IND vs AUS: చివరి రెండు టెస్టులకు ఓపెనర్‌పై వేటు వేసిన ఆస్ట్రేలియా.. టీమ్‍లోకి 19ఏళ్ల బ్యాటర్.. మరో మార్పు కూడా..
IND vs AUS 4th Test: కీలకమైన నాలుగో టెస్టు కోసం ఆస్ట్రేలియా కీలక మార్పులు చేసింది. ఫామ్ కోల్పోయిన ఓపెనర్ మెక్‍స్వినీ స్థానంలో ఓ యువ బ్యాటర్‌కు చోటు ఇచ్చింది. మరో ఛేంజ్ కూడా ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ రసవత్తరంగా మారింది. మూడు టెస్టుల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఈ ఐదు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1–1గా ఉంది. అందుకే సిరీస్ దక్కించుకోవాలంటే ఇరు జట్లకు నాలుగో టెస్టు అత్యంత కీలకంగా మారింది. డిసెంబర్ 26న మెల్‍బోర్న్ వేదికగా ఈ బాక్సిండ్ డే టెస్టు మొదలుకానుంది. ఈ తరుణంలో జట్టులో రెండు మార్పు చేసింది ఆస్ట్రేలియా. నాలుగు, ఐదో టెస్టుల కోసం జట్టును నేడు (డిసెంబర్ 20) ప్రకటించింది.
మెక్‍స్వినీపై వేటు
ఆస్ట్రేలియా ఓపెనర్ నాథన్ మెక్‍స్వినీ.. భారత్‍తో సిరీస్‍లో విఫలమవుతున్నాడు. ఫామ్ కోల్పోయాడు. ఇండియాతో ఈ సిరీస్‍లో మూడు టెస్టుల్లో 72 పరుగులు మాత్రమే మెక్‍స్వినీ చేశారు. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా చేతిలో వరుసగా ఔట్ అయ్యాడు. పేలవంగా ఆడుతున్న మెక్‍స్వినీని నాలుగో టెస్టు నుంచి తప్పించింది ఆస్ట్రేలియా.
భారత్‍తో అరంగేట్రం చేసిన తొలి టెస్టులో మెక్‍స్వినీ 10,0 స్కోర్లు చేశాడు. తర్వాతి రెండు టెస్టుల్లో 39, 10 నాటౌట్, 9, 4 పరుగులకే పరిమితం అయ్యాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఐదుసార్లలో నాలుగుసార్లు బుమ్రా బౌలింగ్‍లోనే ఔటయ్యాడు. దీంతో మెక్‍స్వినీని తప్పించేందుకే ఆసీస్ మొగ్గుచూపింది.
19 ఏళ్ల ప్లేయర్‌కు చోటు
దేశవాళీ క్రికెట్‍లో దుమ్మురేపుతున్న 19 ఏళ్ల బ్యాటర్ సామ్ కోన్‍స్టాస్‍కు నాలుగో టెస్టులో చోటు ఇచ్చింది ఆస్ట్రేలియా. దీంతో అతడు అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డొమెస్టిక్ క్రికెట్‍లో కోన్‍స్టాస్ సూపర్ ఫామ్‍లో ఉన్నాడు. 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‍ల్లో 718 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. 51.76 సగటుతో ఉన్నాడు. దీంతో మెక్‍స్వినీ స్థానంలో భారత్‍తో నాలుగో టెస్టుకు కోన్‍స్టాస్‍ను ఆసీస్ మేనేజ్‍మెంట్ తీసుకుంది.
రిచర్డ్‌సన్‍కు ప్లేస్
గాయపడిన పేసర్ జోస్ హాజిల్‍వుడ్ స్థానంలో నాలుగు, ఐదో టెస్టుల్లో జాయ్ రిచర్డ్‌సన్‍కు ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కింది. మూడో టెస్టులో గాయపడిన హాజిల్‍వుడ్ కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో మొత్తంగా రెండు మార్పులతో నాలుగు, ఐదో టెస్టులకు 15 మందితో కూడిన జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది.
భారత్‍లో నాలుగు, ఐదో టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కోన్‍స్టాస్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కేరీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ లయాన్, మిచెల్ మార్ష్, జాయ్ రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఇండియాకు అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ ఆశలు నిలువాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈ మ్యాచ్ గెలువాలని కసిగా ఉంది. సిరీస్ నిలుపుకునేందుకు కూడా నాలుగో టెస్టు కీలకం. దీంతో బాక్సింగ్ డే టెస్టు చాలా రసవత్తరంగా మారింది.