OTT Thriller: ఓటీటీలో పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు వచ్చిన సత్యదేవ్ థ్రిల్లర్ చిత్రం.. ప్లాట్‍ఫామ్ ఏదంటే..
Zebra OTT Streaming: జీబ్రా సినిమా ఓటీటీలో పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. రెండు రోజుల క్రితం ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకే యాక్కెస్‍కు వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు సబ్‍స్క్రైబర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా చిత్రం థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నవంబర్ 22న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో తమిళ సీనియర్ యాక్టర్ సత్యదేవ్, కన్నడ నటుడు డాలి ధనంజయ్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. బ్యాంకింగ్ మోసాల చుట్టూ తిరిగే కథతో వచ్చిన జీబ్రా మూవీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే, ఆ స్థాయిలో వసూళ్లు రాలేదు. బాక్సాఫీస్ వద్ద మోస్తరు పర్ఫార్మెన్స్ చేసింది. ఇప్పుడు జీబ్రా మూవీ ఓటీటీలో పూర్తిస్థాయిలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
ఆహా సబ్‍స్క్రైబర్లందరికీ..
జీబ్రా సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (డిసెంబర్ 20) సాధారణ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ చిత్రం రెండు రోజుల కిందట డిసెంబర్ 18వ తేదీన ఆహా గోల్డ్ ప్లాన్ ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే, నేడు ఆహా సబ్‍స్క్రిప్షన్ ఉన్న యూజర్లందరికీ స్టీమింగ్‍కు యాక్సెస్ వచ్చింది. అంటే ఆహా సాధారణ ప్లాన్ ఉన్న వారు కూడా ఇప్పుడు ఈ చిత్రాన్ని చూసేయవచ్చు.
లక్కీ భాస్కర్ మూవీతో కొన్ని పోలికలు, పోటీ ఉండడం జీబ్రాకు ప్రతికూలంగా మారింది. బ్యాకింగ్ మోసాలు, బ్యాంకుల పనితీరు చుట్టూనే ఈ చిత్రం తిరుగుతుంది. కాస్త బ్యాక్‍డ్రాప్‍లో పోలికలు ఉన్నా.. జీబ్రా విభిన్నమైన స్టోరీతో, స్క్రీన్‍ప్లేతో సాగుతుంది. అందుకే మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సత్యదేవ్ నటనకు ప్రశంసలు దక్కాయి.
జీబ్రా మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సడెన్‍గా భారీగా డబ్బు అవసరమైన బ్యాంకు ఉద్యోగి ఏం చేశాడు.. ఎదురైన సవాళ్లు ఏంటనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంట్రెస్టింగ్ డ్రామాతో రూపొందించారు. కామెడీని కూడా జోడించారు.
జీబ్రా కలెక్షన్లు ఇలా..
జీబ్రా సినిమా సుమారు రూ.6.2 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ మంచి వసూళ్లు సాధించింది. అయితే, పాజిటివ్ టాక్‍కు తగ్గట్టుగా భారీగా మాత్రం వసూళ్లు రాలేదు. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాల నుంచి కూడా ఈ మూవీకి పోటీ ఎదురైంది.
జీబ్రా సినిమా కోసం ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ గట్టిగానే చేసింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. సత్యదేవ్ కూడా ఈ చిత్రంతో మోస్తరు విజయం అందుకున్నారు. ముఖ్యంగా తన పర్ఫార్మెన్స్‌తో మరోసారి అదరగొట్టారు.
జీబ్రా చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‍గా నటించారు. ధనంజయ, సత్యరాజ్‍తో పాటు అమృత అయ్యర్, శంకర్, సునీల్ వర్మ, సత్య కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు. బాల సుందరం, ఎస్ఎన్ రెడ్డి, దినేశ్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మించారు.
సంబంధిత కథనం