Chiranjeevi: తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి మూవీ గుర్తుకువస్తుంది, తాలూకా ఇప్పుడు ట్రెండింగ్: డైరెక్టర్-vennela kishore srikakulam sherlock holmes director mohan about chiranjeevi chantabbai movie and thaluka trending ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi: తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి మూవీ గుర్తుకువస్తుంది, తాలూకా ఇప్పుడు ట్రెండింగ్: డైరెక్టర్

Chiranjeevi: తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి మూవీ గుర్తుకువస్తుంది, తాలూకా ఇప్పుడు ట్రెండింగ్: డైరెక్టర్

Sanjiv Kumar HT Telugu
Dec 20, 2024 10:12 AM IST

Srikakulam Sherlock Holmes Director About Chiranjeevi: కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా నటించిన మరో సినిమా శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్. కామెడీ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు రైటర్ మోహన్ దర్శకత్వం వహించారు. ఇటీవల సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.

తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి మూవీ గుర్తుకువస్తుంది, తాలూకా ఇప్పుడు ట్రెండింగ్: డైరెక్టర్
తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి మూవీ గుర్తుకువస్తుంది, తాలూకా ఇప్పుడు ట్రెండింగ్: డైరెక్టర్

Vennela Kishore Srikakulam Sherlock Holmes Director: వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌'. ఈ సినిమాకు రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు.

శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ చిత్రాన్ని లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రైటర్ మోహన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. అలాగే చిరంజీవి మూవీకి ఉన్న సంబంధాన్ని తెలియజేశారు.

‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌‌’లో వెన్నెల కిశోర్ గారిని తీసుకోవడానికి కారణం?

-ఇది ఏడుగురికి సంబధించిన కథ. వెన్నెల కిశోర్ గారిది డిటెక్టివ్ రోల్. రైల్‌కి ఇంజన్ లాంటి క్యారెక్టర్. మిగతా బోగీలు కూడా ముఖ్యమే. ప్రతి పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుంది. ఇందులో డిటెక్టివ్ రోల్ కొంచెం హ్యుమర్‌తో ఉంటుంది. ఆ పాత్రకు వెన్నెల కిశోర్ గారు పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అయ్యారు.

-వెన్నెల కిశోర్ ఉత్తరాంధ్ర యాసని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని కష్టపడి నేర్చుకొని సినిమా చేశారు. సినిమాలో శ్రీకాకుళం యాస పట్ల చాలా కేర్ తీసుకున్నాం. కథలో క్రైమ్ కామెడీ ఎమోషన్ థ్రిల్ లవ్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటాయి.

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్‌ని తీసుకోవడానికి కారణం ?

-ఇది 1991లో జరిగే కథ. టీజర్‌లో చెప్పినట్లు రాజీవ్ గాంధీ గారు వైజాగ్ పర్యటన ముగించుకొని అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న సంఘటనలని ఎవరూ పట్టించుకోరు.

-అదే రోజు ఇంకొన్ని సంఘటనలు జరిగాయి. వీటి మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది షెర్లాక్ హోమ్స్‌ అనే ఫిక్షనల్ క్యారెక్టర్‌తో చాలా ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లేతో చేయడం జరిగింది. ఈ కథని ఎవరూ ప్రెడిక్ట్ చేయలేరు. చాలా సస్పెన్స్, థ్రిల్ ఉంటుంది.

చంటబ్బాయ్ తాలూక అని ట్యాగ్ పెటడానికి కారణం?

-తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి గారి చంటబ్బాయ్ గుర్తుకు వస్తుంది. షెర్లాక్ హోమ్స్‌ అనేది హాలీవుడ్ ఫిక్షనల్ క్యారెక్టర్. అది కొందరికి పరిచయం లేకపోవచ్చు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేవిధంగా వంశీ నందిపాటి గారి సూచన మేరకు ఆ ట్యాగ్‌ని పెట్టడం జరిగింది. అందులోనూ 'తాలూకా' అనేది ఇప్పుడు ట్రెండింగ్.

-వంశీ నందిపాటి గారికి ఈ సినిమా చాలా నచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో చాలా థ్రిల్ అయ్యారు. ఆయన సినిమా రిలీజ్ చేయడం చాలా అనందంగా ఉంది. ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలతో సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ఆర్ఆర్, సిజీని చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా చేయించారు. మా నిర్మాత రమణారెడ్డి గారికి, వంశీ గారికి మంచి సింక్ కుదిరింది.

Whats_app_banner