Gunde Ninda Gudi Gantalu Today Episode: ఒకేలా ఆలోచించిన నీలకంఠం, ప్రభావతి, సంజు.. చెల్లి పెళ్లి చూపులు చెడగొట్టిన బాలు
Gunde Ninda Gudi Gantalu Serial December 20 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 20 ఎపిసోడ్‌లో నీలకంఠం వేసిన ప్లాన్‌తో ఇంటికి వెళ్లి మౌనిక పెళ్లి చూపుల గురించి చెబుతుంది ప్రభావతి. ఆ పెళ్లి చూపులకు బాలు ఉండకుండా సంజు ప్లాన్ వేస్తాడు. పెళ్లి చూపులకు బాలు ఉండకూడదని ప్రభావతి కూడా అనుకుంటుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మౌనిక పెళ్లికి నీలకంఠం ఇంటికి వెళ్తారు ప్రభావతి, కామాక్షి. అక్కడ వెండి గ్లాసుల్లో జ్యూస్ ఇస్తారు. అది చూసి ప్రభావతి షాక్ అయి అలాగే ఉండిపోతుంది. మీ అభిప్రాయం చెప్పలేదని నీలకంఠం అంటాడు.
బిజినెస్‌లు చూసుకుంటాడు
అది వినని ప్రభావతిని తట్టి చెబుతుంది కామాక్షి. ఇంత పెద్దింటి సంబంధం కదా. కట్నకానుకలు కూడా ఆ రేంజ్‌లోనే అడుగుతారేమోనని ఆలోచిస్తుందని కామాక్షి కవర్ చేస్తుంది. కోట్లే కాదనుకుని మీ అమ్మాయిని అడుగుతున్నాం. లక్షల్లో కట్నం ఎందుకు అడుగుతాం. కానీ కట్నం అడగం అని నీలకంఠం అంటాడు. దాంతో మరింత షాక్ అవుతుంది ప్రభావతి. అబ్బాయి ఏం చేస్తున్నాడు అని కామాక్షి అడుగుతాడు.
నా బిజినెస్‌లు నాతోపాటు చూసుకుంటాడు. చాలా పద్ధతిగా పెంచాము. ఈ కాలంలో ప్రేమించిన అమ్మాయిల వెంటపడి వేధించకుండా డైరెక్ట్ మాకే వచ్చి చెప్పాడు అని నీలకంఠం అంటాడు. అప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడుతున్నారు అని రవి మ్యాటర్ కామాక్షి ఎత్తుతుంది. దాంతో ప్రభావతి కోపంగా చూస్తుంది. మీ అందరికి నచ్చితే రేపే పెళ్లి చూపులు అని నీలకంఠం అంటాడు. సరే అని ప్రభావతి వెళ్లిపోతుంటే ఆపి తన భార్య చేత చీర పెట్టిస్తాడు నీలకంఠం.
కామాక్షి కూడా తనకు పెడతారేమో అని చీర సర్దుకుంటుంది. తనకు పెట్టకపోవడంతో నిరాశ పడుతుంది. తర్వాత తన డ్రైవర్‌కు చెప్పి ఇంట్లో దిగబెట్టమంటాడు నీలకంఠం. దాంతో ప్రభావతి వాళ్లు వెళ్లిపోతారు. మరోవైపు తన ప్లాన్ సక్సెస్ అన్నట్లుగా నవ్వుతాడు నీలకంఠం. అన్నయ్యను త్వరగా ఒప్పించు అని ప్రభావతికి కామాక్షి చెబుతుంది. మరోవైపు సత్యం, రోహిణికి ప్రభావతి బయటకు వెళ్లినట్లు చెబుతుంది మీనా. ఇంతలో షూకి అంటుకున్న బురదను కారుకు తుడుస్తాడు మనోజ్.
ముందు మొహం చూపించమను
అది చూసిన బాలు సీరియస్ అయి వెంటనే కారు కడగమని అంటాడు. రోహిణి వాళ్ల నాన్న తలుచుకుంటే ఇలాంటి ఎన్నో కొంటాడు అని మనోజ్ అంటే.. ముందు ఆయన్ను మొహం చూపించమను అని బాలు కౌంటర్ వేస్తాడు. మనోజ్ నువ్వు కూడా ఏంటీ సిల్లీగా అని రోహిణి అంటుంది. ముందు కడగకపోయావో ఆ బురద మొత్తం నీ ప్యాంట్‌కు రాస్తాను అని బాలు అంటే.. మౌనిక నీళ్లు తెస్తుంది. మౌనికను ఆపిన బాలు వాడే కడగాలని అంటాడు.
దాంతో రోహిణి నీళ్లు తీసుకుని కడుగుతుంది. నా కారు జోలికి వస్తే బేజారు అవుతావ్ అని బాలు అంటుంటే ఇంతలో పెద్ద కారు వచ్చి ఉంటుంది. అందులో నుంచి ప్రబావతి హీరోయిన్ రేంజ్‌లో ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాక్ అవుతారు. అది చూసి చాలా గర్వంగా ప్రభావతి నడుస్తుంది. ఈ కారు ఎవరిది అని మనోజ్ అంటే.. మనదే అనుకో అని ప్రభావతి అంటుంది. తర్వాత మౌనిక దగ్గరికి వెళ్లి మెచ్చుకుంటుంది.
అన్ని కుదుర్తే ఈ కారు మౌనికదే అని కామాక్షి అంటుంది. ఏంటీ ఇద్దరు బార్‌కు వెళ్లి బీర్ కొట్టొచ్చారా అని బాలు అంటాడు. మన మౌనిక జాతకం అమోఘమైంది. మహారాణి యోగం పట్టిందని ప్రభావతి అంటుంది. మన రేంజ్ మారిపోయే విషయం చెబుతాను అని అందరిని లోపలికి తీసుకెళ్తుంది ప్రభావతి. మనోజ్‌ను ఆపిన కామాక్షి నువ్వెక్కడికి వెళ్తావో నాకు తెలుసు గానీ లోపలికి పదా. అదే నీ ఆఫీస్ నాకు తెలుసు కానీ పదా అని తీసుకెళ్తుంది.
ఇంటర్వెల్ సీన్‌లా ఉంది
వీళ్లిద్దరు కలిసారంటే ఇంటిమీదకు ఏదో ఉపధ్రవం తెచ్చినట్టే అని మీనాతో బాలు అంటాడు. మౌనికకు సంబంధించి కదా పదండి అని మీనా అంటుంది. ఇంట్లో నీలకంఠం వాళ్లుపెట్టిన చీర చూపించి మౌనికకు గొప్పింటి సంబంధం వెతుక్కుంటూ వచ్చిందని చెబుతుంది ప్రభావతి. నీలకంఠం ఆస్తి గురించి చెప్పి, వాళ్ల అబ్బాయి మన అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోడని అన్నాడట అని ప్రభావతి అంటుంది. దాంతో అతను ఎవరు అని బాలు అడిగితే తెలియదని మౌనిక అంటుంది.
ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉందని మనోజ్ అంటే.. అవును, సినిమాలో ఇంటర్వెల్ సీన్‌లా ఉంది. క్లైమాక్స్ బ్యాంగ్‌లా ఉంది. నేను వెళ్లకపోయి ఉంటే నమ్మేదాన్నే కాదని కామాక్షి అంటుంది. ఆ అబ్బాయి వెంట పడకుండా నేరుగా తల్లిదండ్రులకు చెప్పాడు అని గొప్పగా చెబుతుంది ప్రభావతి. అబ్బాయి గురించి వింటుంటే మంచివాడే అని అనిపిస్తుందని మీనా అంటుంది. పేరెంట్స్ కూడా మంచివాళ్లే అయింటారని రోహిణి అంటుంది. కట్నం కూడా వద్దని చెప్పారు. మనం ఓకే అంటే రేపే పెళ్లి చూపులు అని ప్రభావతి అంటుంది.
మౌనిక నువ్వేం అంటావ్ అని సత్యం అడిగితే.. మౌనిక ఆలోచిస్తుంది. ఇంకేం కళ్లు మూసుకుని ఒప్పేసుకోవే. మీ నాన్నకు మొన్నే గండం తప్పింది. ఇప్పుడు ఇంటింటికి తిరిగి సంబంధం చూడాల్సిన అవసరం లేదు. కాళ్ల దగ్గరికి వచ్చిన సంబంధం కాదనకూడదు అని తన రంగా గురించి చెబుతుంది. దాంతో బాలు పంచ్‌లు వేస్తాడు. అంతా ఓకే కానీ, అమ్మ తెచ్చిన సంబంధం అనే డౌట్‌గా ఉంది. వాళ్ల ఆస్తులు మాత్రమే చూసినట్లు అనిపిస్తుంది కానీ, మంచి మర్యాద చూసినట్లు లేదని బాలు అంటాడు.
పేరయ్యకు చెప్పేసేయ్
ఒరేయ్ అనుమానపక్షి. మనోజ్‌కు గొప్పింటి సంబంధం చూల్లేదా అని ప్రభావతి అంటుంది. అసలు వాళ్ల నాన్న మొహం కూడా చూడలేదు అని బాలు అంటాడు. ఏం లేకున్నా వాళ్ల నాన్న డబ్బున్నోడు అని అబద్ధం చెప్పిందా అని మనోజ్ అంటాడు. ఈ పెళ్లికి వాళ్ల నాన్న కూడా వస్తారు కదా అని ప్రభావతి అంటే.. రోహిణి షాక్ అవుతుంది. అమ్మ మౌనిక నీకు ఓకేనా. వాళ్లు పెళ్లి చూపులకు వస్తారట అని సత్యం అంటే.. వాళ్లు వచ్చాక తెలుస్తుంది కదా. మంచి మర్యాద చూసి చేస్తామని బాలు అంటాడు.
మీ అందరికి నచ్చితే నాదేముంది అన్నయ్య అని మౌనిక అంటుంది. దాంతో అంతా సంతోషిస్తారు. అమ్మో నాకు కాళ్లు చేతులు ఆడటం లేదు. పేరయ్యకు ఫోన్ చేసి చెప్పు అని కామాక్షికి చెబుతుంది ప్రభావతి. సరే అని కామాక్షి అంటుంది. మరోవైపు సరే రేపే వస్తామని నీలకంఠం అంటే.. రూట్ క్లియర్ అయినట్లుందని సంజు అంటాడు. లేదు. బాలుగాడు అడ్డం ఉన్నాడు. రేపు వాడు చూస్తే సంబంధానికి ఒప్పుకోడు అని నీలకంఠం అంటాడు.
దానికి నేను మాస్టర్ ప్లాన్ వేశాను. అని గిరిని పిలిచి ఫోన్ తీసుకుంటాడు సంజు. నా పేరు గిరి రేపు మీ కారు రైడ్‌కు కావాలి. ఉదయం పదింటికి అని సంజు మాట్లాడుతాడు. అది విని ప్రభావతి ఒప్పేసుకోమంటుంది. అన్నయ్య లేకుండా పెళ్లి చూపులు ఏంటీ అని మౌనిక అంటుంది. నేను వేరే కారు అరేంజ్ చేస్తాను. నాకు వేరే పర్సనల్ పని ఉంది. రెట్టింపు డబ్బు ఇచ్చిన రాలేను అని బాలు అంటాడు. నేను ఉన్నా కదా. నేను చూసుకుంటాను. నువ్ వచ్చేవరకు ఉండమని చెబుతాను అని సత్యం అంటాడు.
సాయంత్రం దాకా తిప్పు
దాంతో సరే అని వస్తానని చెబుతాడు బాలు. పదింటికి కరెక్ట్‌గా రావాలి అని సంజు అంటాడు. సరేనని బాలు అనడంతో ప్రభావతి, నీలకంఠం, సంజు హ్యాపీ అవుతారు. ఇక్కడ బాలు ఉండకూడదని నీలకంఠం, సంజు, ప్రభావతి ఒకేలా ఆలోచిస్తారు. రేపు వాడి ఇంటి దగ్గర కారు ఎక్కు. ఖాలీ కాటన్ బాక్స్‌లు పెట్టుకుని ఒక్కొక్కడి ఇంటి దగ్గర ఒక్కో బాక్సి ఇస్తూ ఊరంత తిప్పు. సాయంత్రం దాకా తిప్పుతునే ఉండాలి. నేను చెప్పేదాకా వాడు కారు దిగకూడదు అని గిరితో అంటాడు సంజు.
సరే నీ పెళ్లికి వాడు ఉంటాడు కదా. అప్పుడేం చేస్తావ్ అని నీలకంఠం అంటే.. దానికి ఒక ఐడియా ఉంది. నా పెళ్లికి ఎలాంటి అడ్డు ఉండదు అని సంజు అంటాడు. కట్ చేస్తే సంజు వాళ్లు పెళ్లి చూపులకు వెళ్తారు. కానీ, సడెన్‌గా మధ్యలో బాలు వచ్చి సంజును చూసి కోప్పడతాడు. ఇలాంటి వాడికి నా చెల్లిని ఇచ్చి చేయని అని తాంబూలాన్ని విసిరేస్తాడు బాలు. దాంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.