Rahu-Ketu: ఇంట్లో రాహు-కేతువులు ఈ దిశలో నివసిస్తారు.. వాటి వలన ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ మార్పులు చేయండి-rahuketu lives in this direction of house do these to stay happy without any problems and no more problems will occur ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu-ketu: ఇంట్లో రాహు-కేతువులు ఈ దిశలో నివసిస్తారు.. వాటి వలన ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ మార్పులు చేయండి

Rahu-Ketu: ఇంట్లో రాహు-కేతువులు ఈ దిశలో నివసిస్తారు.. వాటి వలన ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ మార్పులు చేయండి

Peddinti Sravya HT Telugu
Dec 20, 2024 10:15 AM IST

Rahu-Ketu: ఇంట్లో జాతకంతో పాటుగా రాహువు, కేతువులు కూడా ఉంటారు. అందుకని ఈ దిశలో కొన్ని వస్తువులను పెట్టకూడదని గుర్తుపెట్టుకుని ఆచరించడం మంచిది. మరి ఏయే వస్తువులను ఈ దిశలో ఉంచకూడదు..? శుభ ఫలితాలు మొదలంటే ఏం చేయాలి..? ఇబ్బందుల నుంచి ఎలా బయటపడొచ్చు అనేది తెలుసుకుందాం.

Rahu-Ketu: ఇంట్లో రాహు-కేతువులు ఈ దిశలో నివసిస్తారు
Rahu-Ketu: ఇంట్లో రాహు-కేతువులు ఈ దిశలో నివసిస్తారు

జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను నీడ గ్రహాలు అని పిలుస్తారు. రాహువు, కేతువు అంటే ప్రజలు భయపడి పోతారు. ఇంట్లో జాతకంతో పాటుగా రాహువు, కేతువులు కూడా ఉంటారు. అందుకని ఈ దిశలో కొన్ని వస్తువులను పెట్టకూడదని గుర్తుపెట్టుకుని ఆచరించడం మంచిది. మరి ఏయే వస్తువులను ఈ దిశలో ఉంచకూడదు..? శుభ ఫలితాలు మొదలంటే ఏం చేయాలి..? ఇబ్బందుల నుంచి ఎలా బయటపడొచ్చు అనేది తెలుసుకుందాం.

ఇలా చేయడం వలన చాలా రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. రాహువు, కేతువులని పాపగ్రహాల వర్గంలో ఉంచుతారు. అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇవి అశుభం కలిగించే గ్రహాలు. జీవితంలో గందరగోళాన్ని కలిగిస్తూ ఉంటాయి. రాహువు, కేతువుల దుష్ప్రభావాలను నివారించడానికి వాటి నుంచి శుభ ఫలితాలను పొందడానికి అనేక రకాల చర్యలు తీసుకోవచ్చు. ప్రతీ ఇంట్లో కూడా రాహువు కేతువులు ఉంటారు అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.

రాహువు కేతువుల స్థానంలో ఇలా జరిగేలా చూసుకుంటే ఏ సమస్యా ఉండదు

కొన్ని వస్తువులు ఉంచినట్లయితే జీవితంలో సమస్యల నుంచి సులువుగా బయటపడడానికి అవుతుంది. రాహువు, కేతువులు ఇంటికి నైరుతి దిశలో ఉంటారు. ఎందుకంటే వారు ఈ దిశని పాలిస్తారు. అందుకని ముఖ్యంగా ఈ దిశలో లాకర్లు వంటి వాటిని పెట్టకూడదు.

విలువైన వస్తువులు, ఆభరణాలు, డబ్బుకు సంబంధించిన వస్తువులను ఈ దిశలో పెట్టడం మంచిది కాదు.

నైరుతి వైపు దేవుడు మందిరాన్ని నిర్మించడం కూడా మంచిది కాదు.

తులసి లేదా అరటి వంటి మొక్కల్ని కూడా ఉంచకూడదు. ఇలా చేయడం వలన పూజించిన ఫలితం లభించదు. లక్ష్మీదేవి కూడా ఉండదు.

పిల్లలు చదువుకి సంబంధించిన వస్తువులు, స్టడీ టేబుల్ వంటి వాటిని సెలవు ఉండడం మంచిది కాదు.

అలాగే బాత్రూమ్ ని కూడా ఈ దిశలో ఉంచకూడదు. ఇలా చేయడం వలన పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా ఈ దిశలో ఈ పొరపాటున చేయకుండా ఉంచితే ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండొచ్చు. ఒకవేళ వీటిని మీరు ఈ దిశలో ఉంచినట్లయితే పలు సమస్యలు రావొచ్చు. రాహువు కేతువుల దుష్ప్రభావాలు పడే అవకాశం వుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner