తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live December 20, 2024: ED Focus on KTR : కేటీఆర్‌పై కేసు.. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ!
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 20 Dec 202407:42 AM IST
తెలంగాణ News Live: ED Focus on KTR : కేటీఆర్‌పై కేసు.. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ!
- ED Focus on KTR : మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపింది. ఈ వ్యవహారంపై ఈడీ ఫోకస్ పెట్టింది. తాజాగా.. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాసినట్టు తెలిసింది. కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీని ఈడీ కోరింది.
Fri, 20 Dec 202407:04 AM IST
తెలంగాణ News Live: ACB Case on KTR : నన్ను ఏ కేసులో అరెస్ట్ చేయాలో ముఖ్యమంత్రికి అర్థం కావడం లేదు : కేటీఆర్
- ACB Case on KTR : సీఎంకు సమాచారం లోపం ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎంను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారన్న కేటీఆర్.. తనపై కేసు నిలవదని ధీమా వ్యక్తం చేశారు. తాము లీగల్‌గా ముందుకు వెళ్తామని.. లంచ్ మోషన్ పిటిషన్ వేశామని చెప్పారు. తనను ఏ కేసులో అరెస్టు చేయాలో సీఎంకు ఆర్థం కావడం లేదన్నారు.
Fri, 20 Dec 202407:03 AM IST
తెలంగాణ News Live: APGVB Bifurcation: తెలంగాణలో కనుమరుగు కానున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్.. జనవరి 1న తెలంగాణలో కొత్త బ్యాంక్
- APGVB Bifurcation: వరంగల్ కేంద్రంగా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇకపై ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీజీవీబీని విభజించాలని నిర్ణయించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉత్తర్వులకు అనుగుణంగా బ్యాంకు విభజన జరుగుతోంది.
Fri, 20 Dec 202406:20 AM IST
తెలంగాణ News Live: HYD NTR Statue: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు భూమి.. రేవంత్ తీరుపై తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల అభ్యంతరం
- HYD NTR Statue: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహ నిర్మాణానికి భూమి కేటాయించాలని విజ్ఞప్తి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడాన్ని ఉద్యమ జర్నలిస్టులు తప్పు పడుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ విగ్రహ నిర్మాణానికి భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశాయి.
Fri, 20 Dec 202405:46 AM IST
తెలంగాణ News Live: TG Fancy Numbers : కాసుల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్సీ నంబర్లు.. వీటికే ఎక్కువ డిమాండ్!
- TG Fancy Numbers : తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు వరంగా మారాయి. కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్తుస్తున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ పరిధిలో వీటికి డిమాండ్ ఉంది. 3, 6, 9 నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
Fri, 20 Dec 202405:35 AM IST
తెలంగాణ News Live: Hyderabad Book Fair: భాగ్యనగరంలో పదిరోజుల పాటు పుస్తకాల పండుగ, ఎన్టీఆర్ స్టేడియంలో 29 వరకు నిర్వహణ..
Hyderabad Book Fair: భాగ్యనగరంలో పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 29వ తేదీ వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతుంది. తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రదర్శన ప్రారంభించారు. సామాజిక స్పృహ, సమాజంలో వస్తున్న మార్పులపై చర్చించేందుకు బుక్ ఫెయిర్ మంచి వేదిక అన్నారు.
Fri, 20 Dec 202404:02 AM IST
తెలంగాణ News Live: SIT on ORR : ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై సిట్ విచారణకు రేవంత్ ఆదేశం.. అసలు ఏం జరిగింది?
- SIT on ORR : తెలంగాణ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరం గరంగా మారాయి. కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. ఆ వెంటనే ఓఆర్ఆర్ కాంట్రాక్టులో అవకతవకలపై సిట్ ఏర్పాటు నిర్ణయంతో టీజీ పాలిటిక్స్ హీటెక్కాయి. కేటీఆర్ కేసు విషయం పక్కనబెడితే.. అసలు ఓఆర్ఆర్ కాంట్రాక్టులో ఏం జరిగిందో ఓసారి చూద్దాం.
Fri, 20 Dec 202402:43 AM IST
తెలంగాణ News Live: Peddapur Gurukulam: పెద్దాపూర్ గురుకులంలో స్టూడెంట్‌కు పాము కాటు... ప్రిన్సిపల్ సస్పెన్షన్..
- Peddapur Gurukulam: జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముల భయం నెలకొంది.నాలుగు మాసాల క్రితం ఇద్దరు విద్యార్థులు పాము కాటుతో ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం కలకలం సృష్టించింది.
Fri, 20 Dec 202401:38 AM IST
తెలంగాణ News Live: TGSWREIS Admissions: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష
- TGSWREIS Admissions: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
Fri, 20 Dec 202412:02 AM IST
తెలంగాణ News Live: Vemulawada Fraud: వేములవాడలో బ్యాంక్ వద్ద యువకుడి చేతివాటం...వృద్ధుడికి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నం
- Vemulawada Fraud: వేములవాడలో బ్యాంకు వద్ద వృద్ధుడిని నమ్మించి మోసం చేశాడు యువకుడు. డ్రా చేసిన డబ్బులు లెక్కించి ఇస్తానని చెప్పి చేతివాటం ప్రదర్శించి 7 వేల మాయం చేశాడు. పారిపోయేందుకు యత్నించి అడ్డంగా దొరికి కటకటాల పాలయ్యాడు.