
ఆసియా కప్‌లో ప్రతి మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రెండు పాయింట్స్ దక్కుతాయి. ఒకవేళ మ్యాచ్ టై అయితే రెండు జట్లకు సమానంగా తలో పాయింట్ లభిస్తుంది. ఆసియా కప్‌లో మొత్తం ఆరు టీమ్స్ పాల్గొననున్నాయి. ఇందులో సూపర్ ఫోర్ రౌండ్‌కు నాలుగు టీమ్స్ వెళతాయి. అందులో విజేతగా నిలిచిన రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.
గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, నేపాల్‌లు ఉండగా, గ్రూప్ Bలో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ స్థానాన్ని దక్కించుకున్నాయి.
2023 ఆసియా కప్ టైటిల్ ఫేవరేట్స్‌లో టీమ్ ఇండియా ఒకటి . ఇప్పటివరకు టీమ్ ఇండియా ఏడు సార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఎనిమిదోసారి టైటిల్‌ను సొంతం చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఆసియా కప్ 2023 పాకిస్థాన్ తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఈ ఏడాది ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాలి. కానీ భద్రతాపరమైన కారణాల వల్ల పాకిస్థాన్‌లో టీమ్ ఇండియా ఆడటానికి తిరస్కరించడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) హైబ్రిడ్ మోడల్‌తో ఆసియా కప్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆసియా కప్‌లో గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్‌లు ఉండగా, గ్రూప్ Bలో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి.
భారత్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, నేపాల్ తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక 2023 ఆసియా కప్ లో తలపడనున్నాయి
2022 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా విజయాన్ని సాధించింది. ఈ సారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తోన్నాయి.
గత ఏడాది ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌లో శ్రీలంక చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
భద్రతా కారణాల వల్ల పాకిస్థాన్‌లో టీమ్ ఇండియా పర్యటించడం లేదు. టీమ్ ఇండియా మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది.
ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌కు మంచి రికార్డ్ ఉంది. 2012, 2018లో ఆసియా కప్ లలో బంగ్లాదేశ్ ఫైనల్ చేరుకున్నది. 2023 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ అండర్‌డాగ్‌గా బరిలో దిగుతోంది.
భారత్ ఇప్పటివరకు 7 సార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది. 2016, 2018లో బ్యాక్-టు-బ్యాక్ ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నది.
ఈ ఏడాది ఆరంభంలో వన్డే టీమ్‌లో శిఖర్ ధావన్ చోటు కోల్పోయాడు. ఓపెనర్ల స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్‌గిల్ నిలకడగా రాణిస్తుండటంతో శిఖర్ ధావన్ పునరాగమనానికి దారులు మూసుకుపోయాయి.
ఆసియా కప్ 2012 ఎడిషన్‌లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది.
2023 ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగుతోన్నాయి.
ఆసియా కప్ 2023 కోసం సెలెక్షన్ కమిటీ ఇప్పటివరకు తుది జట్టును ప్రకటించలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు స్టార్ ఆల్‌రౌండర్స్ హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలు తప్పకుండా జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. . వారితో పాటు పేసర్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొని తొలిసారి 2016లో టీ20 ఫార్మెట్‌లో ఆసియా కప్‌ను నిర్వహించారు. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత 2018లో వన్డే ఫార్మెట్‌లో నిర్వహించారు. ఈ ఏడాది వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో మరోసారి వన్డే ఫార్మెట్‌లోనే ఆసియా కప్ జరుగనుంది.