TGSWREIS Admissions: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష-applications for admissions to telangana gurukul vidyalayas to be accepted from tomorrow ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgswreis Admissions: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష

TGSWREIS Admissions: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 20, 2024 07:08 AM IST

TGSWREIS Admissions: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

TGSWREIS Admissions: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS విద్యా సంస్థల ఆధ్వర్యంలో పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2025 - 26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన వెలువడింది.

తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవటానికి సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు. SC,ST,BC, మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

ఇంగ్లీష్ మీడియం బోధనతో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం 2025 ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని జిల్లాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో జరిగే ప్రవేశ పరీక్ష కోసం అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు అన్ని వివరాలకు, ప్రాస్పెక్టస్ కోసం అయా శాఖల వెబ్‌సైట్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి ఈ లింకును అనుసరించందడి. https://tgswreis.telangana.gov.in . ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు ఈ లింకును అనుసరించండి. https://tgtwreis.telangana.gov.in/ మహాత్మ జ్యోతిరావ్‌ పూలే బీసీ వెల్ఫేర్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు https://mjptbcwreis.telangana.gov.in ప్రభుత్వ ప్రవేశాల నోటిఫికేషన్ కోసం https://tgcet.cgg.gov.in/TGCETWEB/

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు

1. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేది 21-12-2024 నుండి 1-2-2025 వరకు ఆన్ లైన్లో రూ.100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి . ఒక ఫోన్ నెంబర్ తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చు.

2. అభ్యర్థికి బదులుగా వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేస్తే అలాంటి వారిపై సెక్షన్ 416 ఆఫ్ IPC 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపడతారు.

3. విద్యార్థుల ఎంపికకు "ఉమ్మడి జిల్లా" ఒక యూనిట్ గా పరిగణిస్తారు.

4. అభ్యర్థికి మరింత సమాచారం అవసరమైతే లేదా వారికి ఏదైనా సమస్య ఉంటే వారు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

TGSWREIS-040-23391598

TGTWREIS-9491063511

MJPTBCWREIS-040-23328266

TGREIS-040-24734899

Whats_app_banner