Satyadev: ఏటీఎంలో డబ్బు తీసినప్పుడు వచ్చే సౌండ్ వెనుక జరిగేదే సినిమా.. హీరో సత్యదేవ్ కామెంట్స్-hero satyadev comments on zebra movie story comparison with lucky bhaskar movie atm money withdrawal sound system ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Satyadev: ఏటీఎంలో డబ్బు తీసినప్పుడు వచ్చే సౌండ్ వెనుక జరిగేదే సినిమా.. హీరో సత్యదేవ్ కామెంట్స్

Satyadev: ఏటీఎంలో డబ్బు తీసినప్పుడు వచ్చే సౌండ్ వెనుక జరిగేదే సినిమా.. హీరో సత్యదేవ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Nov 22, 2024 10:33 AM IST

Satyadev About Zebra Movie Story: హీరో సత్యదేవ్ నటించిన లేటెస్ట్ బ్యాంకర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జీబ్రా. ఇవాళ థియేటర్లలో విడుదలవుతున్న జీబ్రా మూవీ విశేషాలను పంచుకున్నారు సత్యదేవ్. ఏటీఎంలో డబ్బులు తీసినప్పుడు ఓ సౌండ్ వస్తుందని, ఆ సౌండ్ వెనుక జరిగేదే జీబ్రా మూవీ అని సత్యదేవ్ చెప్పాడు.

ఏటీఎంలో డబ్బు తీసినప్పుడు వచ్చే సౌండ్ వెనుక జరిగేదే సినిమా.. హీరో సత్యదేవ్ కామెంట్స్
ఏటీఎంలో డబ్బు తీసినప్పుడు వచ్చే సౌండ్ వెనుక జరిగేదే సినిమా.. హీరో సత్యదేవ్ కామెంట్స్

Satyadev On Zebra Movie Story: టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ మూవీ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు.

జీబ్రా మూవీలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన జీబ్రా టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న అంటే ఇవాళ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సత్య దేవ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

జీబ్రా టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?

-జీబ్రా.. బ్లాక్ అండ్ వైట్‌కి మెటాఫర్. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. అలాగే చివరివరకూ ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలీదు. ప్రతిఒక్కరిలో గ్రే ఉంటుంది. అందుకే టైటిల్ ఫాంట్‌కి గ్రే పెట్టి, సినిమాకి జీబ్రా అనే టైటిల్ పెట్టారు. నాకు స్క్రిప్ట్ పంపినప్పుడే అదే టైటిల్‌తో వచ్చింది. అలాగే నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అన్ని రకాలుగా జీబ్రా టైటిల్ యాప్ట్.

బ్యాంక్ క్రైమ్ నేపథ్యంలో ఇటివల లక్కీ భాస్కర్ వచ్చింది. దానికి దీనికి డిఫరెన్స్ ఏమిటి?

-లక్కీ భాస్కర్ పీరియడ్ కథ. జీబ్రా కాంటెంపరరీ స్టొరీ. బ్యాంకర్ అనే క్యారెక్టర్ తప్పితే దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు బ్యాంక్ సిస్టం అంతా డిజిటల్ అయింది. ఇప్పుడు క్రైమ్ చేయడం అంత ఈజీ కాదు. బ్యాంక్‌లో పని చేసే వాళ్లకి తప్పితే సామాన్యులకు అక్కడ జరిగే మిస్టేక్స్ తెలీవు. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ గతంలో బ్యాంక్‌లో పని చేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్‌తో పాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెంట్స్‌తో ఈ కథని రాశారు.

-ఏటీఎంలో డబ్బులు తీసినప్పుడు ఓ సౌండ్‌తో డబ్బులు బయటికి వస్తాయి. ఆ సౌండ్ వెనుక ఏం జరుగుతుందనేదే ఈ సినిమా. కామన్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇందులో నేను బ్యాంకర్‌ని. ధనుంజయ గ్యాంగ్‌స్టర్.. మా రెండు ప్రపంచాలు ఎలా కలిశాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

డాలీ ధనంజయతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి?

-ఈ జర్నీలో చాలా క్లోజ్ అయ్యాం. పుష్పలో జాలీ రెడ్డి పాత్ర తనకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో చాలా మంచి శ్వాగ్ ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్‌గా చేశాడు. ఈ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గర అవుతాడు.

-ఈ సినిమా కన్నడలో కూడా రిలీజ్ అవుతుంది. అక్కడ తనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ కూడా సినిమా బాగా ఆడుతుంది. సునీల్, సత్యరాజ్, సత్య, ప్రియా భవానీ శంకర్ ఇలా పాత్రలన్నీ రెండు వరల్డ్స్ నుంచి ఎలా కలుస్తాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

Whats_app_banner